ETV Bharat / bharat

150 మంది ముస్లిం మేధావులతో సీఎం భేటీ - assam cm latest news

మైనారిటీల్లో జనాభా నియంత్రణ సహా ఈ వర్గాల అభివృద్ధికి ప్రణాళికలు రచించడమే లక్ష్యంగా అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ కీలక భేటీ నిర్వహించారు. 150 మందికి పైగా ముస్లిం ప్రముఖులతో సమావేశమయ్యారు.

Assam CM met over 150 leading indigenous Muslim personalities
150 మంది ముస్లిం మేధావులతో సీఎం భేటీ
author img

By

Published : Jul 4, 2021, 7:25 PM IST

దేశంలోని వివిధ వర్గాలకు చెందిన 150 మంది ముస్లిం ప్రముఖులను అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ శనివారం కలిశారు. జనాభా పెరుగుదల అనేది అభివృద్ధికి విఘాతంగా మారుతుందని వీరంతా అంగీకరించారని హిమంత పేర్కొన్నారు. సమావేశం అనంతరం మాట్లాడిన ఆయన.. అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు ఇచ్చేలా ఈ 150 మందితో ఎనిమిది బృందాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

Assam CM met over 150 leading indigenous Muslim personalities
మేధావులతో హిమంత భేటీ

సమావేశంలో హిమంత

"రచయితలు, వైద్యులు, కళాకారులు, చరిత్రకారులు, ప్రొఫెసర్లు వంటి.. 150 మందికి పైగా మేధావులతో సమావేశమయ్యాను. అసోం మైనారిటీలు ఎదుర్కొంటున్న సమస్యలపై మేం చర్చించాం. అసోంలోని కొన్ని ప్రాంతాల్లో జనాభా పెరుగుతుండటం వల్ల.. అభివృద్ధికి ఆటంకం కలుగుతుంది. భారత్​లోని ఉత్తమ ఐదు రాష్ట్రాల్లో అసోం నిలవాలంటే.. ముందుగా జనాభా విస్పోటంపై దృష్టిసారించాలి. ఈ విషయాలను సమావేశంలో పాల్గొన్నవారు అంగీకరించారు."

-హిమంత బిశ్వ శర్మ, అసోం సీఎం

ముస్లిం మేధావులతో ఏర్పాటు చేసిన ఈ బృందాలు మూడు నెలల్లోగా ప్రభుత్వానికి నివేదిక అందిస్తాయని హిమంత తెలిపారు. ఈ నివేదికలను విశ్లేషించిన అనంతరం.. మైనారిటీల సాధికారత కోసం రోడ్​మ్యాప్ సిద్ధం చేస్తామని చెప్పారు. వచ్చే ఐదేళ్ల పాటు ఈ రోడ్​మ్యాప్ ప్రకారం పనిచేస్తామని స్పష్టం చేశారు. త్వరలో ముస్లిం విద్యార్థి సంఘాలు, రాజకీయ నాయకులతోనూ భేటీ కానున్నట్లు వెల్లడించారు.

ఇదీ చదవండి:

'మైనారిటీలూ.. కుటుంబ నియంత్రణ పాటించండి'

సైనా ట్వీట్- ఆ రాష్ట్ర రాజకీయాల్లో దుమారం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.