ETV Bharat / bharat

అసోం సీఎంగా సోమవారమే 'హిమంత' ప్రమాణం - అసోం సీఎం న్యూస్​

అసోం ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వ శర్మ సోమవారం మధ్యాహ్నం ప్రమాణం చేయనున్నారు. ఆయనతో పాటు కేబినెట్​ మంత్రులు కూడా రేపే ప్రమాణస్వీకారం చేస్తారు. తనకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రధాని నరేంద్ర మోదీ, భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, అసోం మాజీ సీఎం సర్బానంద సోనోవాల్​కు హిమంత కృతజ్ఞతలు తెలిపారు.

Himanta Sarma, assam cm
అసోం సీఎంగా హిమంత, అసోం ముఖ్యమంత్రి
author img

By

Published : May 9, 2021, 8:12 PM IST

అసోం నూతన సీఎంగా హిమంత బిశ్వ శర్మ సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాజభవన్​లో జరిగే కార్యక్రమంలో ఆయనతో పాటు మంత్రులు కూడా ప్రమాణం చేయనున్నారు. తనను ముఖ్యమంత్రిగా ఎంపిక చేసినందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, అసోం మాజీ సీఎం సర్బానంద సోనోవాల్​కు హిమంత కృతజ్ఞతలు తెలిపారు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడతానని, సరైన పాలన అందిస్తానని చెప్పారు.

వారం రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు తెరదించుతూ గువాహటిలో ఆదివారం మధ్యాహ్నం జరిగిన సమావేశంలో హిమంతను ఎన్డీఏ శాసనసభా పక్షనేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఆ కూటమి పార్టీల నేతలు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, భాజపా జాతీయ కార్యదర్శి అరుణ్ సింగ్ సహా పార్టీ పరిశీలకులు పాల్గొన్నారు.

భేటీ పూర్తయ్యాక నేరుగా రాజ్​భవన్​ వెళ్లి అసోం గవర్నర్​ జగదీశ్ ముఖిని కలిశారు హిమంత. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన మద్దతు తనకు ఉందని భాజపా, ఏజీపీ, యూపీపీఎల్​ ఎమ్మేల్యేలు సంతకాలు చేసిన లేఖను సమర్పించారు. అనంతరం హిమంతను ముఖ్యమంత్రిగా నియమిస్తూ గవర్నర్​ ఉత్తర్వులు జారీ చేశారు.

ప్రతిపక్షాల శుభాకాంక్షలు..

అసోం ముఖ్యమంత్రిగా ఎంపికైనందుకు హిమంతకు ప్రతిపక్ష కాంగ్రెస్​, ఏఐయూడీఎఫ్​ శుభాకాంక్షలు తెలిపాయి. నూతన సీఎం రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తారని ఆశిస్తున్నట్లు అసోం కాంగ్రెస్ చీఫ్​ రిపున్​ బోరా​ ట్వీట్ చేశారు. హిమంత అంకిత భావంతో పనిచేస్తారని ఆశిస్తున్నట్లు ఏఐయూడీఎఫ్​ చీఫ్​ బహ్రుద్దిన్​ అజ్మల్ ట్విట్టర్ వేదికగా అభినందనలు తెలిపారు.

సోనోవాల్​పై పొగడ్తలు

తనకు సీఎం అవకాశం ఇచ్చిన మాజీ ముఖ్యంత్రి సర్బానంద సోనోవాల్​పై ప్రశంసల వర్షం కురిపించారు హిమంత. ఆయన ఐదేళ్ల పాలనలో ఓక్క అవినీతి ఆరోపణ కూడా లేదని కొనియాడారు. సర్బానందే తనకు మార్గదర్శకుడని, ఆయన దిశానిర్దేశం మేరకే నడుచుకుంటానని చెప్పారు.

ఇదీ చూడండి: అసోం సీఎంగా హిమంత- ఆయనే ఎందుకు?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.