అసోంలో అసెంబ్లీ ఎన్నికల మూడో దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. చివరి దశలో 82.29 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.
మూడో దశలో 40 నియోజకవర్గాల నుంచి బరిలో నిలిచిన 337 మంది అభ్యర్థుల భవిత్యాన్ని ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు.
ప్రత్యేక ఏర్పాట్లు
పోలింగ్ సమయంలో కొవిడ్ జాగ్రత్తలు పాటించేలా ఈసీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఓటర్లకు చేతి గ్లవ్స్తో పాటు మాస్కులు లేని వారికి అధికారులు మాస్కులు అందించారు. కొన్నిచోట్ల తొలిసారి ఓటు హక్కు వినియోగించుకున్న వారికి మొక్కలు అందించారు. వృద్ధులను అసోం సంస్కృతిని ప్రతిబింబించే శాలువలతో సత్కరించారు.
భాజపా మంత్రులు హిమాంత బిశ్వ శర్మ, చంద్రమోహన పట్వారీ, సిద్ధార్థ భట్టాచార్య, ఫణిభూషణ్ చౌదరి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ పట్వారీ, బీపీల్ చీఫ్ హగ్రామ మోహిలరీ, ప్రముఖ నటుడు కపిల్ బోరా కూడా ఓటు వేశారు.
ఇదీ చదవండి : అమిత్ షా, యోగిని చంపుతామని బెదిరింపు మెయిల్