ETV Bharat / bharat

భర్త రెండో పెళ్లి.. కోపంతో ఇంటిని తగలబెట్టిన మొదటి భార్య - woman sets house on fire

First wife sets House on Fire: వివాహం చేసుకొని పదేళ్లు అయినా పిల్లలు లేరనే కారణంతో రెండో పెళ్లి చేసకున్నాడు ఓ వ్యక్తి. దీనిని పట్ల ఆగ్రహంగా ఉండే మొదటి భార్య.. భర్తను తరచూ బెదిరించేది. తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటావని హెచ్చరించేది. ఈ క్రమంలోనే ఇంటిని సాంతం అగ్నికి ఆహుతినిచ్చింది. ఆ మంటల్లోనే ఆమె కూడా కాలిపోయింది.

woman sets house on fire
first wife sets house on fire
author img

By

Published : May 14, 2022, 7:49 PM IST

First wife sets House on Fire: భర్త రెండో వివాహం పట్ల ఆగ్రహంగా ఉన్న ఓ మహిళ ఏకంగా ఇంటికే తగలబెట్టింది. ఈ ఘటనలో కుటుంబంలోని నలుగురు ప్రాణాలు కోల్పోయారు. బిహార్​లోని ధర్భంగా జిల్లాలో శనివారం ఈ దారుణం జరిగింది.

woman sets house on fire
అగ్నికి ఆహుతవుతున్న ఇల్లు

ఇదీ జరిగింది: సుపౌల్​ బాజార్​కు చెందిన 40 ఏళ్ల ఖుర్షీద్ ఆలం.. పదేళ్ల క్రితం బీబీ పర్వీన్​ను (35) వివాహం చేసుకున్నాడు. వారికి పిల్లలు లేరు. పిల్లల కోసం రెండేళ్ల కిందట సమీప గ్రామానికి చెందిన రోష్మి ఖతూన్​ను పెళ్లి చేసుకున్నాడు ఖుర్షీద్. అయితే ఈ వివాహం పట్ల మొదటి భార్య పర్వీన్ సంతృప్తిగా లేదు. తీవ్ర పరిణామాలుంటాయని భర్తను తరచూ బెదిరిస్తూ ఉండేది.

ఈ క్రమంలోనే శనివారం ఉదయం 5 గంటల సమయంలో పెట్రోల్ పోసి ఇంటికి నిప్పంటించింది బీబీ పర్వీన్. ఈ ఘటనలో పర్వీన్, ఆమె 65 ఏళ్ల అత్త రుఫైదా ఖతూన్ కాలి బూడిదయ్యారు. రోష్మి ఖతూన్, ఖుర్షీద్​ను తొలుత సమీపంలోని కమ్యూనిటీ హెల్త్​ సెంటర్​ తీసుకెళ్లి, అక్కడినుంచి ధర్భంగా మెడికల్ కాలేజ్​, హాస్పిటల్​కు తరలించారు. అక్కడ వారు చికిత్స పొందుతూ మరణించారు. దీని గురించి సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకొని దర్యాప్తును ముమ్మరం చేశారు.

ఇదీ చూడండి: అమృత్​సర్​ గురునానక్​ దేవ్​ ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.