ETV Bharat / bharat

'ఆమె' పేరుతో ప్రభుత్వం రోడ్డు నిర్మాణం.. పొట్టకూటి కోసం తల్లిదండ్రులే కూలీలుగా మారి..

author img

By

Published : Oct 12, 2022, 12:42 PM IST

Updated : Oct 12, 2022, 1:56 PM IST

అద్భుతమైన ఆటతో ఫుట్​బాల్​ టీమ్​ కెప్టెన్​గా ఆమె మంచి పేరు సంపాదించుకుంది. ఇక ఆ కుటుంబ కష్టాలు గట్టెక్కాయని అందరూ అనుకుంటారు. మీరూ అలానే అనుకుంటే పొరబడినట్లే. ఎందుకుంటే ఆమె పేరు మీద ప్రభుత్వం నిర్మిస్తున్న రోడ్డుపనుల్లో ఆమె తల్లిదండ్రులే కూలీలుగా చేరారు. అసలు ఆమె ఎవరు? ఆ కథేంటో తెలుసుకుందాం రండి.

Etv Bharat
Etv Bharat

పిల్లలు మంచి స్థాయికి ఎదిగినప్పుడు తల్లిదండ్రుల ఆనందం అంతా ఇంతా కాదు. వారి కలలను సాకారం చేయడానికి ఆ కుటుంబం ఎంతో కష్టపడుతుంది. ఆ కలలు నిజమవుతున్న సమయంలో ఆ కష్టాలన్నీ మరిచిపోయి.. పిల్లల ఘనతను చూసి తల్లిదండ్రులు పొంగిపోతారు. ఇదే తరహాలో ఝార్ఖండ్​లోని ఓ కుటుంబం ప్రస్తుతం ఆనందంలో మునిగి తేలుతోంది.. కానీ ఇంకా ఆ కుటుంబం కష్టాల ఊబిలోనే చిక్కుకుంది.

ఫిఫా లాంటి ప్రతిష్ఠాత్మక గేమ్స్​లో అండర్​-17 బాలికల టీమ్​కు సారథ్యం వహిస్తున్న అష్టమ్​ ఒరాన్​​ ఝార్ఖండ్​లోని గుమ్లా అనే ఓ మారుమూల ప్రాంతానికి చెందిన బాలిక. తల్లిదండ్రులు కూలీపని చేస్తే కానీ పూట గడవని పరిస్థితి. గంజి నీళ్లతోనే కడుపు నింపుకునే స్థితిలో ఉన్నప్పటికీ తన కుమార్తె కల నెరవేరాలని ఆ తల్లిదండ్రులు ఆశించారు. రోజువారీ కూలీకి వెళ్లి ఆ వచ్చిన సంపాదనతోనే కుటుంబాన్ని పోషించారు. చిన్నప్పటి నుంచే కష్టాలకు అలవాటు పడిన అష్టమ్​ పట్టుదలగా ఫుట్​బాల్​ నేర్చుకుంది.

astam oran fifa worldcup
అష్టమ్​ పేరుతో నిర్మిస్తున్న రోడ్డు

ఇప్పుడు అష్టమ్​ పేరు దేశమంతా మారుమోగిపోతోంది. ఎంతోమంది ప్రముఖులు సైతం ఆమెను ప్రశంసిస్తున్నారు. సరైన దారి లేని ఆ ప్రాంతానికి ఓ మంచి రోడ్డు సైతం ప్రభుత్వం నిర్మిస్తోంది. తన ఆటను చూసేందుకు ఆ కుటుంబసభ్యులకు ఓ టీవీతో పాటు ఇన్వర్టర్​ను సైతం అధికారులు అందజేశారు. కానీ ఇందులో హృదయ విదారకమైన విషయం ఏంటంటే.. ప్రభుత్వం నిర్మిస్తున్న రోడ్డు పనుల్లో పొట్ట నింపుకునేందుకు అష్టమ్​ తల్లిదండ్రులే కూలీలుగా పని చేస్తున్నారు.

astam oran fifa worldcup
కూలీ పని చేస్తున్న అష్టమ్​ తల్లి

పూట గడవాలంటే తాము ఈ పని చేయక తప్పట్లేదని అష్టమ్​ తల్లిదండ్రులు తెలిపారు. అష్టమ్​కు ఓ మంచి ఉద్యోగం వస్తే తాము ఈ పని చేయడం ఆపేస్తామని ఆమె తల్లి చెప్పారు. తాను ఒకప్పుడు ఫుట్​బాల్​ ప్లేయరే కానీ కుటుంబ పరిస్థితుల కారణంగా ఆటకు దూరమయ్యాయని అష్టమ్​ తండ్రి తెలిపారు. కానీ ఆ కలను తమ కుమార్తె నెరవేరుస్తున్నందుకు ఆనందంగా ఉందని ఆయన హర్షం వ్యక్తం చేశారు.

astam oran fifa worldcup
రోడ్డు పనులలో అష్టమ్​ తండ్రి

త్వరలో అష్టమ్​ పేరుపై గుమ్లాలో ఓ ​స్టేడియాన్నినిర్మించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఇందుకు సంబంధించిన ప్రణాళిక సిద్ధంగా ఉందని..ఆమోదం లభించిన వెంటనే దీనికి సంబంధించిన పనులు ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు.

astam oran fifa worldcup
అష్టమ్​ ఇంట్లో టీవీ

ఇదీ చదవండి: తదుపరి సీజేఐగా జస్టిస్​ చంద్రచూడ్​.. కీలక తీర్పుల్లో భాగస్వామిగా..

ముష్కరులకు ముచ్చెమటలు పట్టించిన శునకం... ఎన్​కౌంటర్​లో ఇద్దరు హతం

Last Updated : Oct 12, 2022, 1:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.