ETV Bharat / bharat

ఫోర్బ్స్​ అత్యంత శక్తిమంతమైన మహిళల జాబితాలో ఆశావర్కర్​

Forbes India W Power 2021: ప్రతిష్టాత్మక ఫోర్బ్స్ అత్యంత​ శక్తిమంతమైన మహిళల జాబితాలో ఈ ఏడాది ఒడిశాకు చెందిన ఓ గిరిజన మహిళ స్థానం సంపాదించారు. ఆశావర్కర్​గా పనిచేస్తున్న 45 ఏళ్ల మతిల్దా తన గ్రామంలో ముఢనమ్మకాలు, కరోనాపై అవగాహనకు విశేష కృషి చేశారు. అంతేకాదు.. గ్రామంలో దాదాపు వేయిమందికి పైగా జనాభా ఉండగా, ఆమె ఒక్కరే వారందరి బాగోగులు చూస్తారు.

asha worker
ఫోర్బ్స్​ జాబితాలో ఆశావర్కర్
author img

By

Published : Dec 1, 2021, 6:21 PM IST

Forbes India W Power 2021: ఫోర్బ్స్ ప్రచురించిన దేశంలోని అత్యంత శక్తిమంతమైన మహిళల జాబితాలో ఒడిశాకు చెందిన మతిల్దా కుల్లూకు చోటు దక్కింది. ఎస్​బీఐ మాజీ జనరల్ మేనేజర్ అరుంధతి భట్టాచార్య, బాలీవుడ్ నటి సన్యా మల్హోత్రాకు స్థానం లభించిన జాబితాలో.. ఓ సాధారణ మహిళకు చోటు దక్కడం విశేషం. కార్పొరేట్ ప్రపంచంతో ఎలాంటి సంబంధాలు లేని మతిల్దా ఓ సామాన్య ఆశావర్కర్.

forbes india w power 2021
ఆశావర్కర్​ మతిల్దా కుల్లూ

గిరిజనులు ఎక్కువగా ఉండే సుందర్‌గఢ్ జిల్లాలోని గర్‌గండ్‌బహల్ గ్రామానికి చెందిన 45 ఏళ్ల మతిల్దా.. అక్కడే 15 ఏళ్లుగా ఆశావర్కర్‌గా పనిచేస్తున్నారు. తన ప్రాంతంలో మూఢ నమ్మకాలు, కరోనాపై అవగాహన కల్పించడం వంటి కార్యక్రమాలను సమర్థంగా నిర్వహించారు. ఉదయం 5 గంటలకే దినచర్య ప్రారంభించే మతిల్దా సైకిల్‌పై గ్రామంలోని ప్రతి ఇల్లు తిరుగుతూ గ్రామస్థులను కలుస్తారు. ఆదివాసీ మహిళ అయినందున అంటరానితనం, చిన్నచూపు వంటి సవాళ్లను ఎదుర్కొన్న మతిల్దా వాటన్నింటినీ అధిగమించారు. కరోనా సమయంలో పరీక్షలు చేయించుకోవడానికి ప్రజలు సిగ్గుపడేవారని.. వారిని ఒప్పించడం తలకు మించిన పనైందని ఆమె గుర్తు చేసుకున్నారు. గ్రామంలోని ప్రజలందరికీ టీకాలు వేశానని మతిల్దా వెల్లడించారు. ఈ విధి నిర్వహణే మతిల్దాకు ప్రతిష్టాత్మక ఫోర్బ్స్ అత్యంత శక్తిమంతమైన మహిళల జాబితాలో చోటు దక్కేలా చేసింది.

forbes india w power 2021
మతిల్దా కుల్లూ

గర్‌గండ్‌బహల్‌ గ్రామంలోని ప్రతి ఇంటికీ వెళ్లి రోగులకు మందులు ఇవ్వడం, గర్భిణీలకు సహాయపడటం, పిల్లలకు వ్యాక్సిన్లు ఇప్పించడం, పరిశుభ్రతను ప్రోత్సహించే అంశాలపై మతిల్దా సర్వే నిర్వహిస్తున్నారు. ఈ గ్రామంలో దాదాపు వేయి మందికి పైగా జనాభా ఉండగా, ఆమె ఒక్కరే వారందరి బాగోగులు చూస్తారు. ఆశా వర్కర్‌గా ఆమె నెలకు 4 వేల 500 రూపాయల జీతం అందుకుంటున్నారు. తను ఆశా వర్కర్‌ ఉద్యోగం చేపట్టిన సమయంలో గ్రామంలో ఎవరూ ఆసుపత్రికి వచ్చే వారు కాదని మతిల్దా తెలిపారు. అందరూ మూఢ నమ్మకాలను ఆశ్రయించేవారు. దీన్ని ఆపడానికి మతిల్దాకు సంవత్సరాల సమయం పట్టింది. ఇప్పుడు గ్రామస్థులు చికిత్స కోసం మతిల్దా వద్దకు వస్తున్నారు.

మతిల్దా చేస్తోన్న కృషిని జాతీయ ఆశా వర్కర్ల సమాఖ్య కార్యదర్శి విజయలక్ష్మీ ఫోర్బ్స్‌ దృష్టికి తీసుకెళ్లారు. గిరిజన మహిళ అయినా ఆమె చాలా గొప్పగా పనిచేశారని.. ఆమె అంకితభావం తనను చాలా ఆకట్టుకుందని విజయలక్ష్మీ కొనియాడారు. ఫోర్బ్స్ జాబితాలో మతిల్దాకు చోటు దక్కిన నేపథ్యంలో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆమెను అభినందించారు. మతిల్దా సేవలకు ఒడిశా మొత్తం రుణపడి ఉందని ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి నవ్‌కిశోర్ దాస్ కొనియాడారు.

ఇదీ చూడండి : పురుషుడిగా మారేందుకు మహిళా కానిస్టేబుల్​కు అనుమతి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.