ETV Bharat / bharat

Article 370 Supreme Court : 'జమ్ముకశ్మీర్‌ భవితవ్యంపై గురువారం కేంద్రం కీలక ప్రకటన!' - ఆర్టికల్ 370పై సుప్రీంకోర్టులో కేసు

Article 370 Supreme Court : జమ్ముకశ్మీర్‌, లద్ధాఖ్​కు కేంద్ర పాలిత హోదాపై ఆగస్టు 31న వివరణాత్మక ప్రకటన చేస్తామని అత్యున్నత న్యాయస్థానానికి నివేదించింది కేంద్ర ప్రభుత్వం. వీటికి కేంద్ర పాలిత హోదా శాశ్వతం కాదని తెలిపింది. ఆర్టికల్​ 370 రద్దుకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై మంగళవారం.. సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.

article 370 supreme court
ఆర్టికల్ 370పై సుప్రీం కోర్టు
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 29, 2023, 2:56 PM IST

Updated : Aug 29, 2023, 4:08 PM IST

Article 370 Supreme Court : జమ్ముకశ్మీర్‌కు కేంద్ర పాలిత హోదా శాశ్వతం కాదని సుప్రీంకోర్టుకు తెలిపింది కేంద్రం. లద్ధాఖ్ కూడా కేంద్ర పాలిత ప్రాంతంగా కొంత కాలమే కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఆగస్టు 31న జమ్ముకశ్మీర్‌, లద్ధాఖ్​కు కేంద్ర పాలిత హోదాపై వివరణాత్మక ప్రకటన చేస్తామని అత్యున్నత న్యాయస్థానానికి నివేదించింది కేంద్ర ప్రభుత్వం. జమ్ముకశ్మీర్​లో ఆర్టికల్​ 370 రద్దుకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ జరపగా.. కేంద్రం ఈమేరకు వాదనలు వినిపించింది.

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ అధ్యక్షతన ఏర్పడిన ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఈ వాదనలు ఆలకించింది. ఈ నేపథ్యంలోనే ఆర్టికల్ 370పై కేంద్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని సుప్రీం కోర్టుకు నివేదించారు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా. జమ్ముకశ్మీర్​, లద్ధాక్​కు ప్రత్యేక హోదాను సమర్థిస్తూ.. ధర్మాసనం ముందు ఆయన వాదనాలు వినిపించారు. "జాతీయ భద్రతతో ముడిపడిన కారణాలతోనే జమ్ముకశ్మీర్​ రాష్ట్రాన్ని పునర్వ్యవస్థీకరించారనే అంశాన్ని మేము ఏకీభవిస్తున్నాం. కానీ ప్రజాస్వామ్యమనేది కూడా చాలా ముఖ్యమైనది." అని అత్యున్నత న్యాయస్థానం ఈ సందర్భంగా అభిప్రాయపడింది.

జమ్ముకశ్మీర్​లో ఎక్కువ కాలం ఎన్నికలు జరగకుండా ఉండటాన్ని తాము అనుమతించమని సుప్రీం కోర్టు సృష్టం చేసింది. జమ్ము కశ్మీర్​, లద్ధాఖ్​లో ప్రజాస్వామ్యాన్ని ఎప్పుడు పునరుద్ధరిస్తారో నిర్దిష్ట కాలపరిమితిని తెలపాలని తుషార్ మెహతాను ఆదేశించింది. దీనిపై కేంద్రం నుంచి పూర్తి వివరణతో రావాలని తుషార్ మెహతా, అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణికి సూచించింది సుప్రీం కోర్టు.

'కశ్మీర్ ప్రజలంతా కోరుకున్నా ఆర్టికల్ 370ని రద్దు చేయలేరా? ఇదేం నిబంధన?'..
Article 370 Supreme Court Hearing : జమ్ము కశ్మీర్ ప్రజలంతా కోరుకున్నా ఆర్టికల్-370 రద్దు చేసేందుకు ఎలాంటి వ్యవస్థే లేదా అని ఆగస్టు 3న జరిగిన విచారణలో కేంద్రాన్ని ప్రశ్నించింది సుప్రీంకోర్టు. ఆ అధికరణాన్ని ముట్టుకునే అవకాశమే లేకపోతే.. రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణానికి (బేసిక్ స్ట్రక్చర్) మించిన ఓ కేటగిరీని తయారు చేసినట్టు అవుతుంది కదా అని వ్యాఖ్యానించింది. 'జమ్ము కశ్మీర్ రాజ్యాంగ సభ రద్దుతో ఆర్టికల్-370 శాశ్వతత్వం పొందిందా? ఆ ఆర్టికల్ రద్దు చేయడానికి పాటించిన ప్రక్రియ సరైనదేనా అనే ప్రశ్నలు మాత్రమే ప్రస్తుతం ఉత్పన్నమవుతున్నాయ'ని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్​తో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

'ఆర్టికల్-370 రద్దు అధికారం చట్టసభలకు ఉంటుందా?'.. సుప్రీంకోర్టు కీలక ప్రశ్న

ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టులో రోజువారీ విచారణ.. కేసు నుంచి తప్పుకున్న ఐఏఎస్

Last Updated : Aug 29, 2023, 4:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.