గత కొద్దిరోజులుగా వాతావరణ సమస్యలతో విమానాలను అత్యవసరంగా ల్యాండింగ్ చేస్తున్నారు అధికారులు. తాజాగా ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ను కూడా అదే విధంగా సిబ్బంది దారి మళ్లించారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా తమిళనాడు.. ఈరోడ్ జిల్లాలో ఆయన ఉన్న హెలికాప్టర్‌ను ఎమర్జెన్సీ ల్యాండ్ చేశారు. హెలికాప్టర్లో రవిశంకర్‌తో పాటు మరో ముగ్గురు ఉన్నారు. ప్రస్తుతం వారంతా సురక్షితంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
శ్రీశ్రీ రవిశంకర్ బుధవారం ఉదయం ఓ ప్రైవేట్ హెలికాప్టర్లో బెంగళూరు నుంచి తిరుపుర్ జిల్లాలోని కాంగేయానికి బయలుదేరి వెళ్లారు. వాతావారణం అనుకూలించకపోవడం వల్ల కడంబూరు సమీపంలోని ఒక్కియం ప్రభుత్వ పాఠశాల మైదానంలో హెలికాప్టర్‌ను ల్యాండ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. సుమారు గంటపాటు స్థానికులతో రవిశంకర్ ముచ్చటించారు. ప్రజలు కూడా ఆయన దగ్గర ఆశీర్వాదం తీసుకున్నారు.
'బుధవారం ఉదయం శ్రీశ్రీ రవిశంకర్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ను ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా స్కూల్ గ్రౌండ్లో ల్యాండ్ చేశారు' అని కదంబూర్ పోలీస్ ఇన్స్పెక్టర్ వడివెల్ కుమార్ తెలిపారు. దాదాపు 50 నిమిషాల తర్వాత రవిశంకర్ హెలికాప్టర్ తిరిగి బయలుదేరినట్లు పోలీసులు వెల్లడించారు.
ఇవీ చదవండి:
ఎయిర్ఇండియా కీలక నిర్ణయం.. 'వారికి ఇకపై మద్యం ఇవ్వం' అంటూ..
'అజిత్' మూవీ సీన్ రిపీట్.. పెప్పర్ స్ప్రే వాడి బ్యాంక్ చోరీకి యత్నం.. సెక్యూరిటీకి చిక్కి..