ETV Bharat / bharat

నారదా కుంభకోణం- టీఎంసీ మంత్రులు జైలుకు - సీబీఐ కార్యాలయానికి మమత

బంగాల్​లో సోమవారం రాజకీయ తుపాను చెలరేగింది. ఇద్దరు రాష్ట్ర మంత్రులు సహా నలుగురు నేతలను నారదా కుంభకోణం కేసులో సీబీఐ అరెస్టు చేయడం దుమారం రేపింది. ఈ నేపథ్యంలో.. ముఖ్యమంత్రి మమత బెనర్జీ సీబీఐ కార్యాలయానికి వెళ్లి 6 గంటల పాటు నిరసన వ్యక్తం చేశారు. నేతలకు తొలుత సీబీఐ ప్రత్యేక కోర్టు బెయిల్‌ మంజూరు చేయగా... కోల్​కతా హైకోర్టు బెయిల్‌ను రద్దు చేస్తూ స్టే ఇచ్చింది. దీంతో వీరిని జైలుకు తరలించారు.

TMC leader
నారదా కుంభకోణం, టీఎంసీ నేతలు
author img

By

Published : May 18, 2021, 6:30 AM IST

బంగాల్‌లో సోమవారం అనూహ్యంగా ఆకస్మిక రాజకీయ తుపాను చెలరేగింది. నాలుగేళ్లనాటి నారదా కుంభకోణం కేసులో ఇద్దరు రాష్ట్ర మంత్రులు సహా నలుగురు నేతలను సీబీఐ అరెస్టు చేయడం దుమారం రేపింది. ఇందుకు నిరసనగా సీఎం మమతా బెనర్జీ స్వయంగా సీబీఐ కార్యాలయం వద్దకు వెళ్లి నిరసన తెలిపారు. తనను కూడా అరెస్టు చేయాలంటూ కేంద్ర అధికారులను హెచ్చరించడంతో పాటు, ఆరుగంటల సేపు అక్కడే ఉన్నారు. సీఎంగా ప్రమాణం చేసిన రెండు రోజులకే.. మంత్రులపై విచారణకు గవర్నర్‌ అనుమతినివ్వడం వివాదానికి బీజం వేసింది. భాజపా కక్షసాధింపు చర్యల్లో భాగంగానే అరెస్టులు చేసిందని ఆరోపిస్తూ టీఎంసీ శ్రేణులు రాజ్‌భవన్‌, సీబీఐ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగాయి.

మంత్రులను అరెస్టుచేసిన సీబీఐ అధికారులపై చర్యలు తీసుకోవాలని టీఎంసీ నేతలు కోల్‌కతా పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేయడం ఈ వ్యవహారంలో ఆసక్తికర పరిణామం. సీబీఐ ప్రత్యేక కోర్టు ఆ నలుగురికీ బెయిల్‌ మంజూరు చేయడంతో సాయంత్రానికి పరిస్థితి కాస్త నెమ్మదించినట్టు అనిపించింది. దీనిపై సీబీఐ వెంటనే హైకోర్టును ఆశ్రయించడంతో ఆ న్యాయస్థానం బెయిల్‌ను రద్దు చేస్తూ స్టే ఇచ్చింది. హైకోర్టు తాజా ఆదేశాల నేపథ్యంలో.. టీఎంసీ నలుగురు ముఖ్యనేతలను పోలీసులు ప్రెసిడెన్సీ జైలుకు తరలించారు.

TMC leader
ప్రసిడెన్సీ జైలుకు తరలిస్తున్న సీబీఐ అధికారులు
TMC leader
నారదా కుంభకోణంలో టీఎంసీ నేత

ఉదయాన్నే అరెస్టు..

సీబీఐ అధికారులు సోమవారం ఉదయమే కోల్‌కతాలోని ఇద్దరు మంత్రులు, ఒక ఎమ్మెల్యే, మరో మాజీ మంత్రి ఇళ్లకు వెళ్లి వారిని అరెస్టు చేశారు. రాష్ట్ర పట్టణాభివృద్ధి, పురపాలక శాఖ మంత్రి ఫిర్హాద్‌ హకీం, పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సుబ్రతా ముఖర్జీ, ఎమ్మెల్యే మదన్‌ మిత్ర, తృణమూల్‌ మాజీ నాయకుడు సోవన్‌ ఛటర్జీలను అదుపులోకితీసుకున్నారు. సోవన్‌ ఛటర్జీ 2019లో తృణమూల్‌ను వీడి భాజపాలో చేరారు. అయితే ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్‌ లభించకపోవడంతో భాజపాకు కూడా రాజీనామా చేశారు. సీబీఐ అధికార ప్రతినిధి ఆర్‌.సి.జోషి దిల్లీలో మాట్లాడుతూ "గతంలో మంత్రులుగా పనిచేసిన నలుగురు తృణమూల్‌ కాంగ్రెస్‌ నాయకులను సీబీఐ అరెస్టు చేసింది. శూల శోధన చేసిన వ్యక్తి నుంచి లంచం తీసుకుంటూ కెమేరా ముందు పట్టుబడ్డారు" అని తెలిపారు. మరో నిందితుడు ఐపీఎస్‌ అధికారి ఎస్‌ఎంహెచ్‌ మీర్జా ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారని చెప్పారు.

mamata
సీబీఐ కార్యాలయానికి చేరుకున్న మమత బెనర్జీ

7నే అనుమతి ఇచ్చిన గవర్నర్‌

వీరిపై దర్యాప్తునకు అనుమతి ఇస్తూ ఈ నెల 7న గవర్నర్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌ ఉత్తర్వులు జారీచేశారు. మంత్రులపై విచారణకు గవర్నర్‌ ఆదేశించవచ్చంటూ 2004లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఓ తీర్పు ఆధారంగా ఈ ఉత్తర్వులు ఇచ్చారు.

సీబీఐ అభ్యంతరం

మమత చర్యలపై సీబీఐ అభ్యంతరం తెలిపింది. హైకోర్టు ఆదేశాల మేరకే దర్యాప్తు చేస్తున్నట్టు గుర్తు చేసింది. అరెస్టు చేసిన అనంతరం వారిని సీబీఐ అధికారులు ప్రత్యేక న్యాయస్థానంలో ప్రవేశపెట్టగా జడ్జి అనుపమ్‌ ముఖర్జీ బెయిల్‌ మంజూరు చేశారు. 15 రోజులకు ఒకసారి దర్యాప్తు అధికారులను కలవాలని ఆదేశించింది. తృణమూల్‌కు చెందిన ముగ్గురు సీనియర్‌ నాయకులను అక్రమంగా అరెస్టు చేసిన సీబీఐ అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు చంద్రిమా భట్టాచార్య.. పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు.

పర్యవసానాలు తెలుసుగా?: గవర్నర్‌

తృణమూల్‌ వర్గాలు ఆందోళన చేయడాన్ని గవర్నర్‌ ధన్‌ఖడ్‌ తప్పుపట్టారు. ఇదంతా అరాచకంగా ఉందంటూ ముఖ్యమంత్రిని ఉద్దేశించి ట్వీట్‌ చేశారు. "సంపూర్ణ శాసన రాహిత్యం. పోలీసులు, అధికారులు మౌనముద్ర వహిస్తున్నారు. అరాచకం నెలకొని, రాజ్యాంగ సంస్థలు విఫలమయినప్పుడు జరిగే పరిణామాలు ఏమిటో మీరు గుర్తిస్తారని అనుకుంటున్నా. ఈ విపత్కర పరిస్థితిని అదుపులోకి తెస్తారని భావిస్తున్నా" అని పేర్కొన్నారు.మరోవైపు..మంత్రులను అరెస్టు చేయడం అక్రమమని స్పీకర్‌ బిమన్‌ బెనర్జీ వ్యాఖ్యానించారు.

మమత సుదీర్ఘ ధర్నా

CBI office
సీబీఐ కార్యాలయం వద్ద ఆందోళన

మంత్రులను సీబీఐ అధికారులు అరెస్టు చేశారన్న విషయం తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హుటాహుటిన ఉదయం 11 గంటల ప్రాంతంలో ఆ సంస్థ కార్యాలయం ఉన్న నిజాం ప్యాలెస్‌ వద్దకు చేరుకున్నారు. నిబంధనలు పాటించకుండా ఎలా అరెస్టు చేస్తారంటూ బైఠాయించారు. 'ఈ భవనం నుంచి నేను బయటకు వెళ్లాలంటే ముందు నన్ను అరెస్టు చేయండి' అని అన్నారని సీబీఐ అధికారులు చెప్పారు. మంత్రుల అరెస్టుకు నిరసనగా పలు చోట్ల తృణమూల్‌ కార్యకర్తలు నిరసనలు తెలిపారు. వందలాది మంది సీబీఐ కార్యాలయం వద్దకు చేరుకొని గవర్నర్‌, ప్రధాని, కేంద్ర హోం మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాళ్లు, నీళ్ల సీసాలు విసిరారు. రాజ్‌భవన్‌ వద్ద కూడా ఆందోళన చేశారు.

ఏమిటీ 'నారదా స్కాం'?

నారదా న్యూస్‌ పోర్టల్‌కు చెందిన మ్యాథ్యూ శామ్యూల్‌ 2014లో శూల శోధన (స్టింగ్‌ ఆపరేషన్‌) నిర్వహించారు. ఒక ఊహాజనిత కంపెనీకి లాభం చేకూర్చడానికి లంచాలు ఇస్తామని చెప్పగా, అందుకు అప్పట్లో మంత్రులుగా ఉన్న తృణమూల్‌ కాంగ్రెస్‌ నాయకులు అంగీకరించారు. మంత్రి ఫిర్హద్‌ హకీం రూ.5 లక్షలు తీసుకోవడానికి సుముఖత చూపారు. సుబ్రత ముఖర్జీ, మదన్‌ మిత్రలు రూ.5 లక్షల వంతున, సోవెన్‌ ఛటర్జీ రూ.4 లక్షలు, ఐపీఎస్‌ అధికారి ఎస్‌ఎంహెచ్‌ మీర్జా రూ.5 లక్షలు తీసుకుంటూ కెమేరాకు చిక్కారు. 2016లో సరిగ్గా అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ సమాచారం ప్రసారమయింది. న్యాయస్థానాల సూచనల మేరకు 2017 ఏప్రిల్‌ 16న సీబీఐ వీరితో పాటు 13 మందిపై కేసులు నమోదు చేసింది.

ఇదీ చదవండి:కొవిడ్ మార్గదర్శకాల నుంచి ప్లాస్మా చికిత్స తొలగింపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.