దేశీయంగా అభివృద్ధి చేసిన 10 మీటర్ల షార్ట్ స్పాన్ వంతెన వ్యవస్థ.. సైన్యానికి అందుబాటులోకి రానుంది. ఈ వ్యవస్థకు చెందిన పరికరాలను ఆర్మీ ఇంజనీర్లకు శుక్రవారం అందించనున్నారు ఆర్మీ చీఫ్ ఎంఎం నరవాణె. దీనిని రూ.492 కోట్ల వ్యయంతో డీఆర్‌డీఓ, ఆర్మీ ఇంజనీర్లు సంయుక్తంగా రూపొందించారు.
ఈ వ్యవస్థ.. పాకిస్థాన్‌తో పశ్చిమ సరిహద్దుల్లో కార్యకలాపాల విషయంలో చిన్న నదులు, కాలువలను సలుభంగా దాటి వెళ్లడానికి వీలుపడుతుందని అధికారులు పేర్కొన్నారు. ఈ వంతెనలు.. 70 టన్నుల ట్యాంకులను(యుద్ధ) మోయగలవని అధికారులు వెల్లడించారు. గతేడాది పరిశ్రమలపై కొవిడ్ ఆంక్షలు విధించినప్పటికీ.. భారత సైన్యానికి వంతెన వ్యవస్థ సరఫరాకు మినహాయింపు ఇచ్చినట్లు తెలిపారు.
ఇదీ చూడండి: ఆ వివరాలు ఇచ్చిపుచ్చుకున్న భారత్-పాక్