గిన్నిస్ రికార్డు(cycling Guinness world records) నెలకొల్పడమే లక్ష్యంగా చేపట్టిన సైకిల్ యాత్రను ఓ సైన్యాధికారి విజయవంతంగా పూర్తి చేశారు. జమ్ముకశ్మీర్‌లోని లేహ్ నుంచి హిమాచల్‌ప్రదేశ్‌లోని మనాలి వరకు ఉన్న 472 కిమీల దూరాన్ని 34 గంటల 54 నిమిషాల్లో పూర్తి చేసి 'ఫాస్టెస్ట్ సోలో సైక్లింగ్‌లో(పురుషులు)' భారత ఆర్మీ ఆధికారి సరికొత్త గిన్నిస్ రికార్డు సృష్టించారు.
వ్యూహాత్మక స్ట్రైకర్స్ విభాగానికి చెందిన లెఫ్టినెంట్ కల్నల్ శ్రీపాద శ్రీరామ్ శనివారం తెల్లవారుజామున 4 గంటలకు లేహ్ నుంచి సైక్లింగ్ ప్రారంభించారు. ఈ మిషన్‌లో భాగంగా.. మొత్తం 472 కిలోమీటర్లు ప్రయాణించిన శ్రీరామ్ దాదాపు 8,000 మీటర్ల ఎత్తులో సైక్లింగ్ చేశారు. కఠినమైన వాతావరణ పరిస్థితుల్లో ప్రయాణించి.. ఆదివారం మధ్యాహ్నానికి హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలి చేరుకున్నారు.
'స్వర్ణిమ్ విజయ్ వర్ష్' వేడుకలు, 195వ గన్నర్స్ దినోత్సవం ఈ సాహస యాత్ర మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. 1971 యుద్ధంలో పాకిస్థాన్‌పై విజయం సాధించి 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా భారత్ 'స్వర్ణిమ్ విజయ్ వర్ష్' జరుపుకుంటోంది.
ఇదీ చూడండి: upsc result 2021: ఆ ఇంట్లో అక్కకు 1.. చెల్లికి 15వ ర్యాంక్