ETV Bharat / bharat

కుమార్తెను కొట్టారని స్కూల్ డైరెక్టర్​పై జవాన్ కాల్పులు - army jawan

Army Jawan Fires School Director: సైన్యంలో ఉండి దేశానికి సేవ చేయాల్సిన జవాన్​.. తన పరిధి దాటి అతిగా ప్రవర్తించాడు. ముష్కరులపై గురిపెట్టమని ఇచ్చిన తుపాకీతో.. తన కూతురు చదువుకునే పాఠశాల డైరెక్టర్​పైనే కాల్పులు జరిపాడు. అసలేమైందంటే?

Army jawan fires at school director
Army jawan fires at school director
author img

By

Published : Jan 4, 2022, 3:19 PM IST

Army Jawan Fires School Director: హోంవర్క్​ చేయని కుమార్తెను కొట్టారన్న కోపంతో.. ఏకంగా పాఠశాల డైరెక్టర్​పైనే కాల్పులు జరిపాడు ఆర్మీ జవాన్​ పప్పు గుర్జార్​. ఈ ఘటనలో అతడి భార్యకే బులెట్​​ తగిలింది. రాజస్థాన్​ భరత్​పుర్​ జిల్లాలో సోమవారం జరిగిందీ ఘటన.

ఇదీ జరిగింది..

కన్వాడా గ్రామానికి చెందిన గుర్జార్​ కుమార్తె ఓ ప్రైవేట్​ స్కూల్లో చదువుతోంది. హోంవర్క్​ చేయలేదని ఓ టీచర్​ ఆమెను చెంపదెబ్బ కొట్టగా.. ఈ విషయం తన తండ్రికి చెప్పింది. కోపంతో రగిలిపోయిన జవాన్​.. పాఠశాల డైరెక్టర్​ను కలిసేందుకు వెళ్లాడు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య వాగ్వాదం చెలరేగింది. అంతే.. గుర్జార్​ తన జేబులో నుంచి గన్​ తీసి అతనికి ఎక్కుపెట్టాడు. ఆపేందుకు మధ్యలోకి వచ్చిన గుర్జార్​ భార్య భుజానికే.. ఆ బులెట్​ దిగింది.

ఘటన జరిగిన వెంటనే జవాన్​ అక్కడి నుంచి పారిపోయాడు. అతడి కోసం గాలిస్తున్నారు పోలీసులు. ఈ విషయమై కేసు నమోదు చేసినట్లు స్టేషన్​ హౌస్​ ఆఫీసర్​ కామా దౌలత్​ సింగ్​ తెలిపారు. గుర్జార్​ సెలవులో ఉన్నట్లు, తన సర్వీస్​ రివాల్వర్​నే తన వెంట తీసుకెళ్లినట్లు పోలీసులు వెల్లడించారు.

ఇవీ చూడండి: చేపల చెరువుకు కాపలాగా ఉన్న యువకుని దారుణ హత్య!

మోదీకి నల్లజెండా చూపించిన మహిళపై దుండగుల కాల్పులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.