పాకిస్థాన్‌కు రహస్య సమాచారాన్ని అందచేస్తున్నాడనే ఆరోపణలతో ఓ జవానును పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. గుజరాత్‌కు చెందిన కృనాల్ కుమార్ బారియాను అదుపులోకి తీసుకున్న అమృత్సర్ పోలీసులు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు.
కృనాల్ ప్రస్తుతం ఫిరోజ్‌పుర్ కంటోన్మెంట్‌లోని ఐటీ సెల్లో విధులు నిర్వర్తిస్తున్నాడు. పాకిస్థాన్ ఐఎస్ఐకు చెందిన ఏజెంట్లతో కృనాల్ సామాజిక మాధ్యమాల ద్వారా సంప్రదింపులు జరిపినట్టు పోలీసులు వివరించారు. ఐటీ సెల్ నుంచి భారత ఆర్మీకి చెందిన అత్యంత సున్నితమైన, రహస్యమైన సమాచారాన్ని పాక్‌కు చేరవేస్తున్నట్టు ఆరోపించారు.
వల వేసిన మహిళ..
2020లో ఫేస్బుక్ ద్వారా సిద్రాఖాన్ అనే పాకిస్థానీ మహిళా నిఘా అధికారితో కృనాల్‌కు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం వాట్సాప్ మెసేజ్‌లకు దారితీసింది. అనేకమార్లు ఫోన్లో కూడా మాట్లాడుకున్నారు.
ఐఎస్ఐకు పనిచేసే విధంగా ఆ మహిళ కృనాల్‌కు వల వేసింది. ఫలితంగా వివిధ యాప్‌ల ద్వారా సున్నితమైన వివరాలను కృనాల్ ఆమెకు అప్పగించేశాడు.
దర్యాప్తులో భాగంగా ఫోన్‌ను పరిశీలించగా.. ఎన్నో రహస్యమైన డాక్యుమెంట్లు బయటపడ్డాయి. నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కృనాల్ అరెస్ట్ గురించి ఆర్మీకి సమాచారం అందించినట్టు అధికారులు వెల్లడించారు.
హరియాణాలోనూ..
ఇటీవల హరియాణాలోనూ ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. పాకిస్థాన్ గూఢచర్య సంస్థ 'ఐఎస్‌ఐ'కి రహస్య సమాచారాన్ని చేరవేస్తున్నాడన్న ఆరోపణపై ఒక జవాన్‌ను అరెస్టు చేసినట్లు హరియాణా పోలీసులు తెలిపారు. నిందితుడి పేరు రోహిత్ కుమార్ అని.. అతడి కార్యకలాపాలపై అందిన రహస్య సమాచారం ఆధారంగా అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు.
ఇదీ చూడండి:- DRDO news: బ్రహ్మోస్ రహస్యాలు లీకయ్యాయా?