ETV Bharat / bharat

యువతితో హోటల్​లో​ గడిపి.. వీడియోను ఆమె తండ్రికి పంపిన ఆర్మీ జవాన్! - ఇండోర్​ న్యూస్

Indore rape case: యువతితో గడిపి ఆ అశ్లీల వీడియోను ఆమె తండ్రికి పంపి బ్లాక్​మెయిల్​ చేస్తున్న ఆర్మీ జవాన్​పై పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు చర్యలు చేపట్టారు. ఇద్దరూ ఫేస్​బుక్​ ఫ్రెండ్స్ అని పోలీసులు చెప్పారు.

army-jawan-accused-of-rape
యువతిపై అత్యాచారం.. వీడియోను ఆమె తండ్రికి పంపిన ఆర్మీ జవాన్!
author img

By

Published : Feb 24, 2022, 12:41 PM IST

Army jawan rape: యువతిని హోటల్​కు తీసుకెళ్లి గడిపిన వీడియోను ఆమె తండ్రికి పంపి బ్లాక్​మెయిల్ చేస్తున్న ఆర్మీ జవాన్​పై మధ్యప్రదేశ్​ పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు అతడ్ని అరెస్టు చేసేందుకు సిద్ధమయ్యారు. ఇద్దరూ ఫేస్​బుక్​లో ఫ్రెండ్స్ అని, ఇండోర్​లోని మండలేశ్వర్​కు చెందినవారని తెలిపారు.

ఏం జరిగిందంటే?

పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. 2015లో ఈ యువతి 12వ తరగతి చదివే సమయంలో కిపల్​ పాటీదార్​ను తొలిసారి కలిసింది. ఆ తర్వాత ఫేస్​బుక్​లో ఫ్రెండ్స్​ అయ్యారు. తరచూ చాట్ చేసి మరింత దగ్గరయ్యారు. అది కాస్త ప్రేమగా మారింది. ఆ తర్వాత 2017 నవంబర్ 26న ఇద్దరూ ఓ ఫ్రెండ్​ బర్త్​డే పార్టీలో కలిశారు. అప్పుడే తను ఆర్మీలో శిక్షణ కోసం వెళ్తున్నట్లు యువతికి కిపల్​ చెప్పాడు. ట్రైనింగ్ కోసం వెళ్లాక కూడా తరచూ.. యువతికి ఫోన్​ చేసి మాట్లాడేవాడు. ఈ విషయం ఆమె ఇంట్లో తెలిసింది. అతనికి దూరంగా ఉండాలని కుటుంబసభ్యులు యువతికి చెప్పారు. దీంతో కిపల్ ఫోన్ నంబర్​ను ఆమె బ్లాక్ చేసింది. పైచదువుల కోసం ఇండోర్ వెళ్లింది.

2018లో ఆర్మీ శిక్షణ పూర్తి చేసుకున్న అనంతరం కిపల్ తిరిగివచ్చాడు. యువతి ఎక్కడ చదువుతుందో తెలుసుకున్నాడు. ఆమెను కలిసేందుకు ఇండోర్ వెళ్లాడు. వేరే నంబర్​ నుంచి ఫోన్​ చేసి మళ్లీ ఆమెతో మాట్లాడటం మొదలుపెట్టాడు. ఓ రోజు యువతికి కాల్​ చేసి తన స్నేహితుడు రవి ఇంటికి రావాలని ఆమెను కోరాడు. ఆమె అక్కడకు వెళ్లింది. ఆ తర్వాత తనను కపిల్ బలవంతంగా హోటల్​కు తీసుకెళ్లి అత్యాచారం చేశాడని బాధితురాలు ఆరోపిస్తోంది. అంతేగాక హోటల్​లో​ ఇద్దరూ కలిసినప్పుడు ఫొటోలు, వీడియోలు తీశాడని.. పెళ్లి చేసుకుందామని ఒత్తిడి చేశాడని పేర్కొంది. అయితే కపిల్​తో వివాహానికి యువతి కుటుంబం ఒప్పుకోలేదు. దీంతో ఇద్దరూ హోటల్​లో గడిపిన అశ్లీల చిత్రాలు, వీడియోలను బాధితురాలి తండ్రి ఫోన్​కు పంపాడు కిపల్. అవి చూసి కుటుంబసభ్యలు షాక్​ అయ్యారు. పరిస్థితి చూసి యువతి ఆత్మహత్యకు ప్రయత్నించింది. తల్లిదండ్రులే ఆమెను కాపాడారు. అనంతరం ఆమె పోలీస్​ స్టేషన్​కు వెళ్లి కిపల్​పై ఫిర్యాదు చేసింది. తనపై అతడు అత్యాచారం చేశాడని ఆరోపించింది.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు కిపల్​ను అరెస్టు చేసేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం అతను లద్దాక్​లో పోస్టింగ్​లో ఉన్నాడని చెప్పారు. ఓ బృందం అక్కడకు వెళ్లి కిపల్​ను అరెస్టు చేసి ఇండోర్​కు తీసుకువస్తుందని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: ప్రేమించట్లేదని యువతిని సుత్తితో కొట్టి హత్య.. ఆపై గొంతు కోసుకొని..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.