ETV Bharat / bharat

'ఎలాంటి పరిస్థితులు ఎదురైనా దీటుగా బదులిస్తాం'

సరిహద్దుల్లో.. చైనా, పాకిస్థాన్ సైన్యాల చర్యలను దీటుగా ఎదుర్కొనేందుకు భారత సైన్యం సర్వసన్నద్ధంగా ఉన్నట్లు ఆర్మీ చీఫ్ జనరల్ ఎమ్​ఎమ్​ నరవణె(general naravane news) వెల్లడించారు. తూర్పులద్దాఖ్‌లో(army chief in ladakh) గత ఆరునెలలుగా పరిస్థితులు ప్రశాంతంగా ఉన్నాయన్న ఆర్మీచీఫ్​ చర్చల ద్వారా ప్రతిష్ఠంభనకు ముగింపు పలుకుతామనే విశ్వాసం వ్యక్తం చేశారు. పాకిస్థాన్ సరిహద్దుల వద్ద ఫిబ్రవరి ముందు రోజులకు పరిస్థితి తిరోగమిస్తోందని తెలిపారు.

Army chief
ఆర్మీ చీఫ్ జనరల్ ఎమ్​ఎమ్​ నరవణె
author img

By

Published : Oct 2, 2021, 4:23 PM IST

తూర్పు లద్దాఖ్‌లో గత ఆరు నెలలుగా పరిస్థితులు ప్రశాంతంగా ఉన్నట్లు సైనిక దళాల ప్రధానాధికారి జనరల్ మనోజ్ ముకుంద్ నరవణె(general naravane news) తెలిపారు. వచ్చే వారంలో చైనాతో 13వ విడత సరిహద్దు చర్చలు జరిగే అవకాశముందన్న సైన్యాధిపతి(Army chief).. సరిహద్దు వివాదాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకుంటామనే విశ్వాసం వ్యక్తంచేశారు. తూర్పులద్దాఖ్‌తో(army chief in ladakh) పాటు నార్తర్న్ ఫ్రంట్ వ్యాప్తంగా చైనా బలగాలను మోహరించిందన్న జనరల్ నరవణె.. ఇది కాస్త ఆందోళన కలిగించే పరిణామమని అభిప్రాయపడ్డారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా దీటుగా బదులిచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.

" గత ఆరునెలలుగా పరిస్థితి ప్రశాంతంగా ఉంది. అక్టోబర్ రెండో వారంలో 13వ విడత చర్చలు జరుగుతాయని భావిస్తున్నాం. ఆ చర్చల్లో బలగాల ఉపసంహరణపై ఏకాభిప్రాయం కుదురుతుందనే నమ్మకం మాకుంది. ఒక్కొక్కటిగా... అన్ని ఫ్రిక్షన్‌ పాయింట్ల వద్ద ఉన్న వివాదాన్ని పరిష్కరించుకుంటాం. విబేధాలను.. చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చనే అభిప్రాయం నాది. చర్చల ద్వారా ఫలితాలను సాధిస్తామనే నమ్మకం ఉంది. తూర్పు లద్దాఖ్ మాత్రమే కాదు నార్తర్న్ ఫ్రాంట్ వ్యాప్తంగా.. ఈస్టర్న్‌ కమాండ్ వరకూ చైనా గణనీయమైన స్థాయిలో బలగాలను మోహరించింది. సరిహద్దు ప్రాంతాలలో బలగాల మోహరింపు పెరగడం కచ్చితంగా ఆందోళన కల్గించే అంశమే. పరిస్థితులను
ఎప్పటికప్పుడు గమనిస్తున్నాం. మాకు వస్తున్న సమాచారం ఆధారంగా మౌలిక వసతుల దగ్గర నుంచి ఏదైనా ముప్పు ఎదురైతే దీటుగా బదులిచ్చేందుకు అవసరమైన బలగాల మోహరింపు వరకూ అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఏ ఇబ్బంది ఎదురైనా దీటుగా
ఎదుర్కొనేందుకు పూర్తి సంసిద్ధంగా ఉన్నాం."

- జనరల్ ఎమ్​ఎమ్​ నరవణె, సైనికదళాల ప్రధానాధికారి

ఫిబ్రవరి నుంచి జూన్ నెలాఖరు వరకూ పాకిస్థాన్ వైపు నుంచి కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘన జరగలేదన్న ఆర్మీచీఫ్(army chief in ladakh).. ఆ తర్వాతి నుంచి పరిస్థితుల్లో మార్పు వచ్చినట్లు తెలిపారు. 'ఫిబ్రవరి నుంచి జూన్ నెలాఖరు, జులై నెల ప్రారంభం వరకూ కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనలు జరగలేదు. కానీ.. ఆ తర్వాత చొరబాటు యత్నాలు పెరిగాయి. అయితే కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనలు మాత్రం జరగలేదు. గత పదిరోజుల వ్యవధిలో మాత్రం రెండు సార్లు ఒప్పందాన్నిఉల్లంఘించి కాల్పులకు పాల్పడ్డారు. దీని ప్రకారం ఫిబ్రవరి ముందు రోజులకు పరిస్థితి తిరోగమనం చెందుతోంది.' అని పేర్కొన్నారు. అఫ్గాన్‌లో పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామన్న ఆర్మీచీఫ్.. ఇప్పుడే స్పందించడం తొందరపాటు చర్య అవుతుందని అభిప్రాయపడ్డారు.

ఇదీ చూడండి: డ్రోన్ల సరికొత్త సవాళ్లకు టెక్నాలజీతోనే చెక్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.