దేశానికి రక్షణగా నిలవబోయే సైనికులు వారు. కానీ ఆర్మీ నియామక ప్రక్రియలో వారికి కనీస సౌకర్యాలు కరవయ్యాయి. కర్ణాటకలోని ఉడుపిలో జరుగుతున్న ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీలో పాల్గొనడానికి వచ్చిన అభ్యర్థులు రోడ్లపై నిద్రిస్తున్న దృశ్యాలు కలచివేస్తున్నాయి. దీనిపై స్పందించిన స్థానికులు జిల్లా పరిపాలన యంత్రాంగం నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తున్నారు.
ఉడుపిలోని అజ్జార్కడు మైదానంలో ర్యాలీలో పాల్గొనడానికి రాష్ట్ర నలుమూలల నుంచి 3వేలకు పైగా యువత వస్తున్నారు. ప్రతి రోజూ ఈ ప్రక్రియ ఉదయం 4గంటలకే ప్రారంభమవుతుండటం వల్ల ఒకరోజు ముందుగానే గ్రౌండ్‌కు చేరుకుంటున్నారు. దీంతో రాత్రిళ్లు రోడ్లు, పార్కుల్లోనే ఆశ్రయం పొందాల్సివస్తోంది. మార్చి 29 వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది.
అయితే ఆశావహులకు తగిన సౌకర్యాలు కల్పించామని ఉడుపి డిప్యూటీ కమిషనర్ జగదీష తెలిపారు. మిగిలిన జిల్లాల్లా కాకుండా వారికి భోజనం, వసతి కల్పిస్తున్నట్లు వెల్లడించారు. ఉదయం 4గంటలకే ర్యాలీలో పాల్గొనాల్సి ఉన్నందున వారే కావాలని రోడ్లపై నిద్రిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇదీ చూడండి: శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో మంటలు- తప్పిన ప్రమాదం