ETV Bharat / bharat

అట్టారీ సరిహద్దులో భారీగా అక్రమ ఆయుధాల పట్టివేత - ఆయుధాల అక్రమ రవాణా

పాకిస్థాన్​ సరిహద్దుల గుండా దేశంలోకి అక్రమంగా తరలిస్తున్న ఆయుధాలను పట్టుకున్నారు పంజాబ్​ పోలీసులు. పక్కా సమాచారం మేరకు సరిహద్దు భద్రతా దళాలతో సంయుక్తంగా ఆపరేషన్​ నిర్వహించి.. ఆయుధాల అక్రమ రవాణా ముఠా గుట్టు రట్టు చేశారు.

Ammunisation seized
పాక్​ సరిహద్దులో భారీగా ఆయుధాలు స్వాధీనం
author img

By

Published : Apr 5, 2021, 5:00 AM IST

పంజాబ్​లోని అట్టారీ సరిహద్దు వద్ద భారీ స్థాయిలో ఆయుధాలు, మందుగుండు సామాగ్రి పట్టుబడింది. పంజాబ్​ పోలీసులు, సరిహద్దు భద్రతా దళాలు సంయుక్తంగా జరిపిన ఆపరేషన్​లో ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. పాకిస్థాన్ నుంచి భారతదేశంలోకి.. దేశ వ్యతిరేక కార్యకలాపాలు జరిపేందుకు పాక్​ దేశస్థులు తరలిస్తుండగా పట్టుకున్నట్లు వెల్లడించారు. సరిహద్దు నుంచి 10 మీటర్ల దూరంలోనే పట్టుబడినట్లు తెలిపారు.

పట్టుబడిన ఆయుధాలు..

9 మ్యాగజైన్​లతో కూడిన ఎఫ్​ఏఎల్​ 222 రైఫిల్, 5 మ్యాగజైన్​లతో ఉన్న ఒక ఏకేఎమ్​-47, ఏడు రౌండ్లతో నిండిన ఒక 303 బోర్​ గన్​, ఒక చైనా పిస్టల్​ను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఏప్రిల్​ 3-4 తేదీల్లో ఆయుధాలు అక్రమంగా దేశంలోకి తరలించబోతున్నారని సమాచారం అందగా.. నిఘా పెట్టినట్లు వెల్లడించారు. ​ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు.

ఇదీ చూడండి: మిజోరాం సరిహద్దులో అక్రమ ఆయుధాల కలకలం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.