ETV Bharat / bharat

సైన్యం, శాస్త్రవేత్తలపై అపార 'నమ్మకం'- రాజకీయ నేతలపై మాత్రం... - ipsos research

ఇప్​సోస్​ గ్లోబల్​ ట్రస్ట్​వర్తీనెస్​ ఇండెక్స్​-2021 విడుదలైంది(ipsos research). భారత జాబితాలో సాయుధ దళాలు, శాస్త్రవేత్తలు టాప్​లో నిలిచారు. వీరిపై తమకు ఎక్కువ నమ్మకం ఉందని ప్రజలు స్పష్టం చేశారు(ipsos global news). రాజకీయ నేతలు, మంత్రులపై తమకు విశ్వాసం లేదని అటు భారతీయులు, ఇటు ప్రపంచవ్యాప్తంగా ప్రజలు తేల్చిచెప్పారు.

Ipsos Global Trustworthiness Index
ఇప్​సోస్​ గ్లోబల్​ ట్రస్ట్​వర్తీనెస్​ ఇండెక్స్​-2021
author img

By

Published : Oct 15, 2021, 4:00 PM IST

సాయుధ దళాలు, శాస్త్రవేత్తలు అత్యంత విశ్వసనీయత కలిగిన వ్యక్తులుగా దేశ ప్రజలు గుర్తించారు(ipsos global news). రాజకీయ నేతలు, యాడ్​ ఏజెన్సీలకు చెందిన ఎగ్జిక్యూటివ్​లపై తమకు విశ్వాసం లేదని స్పష్టం చేశారు(ipsos research).

ఇప్​సోస్​ గ్లోబల్​ ట్రస్ట్​వర్తీనెస్​ ఇండెక్స్​-2021 ప్రకారం సాయుధ దళాలు(64శాతం), శాస్త్రవేత్తలు(64శాతం), టీచర్లు(61శాతం), డాక్టర్ల(58శాతం)పై ప్రజలకు ఎక్కువ నమ్మకం ఉంది. రెండేళ్ల ముందు జరిగిన సర్వేలోనూ సాయుధ దళాలే టాప్​లో నిలిచాయి. శాస్త్రవేత్తలపై నమ్మకం పెరిగింది మాత్రం ఈ కరోనా కాలంలోనే! రోగుల ప్రాణాలు రక్షించేందుకు, టీకాను అభివృద్ధి చేసేందుకు శాస్త్రవేత్తలు చేసిన కృషిని ప్రజలు గుర్తించారు.

ప్రపంచవ్యాప్తంగానూ ఇంచుముంచు ఇవే గణాంకాలు ఉన్నాయి. వైద్యులు(64శాతం), శాస్త్రవేత్తలు(61శాతం), టీచర్ల(55శాతం)కు సర్వేలో ఎక్కువ మార్కులు దక్కాయి.

"సాయుధ సిబ్బంది సొంత ప్రయోజనాలను లెక్కచేయకుండా, సేవ చేస్తారు, త్యాగాలు చేస్తారు. సరిహద్దు రక్షణలో వారికి అంకితభావం ఎక్కువ. అందుకే వారిపై భారతీయులకు నమ్మకం ఎక్కువ. అదే విధంగా శాస్త్రవేత్తలకు కరోనా వారియర్స్​గా గుర్తింపు లభించింది. వైరస్​కు టీకా కనుగొనేందుకు నిత్యం కృషి చేశారు. అందుకే వీరికి, సాయుధ దళాలతో సమానమైన స్థానాన్ని ఇచ్చారు. టీచర్లు, వైద్యులకు తర్వాతి స్థానాలను అప్పగించారు."

-- అమిత్​ అదర్కర్​, ఇప్​సోస్​ ఇండియా సీఈఓ

మొత్తం 28 దేశాల్లో 19,570మంది ఈ సర్వేలో పాల్గొన్నారు. 2021 ఏప్రిల్​ 23-మే 7 మధ్యలో ఈ సర్వే జరిగింది.

అన్​ట్రస్ట్​వర్తీనెస్​(విశ్వాసం లేని) ఇండెక్స్​-2021 జాబితా.. అటు అంతర్జాతీయంగానూ, భారత్​లోనూ దాదాపు ఒకే విధంగా ఉంది. రాజకీయ నేతలు, మంత్రులు, ఎడ్వర్టైజింగ్​ ఎగ్జిక్యూటివ్​లపై తమకు నమ్మకం లేదని ప్రజలు తేల్చిచెప్పారు.

ఇదీ చూడండి:- పెళ్లికి యువత 'నో'.. ఆ విషయానికి మాత్రం సై!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.