Armed Forces Act: మరో ఆరు నెలలపాటు నాగాలాండ్‌ను 'కల్లోలిత ప్రాంతం'గా ప్రకటిస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఉత్తర్వలు జారీ చేసింది. ఈ ప్రాంతంలో సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం(ఏఎఫ్ఎస్పీఏ) కొనసాగుతుందని స్పష్టం చేసింది.
ఇటీవల సైన్యం చేతిలో 14 మంది పౌరుల హత్య నేపథ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేసింది. వివాదాస్పద సాయుధ దళాల(ప్రత్యేక అధికారాలు) చట్టం-1958ని (ఏఎఫ్ఎస్పీఏ) ఎత్తివేసేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించడానికి ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఇంతలో మరో ఆరునెలల ఈ చట్టాన్ని పొడిగిస్తున్నట్లు ప్రకటించింది.
కొన్ని దశాబ్దాలుగా నాగాలాండ్‌లో ఏఎఫ్ఎస్పీఏ కొనసాగుతోంది. తాజాగా డిసెంబరు 30 నుంచి మరో ఆరు నెలలపాటు ఈ చట్టం కొనసాగుతుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. నాగాలాండ్‌లోని వివిధ ప్రాంతాల్లో పరిస్థితులు ఆందోళకరంగా ఉన్నందున కల్లోల ప్రాంతంగా కొనసాగించాలని నిర్ణయించినట్లు అధికారులు పేర్కొన్నారు.
రద్దు చేయాలని డిమాండ్
Armed Forces Act Withdrawal: అయితే ఏఎఫ్ఎస్పీఏను రద్దు చేయాలని నాగాలాండ్‌లోని వివిధ వేర్పాటువాద సంస్థలు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నాయి.
సాయుధ బలగాల చట్టం ఏంటి?
- ఈ చట్టం.. భద్రతా బలగాలకు ప్రత్యేక అధికారాలు కల్పిస్తుంది.
- దీని ప్రకారం.. ఎలాంటి ముందస్తు వారెంట్ లేకుండా ఎవరినైనా అరెస్టు చేయవచ్చు.
- ఆపరేషన్లు నిర్వహించవచ్చు.
- బలగాలు ఎవరినైనా కాల్చి చంపినా.. వీరికి రక్షణ లభిస్తుంది.
- ఈ చట్టం నాగాలాండ్‌లో దశాబ్దాలుగా అమల్లో ఉంది.
ఇదీ చూడండి:
Nagaland Firing Shah: నాగాలాండ్ కాల్పులపై పార్లమెంటులో షా ప్రకటన