Arja Srikanth on Siemens Project: 'సీమెన్స్ ప్రాజెక్టు పనితీరు సంతృప్తిగా ఉంది.. గణనీయమైన సంఖ్యలో ఇంజినీరింగ్ విద్యార్థులకు నైపుణ్యాన్ని అందించేందుకు డిజైన్‌టెక్ సిస్టమ్స్ సహాయపడింది'... ఇది అన్నదెవరో కాదు.. వైసీపీ ప్రభుత్వంలో నైపుణ్యాభివృద్ధి సంస్థకు ఎండీ, సీఈఓగా వ్యవహరించిన అర్జా శ్రీకాంత్. ఈ ప్రాజెక్టును ప్రశంసిస్తూ డిజైన్‌టెక్ సిస్టమ్స్‌కు గతంలో ఆయన లేఖ రాశారు. లక్షమందికి పైగా విద్యార్థులకు నైపుణ్యాలు అందించడం అభినందనీయమని కొనియాడారు.
Chandrababu arrested in Skill Development case: సీమెన్స్ ప్రాజెక్టును పర్యవేక్షించే నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎండీ, సీఈఓ అర్జా శ్రీకాంత్.. ప్రశంసించారంటే శిక్షణ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఏపీలో గత టీడీపీ ప్రభుత్వం.. యువతకు సాంకేతిక నైపుణ్యాలను అందించడానికి సీమెన్స్ ప్రాజెక్టును ప్రారంభించిందని లేఖలో తెలిపారు. ఈ ప్రాజెక్టు ప్రారంభం నుంచి డిజైన్ టెక్ సిస్టమ్స్ మద్దతిస్తోందని.. గణనీయమైన సంఖ్యలో ఇంజినీరింగ్ విద్యార్థులకు నైపుణ్యాన్ని అందించేందుకు సహాయ పడిందని గుర్తుచేశారు.
Chandrababu Skill Development case: అధునాతన నైపుణ్యాలు అందించడంలో అన్ని జాగ్రత్తలు తీసుకుందని.. మొత్తం ప్రాజెక్టు పనితీరు సంతృప్తికరంగా ఉందని ప్రశంసించారు. ప్రాజెక్టుపై ఫీడ్ బ్యాక్ బాగుందని.. ముఖ్యంగా డిజైన్ టెక్ కంటెంట్, డెలివరీ మెకానిజం, సాంకేతిక శిక్షణ నైపుణ్య కేంద్రాలు, సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో శిక్షకుల చెప్పే విధానాన్ని అభినందించారు. రాష్ట్ర వ్యాప్తంగా 40 కేంద్రాల్లో లక్షమందికిపైగా విద్యార్థులకు నైపుణ్యాలు అందించడం అభినందనీయమని లేఖలో తెలిపారు.
Skill Development MD and CEO Arja Srikanth: మరోవైపు.. సీమెన్స్ ప్రాజెక్టు పనితీరుని ప్రశంసిస్తూ అర్జా శ్రీకాంత్ లేఖ రాయడంపై సీఐడీ ఆయన్ని విచారించింది. ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయని తాము చెబుతుంటే బాగుందని ఎలా ప్రశంసిస్తారంటూ రెండు రోజులు ప్రశ్నించింది. అందరూ ప్రశంసిస్తుంటే ప్రభుత్వం మాత్రం.. కక్ష సాధింపుతో వ్యవహరిస్తోంది. ఈ ప్రాజెక్టులో శిక్షణ తీసుకున్న తమకు మంచి ఉద్యోగాలు వచ్చాయని, నైపుణ్య శిక్షణ ఉపయోగపడిందని సామాజిక మాధ్యమాల్లో విద్యార్థులు చెబుతున్నా ప్రభుత్వం మాత్రం రాజకీయ ప్రత్యర్థిపై కక్ష సాధింపు కోసం ఈ ప్రాజెక్టును వాడుకుంటోంది.
Arja Srikanth on CBN Skill Development program: సీమెన్స్ ప్రాజెక్టులో శిక్షణ చాలా బాగుందని, ఇలాంటి నైపుణ్య శిక్షణ బయట తీసుకోవాలంటే వేలాది రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుందని విద్యార్థులు చెబుతున్నారు. సీమెన్స్ సాఫ్ట్‌వేర్, యంత్రాలు, పరికరాలు లేకపోతే.. లక్షల మందికి విద్యార్థులకు శిక్షణ ఇచ్చారని ఒక ఎండీ ఎలా లేఖ రాస్తారు? ఒప్పందం ప్రకారం శిక్షణ కేంద్రాల్లో అన్నీ ఉంటే కుంభకోణం ఎక్కడిది? వైసీపీ ప్రభుత్వం మాత్రం ఇవేవి పట్టించుకోవడం లేదు.
"సీమెన్స్ ప్రాజెక్టు పనితీరు సంతృప్తిగా ఉంది.. గణనీయమైన సంఖ్యలో ఇంజినీరింగ్ విద్యార్థులకు నైపుణ్యాన్ని అందించేందుకు డిజైన్‌టెక్ సిస్టమ్స్ సహాయపడింది. లక్షమందికి పైగా విద్యార్థులకు నైపుణ్యాలు అందించడం అభినందనీయం." - నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎండీ, సీఈఓ అర్జా శ్రీకాంత్ లేఖలో పేర్కొన్న అంశాలు.