ETV Bharat / bharat

సీనియర్​ ఎంపీ మహేంద్ర ​ కన్నుమూత- సీఎం సంతాపం

Rajya Sabha MP Mahendra Prasad passes away: ఏడుసార్లు రాజ్యసభ, ఒకసారి లోక్​సభకు ప్రాతినిధ్యం వహించి.. రాజకీయాల్లో తనదైన ముద్రవేసిన ప్రముఖ పారిశ్రామికవేత్త, జేడీయూ నేత మహేంద్ర ప్రసాద్​ కన్నుమూశారు. అనారోగ్యంతో దిల్లీలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతు ఆదివారం రాత్రి తుదిశ్వాస విడిటినట్లు జేడీయూ తెలిపింది.

MP Mahendra Prasad passes away
మహేంద్ర ప్రసాద్​ కన్నుమూత
author img

By

Published : Dec 27, 2021, 11:17 AM IST

Rajya Sabha MP Mahendra Prasad passes away: జనతా దళ్​ యునైటెడ్​(జేడీయూ) పార్టీ నేత, ఏడుసార్లు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించిన పారిశ్రామిక వేత్త మహేంద్ర ప్రసాద్​(81) సోమవారం కన్నుమూశారు. దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి దిల్లీలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచినట్లు జేడీయూ తెలిపింది.

బిహార్​ నుంచి ఏడుసార్లు రాజ్యసభకు, ఒకసారి లోక్​సభకు ఎన్నికయ్యారు అరిస్టో ఫార్మాస్యూటికల్స్​ ఫౌండర్​ అయిన మహేంద్ర ప్రసాద్​.. 1980లో కాంగ్రెస్​ టికెట్​పై తొలిసారి లోక్​సభకు ఎన్నికయ్యారు. సుదీర్ఘకాలం పాటు హస్తం పార్టీతోనే ఉన్నారు. ఆ తర్వాత జేడీయూలో చేరారు.

బిహార్​ సీఎం సంతాపం

ఎంపీ మహేంద్ర ప్రసాద్​ మృతి పట్ల సంతాపం ప్రకటించారు బిహార్​ ముఖ్యమంత్రి నితీశ్​ కుమార్​. ఆయన మృతి సమాజానికి, పారిశ్రామిక, రాజకీయ రంగానికి తీరనిలోటుగా పేర్కొన్నారు.

ఇదీ చూడండి: యాచకులకు దానంగా పాడైన ఆహారం.. తిరిగి వ్యాపారులకు విక్రయం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.