ETV Bharat / bharat

Are You Using A Credit Card..?: మీరు క్రెడిట్ కార్డ్ వాడుతున్నారా..? అయితే ఈ 5 తప్పులు చేయకండి - credit card News

Are You Using A Credit Card...But Know These 5 Common Mistakes: మీరు క్రిడెట్ కార్డ్ వాడుతున్నారా..?, ప్రతి నెలా సమయానికి చెల్లింపులు చెల్లిస్తున్నారా..?, చెల్లించని పక్షంలో మీరు అప్పులపాలయ్యే అవకాశం ఉంది. మీ క్రిడెట్ కార్డ్ స్కోర్ తగ్గే ప్రమాదముంది. కార్డ్ వాడకంలో ఈ తప్పులు చేస్తున్నారమో ఒకసారి సరిచూసుకోండి.

mistakes
credit card
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 22, 2023, 2:57 PM IST

Updated : Aug 22, 2023, 5:14 PM IST

Are You Using A Credit Card...But Know These 5 Common Mistakes: క్రెడిట్ కార్డ్ గురించి తెలియని వారుండరంటే అతియోశక్తి కాదు. ఈరోజుల్లో చిరు ఉద్యోగుల నుంచి ఉన్నతస్థాయి ఉద్యోగుల వరకూ చాలా మంది క్రిడిట్ కార్డును ఉపయోగిస్తున్నారు. ఈ కార్డ్ ద్వారా ప్రయాణ బుకింగ్‌, షాపింగ్, సినిమా టికెట్లు, వాహనాల బుకింగ్, ఈ-కామర్స్‌ సంస్థల ద్వారా ఆన్‌లైన్‌‌లో క్రయవిక్రయాలు, క్యాష్‌ బ్యాక్‌ల వంటి మెరుగైన సౌకర్యాలను పొందుతున్నారు. అయితే, చాలామంది వినియోగదారులు క్రిడెట్ కార్డు వాడకం విషయంలో తరచుగా 5 రకాల తప్పులు చేస్తుంటారని నిపుణులు చెబుతున్నారు. ఆ తప్పుల వల్ల ఇతర ప్రయోజనాలను పొందలేకపోతున్నారని తెలిపారు. మరీ ఆ 5 తప్పులు ఏమిటి..?, వాటిని ఎలా సరిదిద్దుకోవాలి..?, క్రెడిట్ కార్డ్ వడ్డీ రేట్లు అత్యధికంగా ఎంతవరకూ ఉంటాయి..? అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.

1. క్రెడిట్ కార్డ్ బిల్లులు ఆలస్యంగా చెల్లించటం..
Late payment of credit card bills: క్రెడిట్ కార్డ్‌ను ఉపయోగించే వినియోగదారులు చేస్తున్న తప్పుల్లో మొదటిది.. ప్రతి నెలా చెల్లించాల్సిన చెల్లింపులు ఆలస్యంగా చెల్లించటం. దీని కారణంగా వినియోగదారులపై భారీ రుణభారం పడుతుంది. ఎందుకంటే చెల్లింపు కోల్పోయినప్పుడు బ్యాలెన్స్‌లపై వడ్డీ ఛార్జీలు విధించబడతాయి. సుమారుగా క్రెడిట్ కార్డ్ వడ్డీ రేట్లు నెలకు 2శాతం నుండి 3.5శాతంపైనే ఉంటుంది. దీని కారణంగా వడ్డీ రోజువారీగా విధించబడి వినియోగదారుడు అప్పులపాలయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి క్రెడిట్ కార్డ్ బిల్లులను ప్రతి నెలా సమయానికి చెల్లిస్తే వినియోగదారునికి రుణభారం తగ్గుతుంది. క్రెడిట్ కార్డ్ స్కోర్ కూడా పెరుగుతుంది.

Bhadrachalam: 'తాతా ఏటీఎంలో నుంచి నేను డబ్బు తీసిస్తా ఆగు'.. అంటూ

2. పూర్తిస్థాయి బకాయి ఉన్న సగం బకాయి మాత్రమే చెల్లించడం
Paying only half of the full amount due: క్రెడిట్ కార్డులో ఉన్న పూర్తిస్థాయి బకాయిలను చెల్లించకుండా చాలా మంది వినియోగదారులు కనిష్టంగా (సగం సగం) చెల్లిస్తుంటారు. ఇది మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలా కనిష్ట చెల్లింపులు చేసేవారికి చెల్లించని బ్యాలెన్స్‌పై భారీగా వడ్డీ విధించబడుతుంది. అంతేకాదు, కనీస మొత్తాన్ని చెల్లించే సమయంలో మిగిలిన బ్యాలెన్స్‌పై కూడా వడ్డీ ఛార్జీలు విధించబడతాయి. కాబట్టి క్రెడిట్ కార్డ్ బకాయిలను పూర్తిగా, సమయానికి చెల్లిస్తే ఎల్లప్పుడూ మంచిది.

3. నగదుపై అడ్వాన్స్‌లు తీసుకోవడం, అనవసరమైన వాటిపై ఖర్చు చేయడం
Taking advances on cash, spending on unnecessary things: చాలామంది క్రిడెట్ కార్డ్ వినియోగదారులు నగదుపై అడ్వాన్స్ తీసుకుని.. అనవసరం లేని వాటిపై ఖర్చు చేస్తుంటారు. ఇది మంచి పద్ధతి కాదని చెబుతున్నారు నిపుణులు. వినియోగదారుడు ఈ మార్గం ద్వారా సులభంగా నగదు పొందవచ్చమో కానీ.. ఇది అత్యంత ఖరీదైనది. నగదు ఉపసంహరించుకున్న వెంటనే వడ్డీ పెరగడం ప్రారంభమవుతుంది. అలాగే, క్రెడిట్ కార్డ్‌పై, నగదు అడ్వాన్స్‌పై అదనపు రుసుము విధించబడుతుంది. కొన్ని బ్యాంకులు నగదు విత్‌డ్రా చేసినప్పుడు కొంత శాతం వడ్డీని వసూలు చేస్తాయని గుర్తు పెట్టుకోవాలి. అలాగే, వన్-టైమ్ క్యాష్ అడ్వాన్స్ రుసుమును కూడా చెల్లించవలసి ఉంటుంది. కాబట్టి వినియోగదారులు నగదు అడ్వాన్స్ విషయంలో నియంత్రణ పాటించాలి.

క్రెడిట్​ కార్డును అతిగా వాడుతున్నారా? అయితే​ జాగ్రత్త!

4. క్రెడిట్ యుటిలైజేషన్ రేషియోను సరిగా ఉపయోగించుకోలేకపోవటం
Inability to utilize credit utilization ratio properly: మెజారిటీ వినియోగదారులు.. క్రెడిట్ కార్డ్ పరిమితిని సరిగా ఉపయోగించలేక విఫలమవుతున్నారని నిపుణులు పేర్కొంటున్నారు. క్రెడిట్ కార్డ్ మొత్తం పరిమితిని ఉపయోగించడమనేది మంచి ఆలోచనగా సూచిస్తున్నారు. అలా చేస్తే క్రెడిట్ కార్డ్ వినియోగ నిష్పత్తి చాలా ఎక్కువగా పెరుగుతుంది. క్రెడిట్ కార్డ్ హూల్డర్ కనీసం 30శాతం వినియోగ నిష్పత్తి ఉండేలా చూసుకోవటం మంచిది. ఒకవేళ ఈ నిష్పత్తిని కొనసాగించలేకపోతే క్రెడిట్ పరిమితిలో కనీసం 20 శాతమైన నిష్పత్తి ఉండేలా చూసుకోవాలి. తరచుగా ఈ పరిమితిని ఉల్లంఘిస్తే కార్డ్ జారీ చేసేవారిని అభ్యర్థించి.. మీ కార్డ్ పరిమితిని పెంచడానికి అదనపు క్రెడిట్ కార్డ్‌ని తీసుకోవాలి.

5. సరైన క్రెడిట్ కార్డ్‌ని ఎంచుకోకపోవటం
Not choosing the right credit card: వినియోగదారులు క్రెడిట్ కార్డ్‌ విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు. క్రిడెట్ కార్డ్ తీసుకునే ముందు కచ్చితంగా నిబంధనలు, షరతుల గురించి తెలుసుకోవాలి. ఉత్తమమైన కార్డులను ఎంపిక చేసుకోవాలి. ఉదాహరణకు.. మీరు క్యాష్‌బ్యాక్ క్రెడిట్ కార్డ్ కోసం వెతుకుతున్న వారైతే Axis Ace మీకు ఉత్తమమైనది. అదేవిధంగా తరచుగా ఆన్‌లైన్ షాపింగ్ చేసేవారికి Flipkart Axis క్రెడిట్ కార్డ్ లేదా Amazon Pay ICICI క్రెడిట్ కార్డ్ ఎంపిక బాగుటుంది. కాబట్టి క్రెడిట్ కార్డ్ కోసం దరఖాస్తు చేసే ముందు ఎల్లప్పుడూ మీ ఖర్చు విధానాన్ని విశ్లేషించుకోవాలి. మీ అవసరాలకు అనుగుణంగా ఉత్తమమైన క్రెడిట్ కార్డ్‌ని ఎంచుకోవాలి.

Credit card Tcs India : క్రెడిట్​ కార్డ్​కు కొత్త రూల్స్​.. అలా వాడితే ఇకపై 20% ట్యాక్స్​​!

Last Updated : Aug 22, 2023, 5:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.