ETV Bharat / bharat

APPSC Group 1 Mains Result 2023: గ్రూప్-1 తుది ఫలితాలు విడుదల.. త్వరలో గ్రూప్​-1, 2 నోటిఫికేషన్లు

author img

By

Published : Aug 17, 2023, 6:03 PM IST

Updated : Aug 17, 2023, 9:01 PM IST

APPSC Group 1 Mains Result 2023: ఆంధ్రప్రదేశ్​లో ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్‌-1 తుది ఫలితాలు విడుదల అయ్యాయి. విజయవాడలోని ఏపీపీఎస్సీ కార్యాలయంలో అధికారులు ఫలితాలను విడుదల చేశారు. గత ఏడాది సెప్టెంబర్ 30న 111 పోస్టులకి నోటిఫికేషన్ విడుదలకాగా.. జనవరి 8 న ప్రిలిమ్స్ ఏపీపీఎస్సీ నిర్వహించింది. కేవలం 19 రోజులలో అంటే.. జనవరి 27న ప్రిలిమ్స్ ఫలితాలు వెల్లడించారు. 111 పోస్టులకు గానూ 220 మంది అర్హత సాధించారు. ఇక.. ఆగస్ట్ 2వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ఇంటర్వ్యూలను ఏపీపీఎస్సీ నిర్వహించింది.. ఇంటర్వ్యూలో కనబరిచిన ప్రతిభతోపాటుగా.. మెయిన్స్​లో వచ్చిన మార్కుల ఆధారంగా 110 మందిని ఎంపిక చేసినట్లు గౌతమ్ సవాంగ్ వెల్లడించారు.

APPSC Group 1 Mains result 2023
APPSC Group 1 Mains result 2023
APPSC Group 1 Mains Result 2023: గ్రూప్-1 తుది ఫలితాలు విడుదల.. త్వరలో గ్రూప్​-1, 2 నోటిఫికేషన్లు

APPSC Group 1 Mains Result 2023: ఆంధ్రప్రదేశ్​లో గ్రూప్-1 తుది ఫలితాలు విడుదలయ్యాయి. గురువారం సాయత్రం ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతమ్ సవాంగ్(APPSC Chairman Gautam Sawang) ఫలితాలను విడుదల చేశారు. అనంతరం ఆయన పూర్తి వివరాలను వెల్లడించారు. మెుత్తం 111 ఉద్యోగాలకు ప్రిలిమ్స్​లో పరీక్షలు నిర్వహించగా... ప్రిలిమ్స్​కి 86 వేల మంది హాజరయ్యారని పేర్కొన్నారు. వారిలో 6,455 మంది మెయి‌న్స్​కి అర్హత సాధించారని తెలిపారు. మెయిన్స్​లో వచ్చిన మార్కుల ఆధారంగా... 1:2 నిష్పత్తిలో మొత్తం 220 మంది అభ్యర్థులు ఇంటర్వ్యూలకు ఎంపిక చేసినట్లు తెలిపారు. ఎంపిక చేసిన వారిలో 105 మంది పురుషులు, 115 మంది మహిళా అభ్యర్థుల చొప్పున ఎంపిక చేసినట్లు తెలిపారు. ఆగస్టు 2వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ఇంటర్వ్యూలను ఏపీపీఎస్సీ( APPSC) నిర్వహించగా... తద్వారా ఇంటర్వ్యూలో కనబరిచిన ప్రతిభతోపాటుగా.. మెయిన్స్​లో వచ్చిన మార్కుల ఆధారంగా 110 మందిని ఎంపిక చేసినట్లు గౌతమ్ సవాంగ్ వెల్లడించారు.

తొలి 3 ర్యాంకులు కైవసం చేసుకున్న మహిళా అభ్యర్థులు: నేడు విడుదల చేసిన మెుత్తం 16 కేటగిరీల్లో 110 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేసినట్లు గౌతమ్ సవాంగ్ తెలిపారు. మెుదటి ర్యాంక్(First rank)​ భానుశ్రీ లక్ష్మీ అన్నపూర్ణ ప్రత్యూష సాధించగా... రెండో ర్యాంకు - భూమిరెడ్డి పావనికి కైవసం చేసుకుంది. కంబాలకుంట లక్ష్మీ ప్రసన్నకు మూడో ర్యాంకు లభించింది. నాలుగో ర్యాంకు - ప్రవీణ్ కుమార్ రెడ్డి, ఐదో ర్యాంకు - భాను ప్రకాష్ రెడ్డిలు సాధించారు. ఈ సందర్భంగా మాట్లాడిన గౌతమ్ సవాంగ్ తొలి 3 ర్యాంకులు మహిళా అభ్యర్థులే సాధించినట్లు పేర్కొన్నారు. మెుత్తంగా 111 ఉద్యోగాలకు గానూ... ఎక్కువగా మహిళా అభ్యర్థులు ఎంపికయ్యారని గౌతమ్ సవాంగ్ వెల్లడించారు.

స్పోర్ట్స్ కోటా: నిర్ణీత టైం ప్రకారం గ్రూప్1 నియామక ప్రక్రియ పూర్తి చేెసినట్లు గౌతమ్ సవాంగ్ వెల్లడించారు. మెుత్తం 16 కేటగిరిల్లో మొత్తం 110 పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల వివరాలు వెల్లడించారు. స్పోర్ట్స్ కోటా కింద (1పోస్టు) ఎంపిక వివరాలు తర్వాత ప్రకటిస్తామని ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతమ్ సవాంగ్ తెలిపారు. గ్రూప్ 1మెయిన్స్ పరీక్షలను ఎలాంటి ఇబ్బందులు లేకుండా... అత్యంత పకడ్బంధీగా నిర్వహించినట్లు ఆయన తెలిపారు. గ్రూప్1ఉద్యోగ నియామక ప్రక్రియను అత్యంత పారదర్శకంగా పూర్తి చేసినట్లు గౌతమ్ సవాంగ్ వెల్లడించారు. పరీక్ష నిర్వహించే సమయంలో అవకతవకలకు పాల్పడకుండా... బయోమెట్రిక్ , ఫేషియల్ రికగ్నైజేషన్, సీసీ టీవీల పర్యవేక్షణలో పరీక్షలు నిర్వహించినట్లు ఆయన వెల్లడించారు.

సెప్టెంబర్‌లోపు గ్రూప్-1 నోటిఫికేషన్: సెప్టెంబర్‌లోపు గ్రూప్-1, నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలిపారు. మెుత్తం 1199 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతమ్ సవాంగ్.. వెల్లడించారు. గ్రూప్-1 వంద, గ్రూప్-2 వెయ్యి పోస్టులకు పైగా భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ సారి గ్రూప్స్ సిలబస్‌లో మర్పులు చేస్తున్నట్లు గౌతమ్‌ సవాంగ్‌ ప్రకటించారు. యూపీఎస్సీ విధానంలో ఏపీపీఎస్సీ నియామక ప్రక్రియను చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఉద్యోగ నియామకాలపై వదంతులు నమ్మవద్దని పేర్కొన్నారు.

Last Updated : Aug 17, 2023, 9:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.