ETV Bharat / bharat

మీ పిల్లలకు ఆధార్​ కార్డు ఉంది సరే - మరి "అపార్"​ కార్డు ఉందా?

APAAR ID Card : భారత పౌరులందరికీ ఆధార్ గురించి తెలుసు. మరి.. "అపార్" కార్డు గురించి మీకు తెలుసా? దాన్ని ఎవరు తీసుకోవాలి? ఎందుకు తీసుకోవాలి? అనే వివరాలను ఈ స్టోరీలో చూద్దాం.

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 13, 2023, 10:16 AM IST

APAAR ID
APAAR ID

APAAR ID Card for All Students : దేశంలోని పౌరులందరికీ ఆధార్ గుర్తింపు కార్డు ఇస్తున్నట్టుగా.. విద్యార్థులందరికీ "అపార్" (APAAR CARD) పేరుతో ఓ కొత్త ఐడీ కార్డును కేంద్రం జారీచేస్తోంది. జాతీయ విద్యా విధానం (NEP) 2020లో భాగంగా ఇండియా అంతటా ఉన్న విద్యార్థుల కోసం ఈ సరికొత్త ఐడీ కార్డును ప్రారంభించింది. ఇంతకీ అపార్ కార్డు అంటే ఏమిటి? ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి? ఏవిధంగా డౌన్ లోడ్ చేసుకోవాలి? ఈ కార్డు వల్ల కలిగే ప్రయోజనాలేంటి? అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఏమిటీ కార్డు?

APAAR అంటే.. ఆటోమేటెడ్ పర్మనెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ. దీనినే వన్ నేషన్.. వన్ స్టూడెంట్ ID కార్డు అని కూడా పిలుస్తారు. భారత ప్రభుత్వం ఈ కార్డులను జారీ చేసేందుకు అకడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ (ABC)ని ప్రారంభించింది. ఇది ఎకో సిస్టమ్ రిజిస్ట్రీగా పనిచేస్తుంది. దీనిని "Edulocker"గా సూచిస్తారు. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ వీటిని జారీ చేస్తోంది. దేశవ్యాప్తంగా అన్ని ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలలు లేదా కళాశాలలో చదువుతున్న విద్యార్థుల కోసం రూపొందించిన డిజిటల్ ఐడీ కార్డు అపార్. ఈ కార్డు ద్వారా విద్యార్థులు తమ అకడమిక్ క్రెడిట్లు, డిగ్రీలు, ఇతర సమాచారాన్ని ఆన్ లైన్ ద్వారా ఈజీగా సేకరించుకోవచ్చు.

అపార్ ఐడీ కార్డు అనేది జీవిత కాల ఐడీ నెంబర్. ఈ కార్డు విద్యార్థుల విద్యా ప్రమాణం, విజయాలను ఎప్పటికప్పుడు నమోదు చేయడంతో పాటు ట్రాక్ చేస్తుంది. అలాగే ఒక స్కూల్​ నుంచి మరొక స్కూల్​కు బదిలీ అవ్వడాన్ని సులభతరం చేస్తుంది. ప్రీ ప్రైమరీ నుంచి ఉన్నత విద్య వరకు ప్రతి విద్యార్థికీ స్కూల్స్​, కాలేజీలు ఈ అపార్ కార్డును జారీ చేస్తాయి.

How to Register for APAAR ID Card :

APAAR ID కార్డు రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలంటే..?

  • ముందుగా అకడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ (ABC బ్యాంక్) వెబ్​సైట్​ను సందర్శించాలి.
  • ఆ తర్వాత My Account పై క్లిక్ చేసి Student అనే ఆప్షన్​ను సెలెక్ట్ చేసుకోవాలి.
  • అనంతరం డిజిలాకర్ అకౌంట్ తెరవడానికి Sign up పై క్లిక్ చేయాలి.
  • ఇప్పుడు మొబైల్ నంబర్, చిరునామా, ఆధార్ కార్డు వంటి వివరాలను నమోదు చేయాలి.
  • ఆ తర్వాత మీ వ్యక్తిగత ఆధారాలను ఉపయోగించి DigiLocker అకౌంట్​కి లాగిన్ అవ్వాలి.
  • ఇప్పుడు KYC ధ్రువీకరణ కోసం ABCతో ఆధార్ కార్డు వివరాలను పంచుకోవడానికి.. DigiLocker మీ పర్మిషన్ అడుగుతుంది. 'I Accept'పై నొక్కాలి.
  • అనంతరం మీ పాఠశాల/యూనివర్సిటీ పేరు, తరగతి, కోర్సు మొదలైన విద్యావివరాలను ఎంటర్ చేయాలి.
  • ఇక చివరగా ఫారమ్​ను Submit చేస్తే.. APAAR ఐడీ కార్డు క్రియేట్ అవుతుంది.

ఈ కార్డు రిజిస్ట్రేషన్ ముందు తెలుసుకోవాల్సిన విషయాలు..

  • అపార్ ఐడీ కార్డు నమోదు కోసం విద్యార్థులు తప్పనిసరిగా ఆధార్ కార్డును కలిగి ఉండాలి.
  • పాఠశాలలు, కళాశాలలు APAAR ID Cardని జారీ చేసే ముందు విద్యార్థుల తల్లిదండ్రుల అనుమతి తీసుకోవాలి.
  • తల్లిదండ్రుల సమ్మతి పొందిన తర్వాతే స్కూల్స్, కాలేజీలు అపార్ ఐడీ కార్డును జారీ చేస్తాయనే విషయం గుర్తుంచుకోవాలి.
  • ఇక ఏ సమయంలోనైనా తల్లిదండ్రులు తమ సమ్మతిని ఉపసంహరించుకోవచ్చు.

Best Job Tips For Freshers : తొలి ప్రయత్నంలోనే ఉద్యోగం సంపాదించాలా?.. ఈ టిప్స్​ పాటిస్తే జాబ్ గ్యారెంటీ!

How to Download APAAR ID Card :

APAAR ID ఎలా డౌన్ లోడ్ చేసుకోవాలంటే..?

  • విద్యార్థులు ఈ కార్డును రిజిస్ట్రేషన్ తర్వాత డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
  • APAAR కార్డు 12 అంకెలతో కూడిన ప్రత్యేక గుర్తింపు నెంబర్​ను కలిగి ఉంటుంది.
  • ఇది విద్యార్థుల ఆధార్ నెంబర్​కు లింకై ఉంటుంది.
  • దీనిని డౌన్ లోడ్ చేసుకోవడానికి.. అకడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్(ABC బ్యాంక్) వెబ్ సైట్​కి లాగిన్ అవ్వాలి.
  • ఆ తర్వాత డ్యాష్ బోర్డులో 'APAAR CARD DOWNLOAD' అనే ఆప్షన్​పై క్లిక్ చేయాలి.
  • మీ APAAR కార్డు స్క్రీన్ మీద డిస్​ప్లే అవుతుంది.
  • అప్పుడు డౌన్ లోడ్ లేదా ప్రింట్ అప్షన్​​పై క్లిక్ చేయడం ద్వారా.. APAAR ఐడీ డౌన్​లోడ్ అవుతుంది.

APAAR ID Benefits in Telugu :

  • విద్యార్థుల జీవిత కాల గుర్తింపు కార్డుగా అపార్ కార్డు ఉపయోగపడుతుంది.
  • ఈ కార్డు విద్యార్థులకు సంబంధించిన మొత్తం డేటాను ఒకే చోట నిల్వ చేస్తుంది.
  • APAAR కార్డులో విద్యార్థి పూర్తి విద్యా డేటా ఉన్నందున దేశంలోని ఏ ప్రాంతంలోనైనా, ఏ కొత్త విద్యా సంస్థలలోనైనా ప్రవేశం పొందడం చాలా ఈజీ.
  • అదే విధంగా ఈ కార్డు ద్వారా విద్యార్థుల డ్రాపౌట్లను గుర్తించొచ్చు. వారిని తిరిగి స్కూల్​లో చేర్చవచ్చు.
  • ఈ కార్డులో స్కాలర్ షిపులు, డిగ్రీలు, రివార్డులు, ఇతర విద్యా క్రెడిట్​లకు సంబంధించిన అకడమిక్ డేటా మొత్తం డిజిటల్ రూపంలో నమోదై ఉంటుంది.

Education Loan Tips : మీ విద్యా రుణం త్వరగా తీర్చేయాలా?.. ఈ టిప్స్ పాటించండి!

Best Universities in World For Higher Studies 2023 : విదేశాల్లో ఉన్నత విద్య.. బెస్ట్​ యూనివర్సిటీస్ ఇవే..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.