AP Police System Providing Services to YSRCP Leaders: అధికారులు ప్రజాప్రతినిధుల్ని కలవటం మామూలే. కానీ అందుకు భిన్నంగా వైఎస్సార్సీపీ పాలనలో ఇన్ఛార్జ్లు సైతం అధికారులపై పెత్తనం చేస్తున్నారు. దళిత యువకుడిని హత్య చేసి, మృతదేహాన్ని డోర్ డెలివరీ చేసిన కేసులో ఎమ్మెల్సీ అనంతబాబు నిందితుడు. పేరుకు వై ఎస్సార్సీపీ నుంచి సస్పెండైనా రంపచోడవరం నియోజకవర్గంలో పార్టీకి అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. నూతన సంవత్సర సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని సీఐలు, ఎస్సైలు ఆయనకు శుభాకాంక్షలు చెప్పేందుకు క్యూ కట్టారు. అందరూ కలిసి బృందంగా వెళ్లి పుష్పగుచ్చాలు అందించారు.
న్యాయమూర్తులు, న్యాయ వ్యవస్థను అసభ్య పదజాలంతో దూషించి, అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో వైఎస్సార్సీపీ నాయకుడు ఆమంచి కృష్ణమోహన్‌పై అభియోగాలున్నాయి. ఆయన్ను గతంలో సీబీఐ విచారించింది. అలాంటి వ్యక్తికి అభినందనలు, శుభాకాంక్షలు చెప్పడానికి పర్చూరు నియోజకవర్గవ్యాప్తంగా ఉన్న పోలీసు అధికారులు పోటీపడ్డారు. ఆయనతో కేకు కట్ చేయించారు.
ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్యే కేతిరెడ్డి అనుచరుడు వీరంగం - పట్టించుకోని పోలీసులు
Guntur District: ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్సీపీ ఇన్ఛార్జ్లు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అధికారులు సైతం వారిని కలసి తరించిపోతున్నారు. మంగళగిరి ఇన్‌ఛార్జ్‌గా నియమితులైన గంజి చిరంజీవిని నూతన సంవత్సరం సందర్భంగా మంగళగిరి- తాడేపల్లి నగరపాలక సంస్థ అధికారులంతా కలిశారు. కొత్త ఏడాది వేడుకల్లో గంజి చిరంజీవితో కలిసి పాల్గొన్నారు. పత్తిపాడు ఇన్ఛార్జ్ బాలసాని కిరణ్ కుమార్ అయితే ఏకంగా అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. రైతులకు శనగ విత్తనాల పంపిణీలో పాల్గొన్నారు. అలాగే నియోజకవర్గంలోని అధికారులు, పోలీసులు ఆయనతో కలిసి కొత్త ఏడాది సందర్భంగా కేక్ కట్ చేశారు.
'మిషన్ ఫ్లాప్' సాఫ్ట్వేర్ ఇంజినీర్‌పై సెబ్ పోలీసుల దాడి - తీవ్రంగా గాయపడడంతో పరార్
Bapatla District: బాపట్ల జిల్లా పర్చూరు ఇన్ఛార్జ్ని నియోజకవర్గంలోని పోలీసు అధికారులంతా మూకుమ్మడిగా కలిసి కొత్త ఏడాది శుభాకాంక్షలు తెలిపారు. ఆయనతో కలిసి కేక్ కట్ చేయటంతో పాటు తినిపించి తరించిపోయారు. వేమూరు వైఎస్సార్సీపీ ఇన్ఛార్జ్ వరికూటి అశోక్ బాబు పెన్షన్ల పంపిణీలో పాల్గొన్నారు. అధికారులు లేదా ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా పంపిణీ జరగాల్సి ఉండగా... అశోక్ బాబు తన చేతుల మీదుగా కొత్త పెన్షన్లను అందజేశారు. అద్దంకి ఇన్‌ఛార్జ్‌గా కొత్తగా నియమితులైన పాణెం హనిమిరెడ్డిని పోలీసు అధికారులు కలిశారు.
ఆర్మీ జవాన్‌పై పోలీసుల అరాచకం - నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా మూకుమ్మడి దాడి
Palnadu District: పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఇన్ఛార్జ్ మల్లెల రాజేష్ నాయుడుతో సైతం అధికారులు తరచుగా కలుస్తున్నారు. నియోజకవర్గంలోని అధికారులతో ఆయన సమావేశాలు నిర్వహిస్తూ వారికి ఆదేశాలు ఇస్తున్నారు. రేపల్లె ఇన్ఛార్జ్ ఈపూరి గణేష్ సైతం ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. అధికారిక కార్యక్రమాల్లో పార్టీ నేతలు పాల్గొనటం విమర్శలకు తావిస్తోంది. రానున్న ఎన్నికల్లో రాజకీయ లబ్దికోసం వైఎస్సార్సీపీ ఇన్ఛార్జ్లు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. వీటిని నియంత్రించాల్సిన అధికారులు సైతం అందులో పాలుపంచుకుంటున్నారు.