ETV Bharat / bharat

ఎస్‌ఐ నియామకాలపై మధ్యంతర ఉత్తర్వులు ఎత్తివేసిన ఏపీ హైకోర్టు - ap si recruitment height issue

ap_high_court_lifts_interim_orders_on_si_appointments

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 5, 2023, 5:00 PM IST

Updated : Dec 5, 2023, 5:36 PM IST

16:52 December 05

ఎస్‌ఐ నియామక ఫలితాలు విడుదల చేసుకోవచ్చని ఆదేశాలు

AP High Court Lifts Interim Orders on SI Appointments: ఆంధ్రప్రదేశ్​లోని ఎస్సై నియామకాల్లో ఎత్తు కొలతల అంశంలో అవకవతకలపై దాఖలైన పిటిషన్​పై.. ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది. ఎత్తు కొలతల అంశంలో అభ్యంతరం వ్యక్తం చేసిన అభ్యర్థులకు.. న్యాయమూర్తి సమక్షంలో పరీక్షలు నిర్వహించారు. అయితే రిక్రూట్​మెంట్​ బోర్డు కొలతలు.. న్యాయమూర్తి సమక్షంలో నిర్వహించిన కొలతలు సరిపోవడంతో.. అభ్యర్థుల అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. దీంతో రిక్రూట్​మెంట్​పై విధించిన మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేసింది.

ఉత్తర్వులను ఎత్తేసిన నేపథ్యంలో.. ఫలితాలను విడుదల చేసుకోవచ్చని రిక్రూట్​మెంట్​ బోర్డుకు హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. పిటిషనర్​ తరపున వాదనలు వినిపించిన న్యాయవాజది జడ శ్రావణ్​ కుమార్​.. 2019లో ఎత్తు అంశంలో అర్హత సాధించారని హైకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. 2019లో అర్హతగా పరిగణలోకి తీసుకున్న అభ్యర్థుల మెడికల్ సర్టిఫికెట్స్​ను న్యాయస్థానానికి అందించారు. దీంతో అభ్యర్థుల మెడికల్​ సర్టిఫికెట్స్​ పునః పరిశీలన చేసి వారం రోజుల్లో కోర్టు ముందు ఉంచాలని రిక్రూట్​మెంట్​ బోర్డు అధికారులను హైకోర్డు ఆదేశించింది. తదుపరి విచారణను న్యాయస్థానం వారం రోజులకు వాయిదా వేసింది.

Last Updated : Dec 5, 2023, 5:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.