AP Government Failed on Adudam Andhra Program : ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఆడుదాం ఆంధ్రా కార్యక్రమానికి క్రీడాకారుల నుంచి స్పందన కరవైంది. పలుచోట్ల ఆటగాళ్లు లేక క్రీడామైదానాలు ఖాళీగా దర్శనమిచ్చాయి. అరకొర సౌకర్యాల మధ్య అధికారులు తొలి రోజు పోటీలను మమ అనిపించారు.
Adudam Andhra Program Launched by CM Jagan : శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట జూనియర్ కళాశాల మైదానంలో ఆడుదాం ఆంధ్రా పోటీలను అధికారులు ప్రారంభించగా కార్యక్రమానికి వాలంటీర్లు గైర్హాజరయ్యారు. తొలి రోజూ బ్యాడ్మింటన్ పోటీ (Badminton Competition)లను నిర్వహించాల్సి ఉండగా ఒకే ఒక్క క్రీడాకారిణి హాజరయ్యారు. క్రీడాకారుల కోసం ఎంతసేపు వేచిచూసినా ఫలితం లేకుండా పోయింది.
సీఎం జగన్‌పై యుద్ధం ప్రకటించిన సొంత సైన్యం-'ఆడుదాం ఆంధ్రా'ను బహిష్కరించాలని నిర్ణయం
Village Volunteers Boycott Adudam Andhra : అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఐ.పోలవరం మండలం మురమళ్ల హైస్కూల్‌కు క్రీడా ప్రాంగణం లేకపోవడంతో జగనన్న లేఔట్లో తాత్కాలిక ఏర్పాటు చేశారు. దీంతో మధ్యాహ్నం వరకు ఆటలు ప్రారంభం కాలేదు. ముమ్మడివరం బాలికల ఉన్నత పాఠశాలలో నాడు-నేడు పనులకు తీసుకొచ్చిన ఇసుక గుట్టల మధ్యే పోటీలు నిర్వహించారు. స్థానిక జూనియర్ కాలేజీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణంలో ఒక పక్క పందులు సంచరిస్తుండగా క్రికెట్ పోటీలు నిర్వహించారు.
ప్రభుత్వం మరో దోపిడీకి తెర లేపిందని విమర్శలు : కృష్ణా జిల్లా మొవ్వ మండల పరిషత్ హైస్కూల్లో మధ్యాహ్నం వరకు పోటీలు ప్రారంభం కాలేదు. క్రీడాకారుల నుంచి స్పందన లేకపోవడంతో అధికారులకు ఎదురుచూపులు తప్పలేదు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు, A.S.పేట మండలాల్లో క్రీడాకారులు లేక మైదానాలు వెలవెలబోయాయి. ఆత్మకూరు నియోజకవర్గంలోని 6 మండలాల్లో24 వేల మంది పేర్లను నామమాత్రంగా రిజిస్ట్రేషన్ చేశారు. A.S.పేటలో ప్రజాప్రతినిధులు ఆటను ప్రారంభించిన కొద్దిసేపటికే మైదానమంతా బోసిపోయింది. ఆటల మాటున ప్రజాధనం దోపిడీకి ప్రభుత్వం యత్నిస్తోందని విద్యార్థి సంఘాల నేతలు మండిపడ్డారు. ఆట వస్తువులను నాయకులే తీసుకెళ్లి అమ్ముకుంటున్నారని ఆరోపించారు.
మొదటి మ్యాచ్‌లోనే విరిగిన బ్యాట్లు - ఇక 47 రోజులు ఆడేదెట్లా జగనన్నా?
మైదానాలు సిద్ధం చేయకుండానే ఆటల పోటీలు : YSR జిల్లా ఎర్రగుంట్లలో ఆడుదాం ఆంధ్రాను మున్సిపల్ ఛైర్మన్ హర్షవర్ధన్ రెడ్డి ప్రారంభించారు. మొదటి మ్యాచ్‌లోనే క్రికెట్ బ్యాట్లు విరిగిపోయాయి. కిట్లు లేకుండానే నాసిరకం సామగ్రితో ఎలా ఆటలాడిస్తారని స్థానికులు అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. జమ్మలమడుగు మండల పరిధిలోని సున్నపురాళ్లపల్లె గ్రామ సమీపంలో తారురోడ్డుపై క్రికెట్ ఆడించారు. దీనిపై స్థానికుల నుంచి వ్యతిరేకత రావడంతో పక్కనున్న మైదానంలోకి వేదికను మార్చారు. మైదానాలు సిద్ధం చేయకుండానే ఆటల పోటీలు ఎలా నిర్వహిస్తారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
విద్యార్థుల పాలిట గుదిబండలా "ఆడుదాం ఆంధ్రా"- జగన్ సర్కార్ బలవంతపు ఎన్నికల ఆటకు పిల్లలు బలి