ETV Bharat / bharat

AP CID Pressmeet In Delhi ఏపీ సీఐడీ స్కిల్..! దిల్లీలో 'ఫైవ్ స్టార్ ప్రెస్ మీట్'​.. తెలుగు మీడియాకు నో ఎంట్రీ..! - chandrababu Arrest

AP CID Pressmeet In Delhi : స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో వరుస ప్రెస్​మీట్ల జోరులో ఉన్న ఏపీ సీఐడీ.. దిల్లీలో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌కు తెలుగు మీడియాను దూరం పెట్టారు. ఎంచుకున్న జాతీయ మీడియా ప్రతినిధులను మాత్రమే సమావేశానికి అనుమతించారు. తెలుగు మీడియాకు అనుమతి ఎందుకు లేదని ప్రశ్నిస్తే.. కనీస సమాధానం చెప్పని నిర్వాహకులు, జగన్ సొంత మీడియాను మాత్రం అనుమతించారు.

ap-cid_pressmeet_in_delhi
ap-cid_pressmeet_in_delhi
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 18, 2023, 9:29 AM IST

AP CID Pressmeet In Delhi : ఏపీ ప్రభుత్వ ఉన్నతాధికారులకు తెలుగు మీడియా అంటేనే భయం పుడుతోంది. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసు న్యాయస్థానం పరిధిలో ఉన్నా ఇప్పటికే విజయవాడ, హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్లు పెట్టి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై అవినీతి ఆరోపణలు చేసిన సీఐడీ చీఫ్‌ సంజయ్‌, అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి... దేశ రాజధాని దిల్లీలో ఆదివారం ప్రెస్‌మీట్‌ పెట్టారు. ఫైవ్‌స్టార్‌ హోటల్‌ అశోకాలో మధ్యాహ్నం 3 గంటలకు ప్రెస్‌మీట్‌ ఏర్పాటు చేసి తాము ఎంపిక చేసుకున్న ఇంగ్లిష్, హిందీ పత్రికలు, టీవీలకు సమాచారం అందజేశారు. ప్రెస్​మీట్ సమాచారం తెలిసి దిల్లీలోని తెలుగు మీడియా ప్రతినిధులు అక్కడికి వెళ్లగా.. తెలుగు మీడియాను పిలవలేదు... ఎందుకు వచ్చారంటూ సీఐడీ అధికారులు, ఏపీ ప్రభుత్వ సమాచార, ప్రసార శాఖల సిబ్బంది అడ్డుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన అంశం, రాష్ట్ర ప్రజాధనంతో పెట్టే ప్రెస్‌మీట్‌కు తెలుగు మీడియాను ఎందుకు రానివ్వరని మీడియా ప్రతినిధులు నిలదీయడంతో... తమకు పైనుంచి ఆదేశాలు ఉన్నాయని, తామేమీ చేయలేమని వారు చేతులెత్తేశారు. ఎక్కడినుంచి ఎవరు ఈ ఆదేశాలు ఇచ్చారని ప్రశ్నించగా... నోరు మెదపలేదు. విలేకరుల సమావేశానికి సంబంధించి గది ముందు ఏర్పాటు చేసిన బోర్డును అక్కడినుంచి తీసేశారు. ఆహ్వానం అందని ఇతర ఇంగ్లీష్, హిందీ పత్రికలు, టీవీ మాధ్యమాల విలేకర్లనూ లోపలికి అనుమతించలేదు.

CID Sanjay AAG Ponnvolu : కృష్ణా, గంగా నదులు... నాసిక్‌లో పుట్టాయంట! సీఐడీ చీఫ్, ఏఏజీలు చెప్పారు..! పిల్లలూ నిజమేనా...?

సమాధానం ఇవ్వకుండానే.. ఈ సమావేశానికి కొంత ముందుగా ఏపీ ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్‌ ఇక్కడికి రాగా.. జర్నలిస్టు సంఘం నాయకుడైన మీరే... తెలుగు మీడియాకు అనుమతి ఇవ్వకపోవడమేంటని పలువురు ప్రశ్నించారు. దాంతో ఆయన సమాధానం దాటవేస్తూ ప్రెస్‌మీట్‌ గదిలోకి వెళ్లిపోయారు. అనంతరం సీఐడీ చీఫ్‌ సంజయ్‌, అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి... తాము ఎందుకు సమావేశానికి రాకూడదని తెలుగు మీడియా ప్రతినిధులు ప్రశ్నిస్తున్నా సమాధానం ఇవ్వకుండానే లోపలికి వెళ్లిపోయారు. తెలుగు నుంచి సాక్షి టీవీ ప్రతినిధిని మాత్రమే అనుమతించడంపై ప్రశ్నించగా.. సీఐడీ, ప్రభుత్వ అధికారులు నోరు మెదపలేదు. లోతైన ప్రశ్నలు వేస్తారనే భయంతోనే మలయాళీ మీడియా ప్రతినిధులను కూడా దూరంగా పెట్టినట్లు భావిస్తున్నారు. ఎలాంటి ఖర్చు లేకుండా ఏపీ భవన్‌లో ఉచితంగా సమావేశం పెట్టుకునే అవకాశమున్నా ఫైవ్‌స్టార్‌ హోటల్లో ప్రెస్​మీట్ ఏర్పాటు చేశారు. సమావేశంలో జాతీయ మీడియా ప్రతినిధులు తెలుగు విలేకరులని ఎందుకు పిలవలేదని ప్రశ్నించగా... వారికి విజయవాడ, హైదరాబాద్‌లో ఇప్పటికే కేసు గురించి వివరించామని అమర్‌ సమాధానం ఇచ్చారు.

AP CID Chief Sanjay on Skill Development Case: స్కిల్ కేసులో చంద్రబాబు అంతిమ లబ్ధిదారని తేల్చేందుకు ఆధారాలు లేవు: ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్

సరైన సమాధానం లేకుండా ఎదురు ప్రశ్నలు... స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో ప్రధాన కుట్రదారు మాజీ సీఎం చంద్రబాబేనని సీఐడీ చీఫ్‌ సంజయ్‌ ఆరోపించారు. అనంతరం ఒక ప్రకటనను విడుదల చేశారు. ‘స్కిల్‌ డెవలప్‌మెంట్‌కు సంబంధించి 13 సందర్భాల్లో చంద్రబాబు అనుమతులు ఇచ్చారని... ప్రతి దశలోనూ కలగజేసుకొని సంతకాలు పెట్టారని సంజయ్‌ వివరించారు. సంతకాలు పెట్టిన మిగిలిన వారిని ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నిచగా.. సంతకాలు పెట్టినందుకే అరెస్టు చేస్తామా? అని తిరిగి ప్రశ్నించారు. చంద్రబాబు పీఏ పెండ్యాల శ్రీనివాస్‌కు నోటీసు ఇచ్చామని, ఆ వెంటనే ఆయన దేశం విడిచి అమెరికా వెళ్లిపోయారని చెప్తూ.. తదుపరి చర్య చంద్రబాబు అరెస్టుకు కారణమైందని అన్నారు.

కేసులో అరెస్టయిన వారిలో ఏడుగురు యాంటిసిపేటరీ బెయిల్‌ పొందారని తెలిపారు. అజేయ కల్లం, ప్రేమచంద్రారెడ్డిని ఎందుకు అరెస్టు చేయలేదని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. అజేయకల్లం నాడు విద్యాశాఖ ప్రత్యేక కార్యదర్శిగా ఉన్నారని తెలిపారు. ప్రేమచంద్రారెడ్డి తన బాస్‌గా ఉన్న ముఖ్యమంత్రి ఎక్స్‌అఫీషియో చీఫ్‌ సెక్రటరీ ఘంటా సుబ్బారావు మార్గదర్శకత్వంలో పని చేశారని తెలిపారు. రాజకీయ ఒత్తిడితోనే చంద్రబాబును అరెస్టు చేశారా? అని విలేకరులు ప్రశ్నించగా తాము తొలుత ఇది కార్పొరేట్‌ అంశం అనుకున్నామని, చివరకు రాజకీయ కోణం తేలిందని వివరించారు. క్షేత్రస్థాయిలో నైపుణ్య కేంద్రాలను పరిశీలించారా అని విలేకరులు ప్రశ్నించగా.. సంజయ్‌ సరైన సమాధానం చెప్పలేదు.

ఉదయం ఇక్కడి కాన్‌స్టిట్యూషన్‌ క్లబ్‌లో ఏర్పాటుచేసిన సుమన్‌బోస్‌ విలేకరుల సమావేశానికి తెలుగు, జాతీయ మీడియా ప్రతినిధులందరినీ ఆహ్వానించారు. స్వేచ్ఛగా ప్రశ్నలు అడగడానికి సాక్షి టీవీ ప్రతినిధికి అవకాశం ఇవ్వడంతో పాటు.. విలేకర్లందరికీ ముఖాముఖి ఇంటర్వ్యూలనూ ఇచ్చారు. ఏ విషయంలోనూ తడబడలేదు. ఏపీ సీఐడీ చీఫ్‌ సంజయ్‌ పెట్టిన పెట్టిన సమావేశానికి మాత్రం సీఐడీ అధికారిని పెట్టి ద్వారం ఎదుటే తెలుగు మీడియాను అడ్డుకున్నారు. సమావేశంలో సీఎం కార్యాలయం ఎగ్జిక్యూటివ్‌ అసిస్టెంట్‌ అవినాష్‌, జాతీయ మీడియా సలహాదారు కూడా పాల్గొనడం సీఐడీ విధుల్లో ముఖ్యమంత్రి కార్యాలయం జోక్యానికి అద్దం పడుతోంది.

CID Chief Sanjay Comments on Chandrababu Case: 'ప్రైవేటు వ్యక్తికి పదవులు..' చంద్రబాబు కేసుపై సీఐడీ చీఫ్ ఏమన్నారంటే..!

AP CID Pressmeet In Delhi : ఏపీ సీఐడీ స్కిల్..! దిల్లీలో 'ఫైవ్ స్టార్ ప్రెస్ మీట్'​.. తెలుగు మీడియాకు నో ఎంట్రీ..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.