ETV Bharat / bharat

మార్గదర్శిపై భారీ కుట్ర.. కుంభకోణం జరిగిపోతోందంటూ అడ్డగోలు ఆరోపణలు - AP CID ADG Sanjay allegations on margadarsi

AP CID ADG ALLEGATIONS ON MARGADARSI: మార్గదర్శిపై కేసు నమోదు విషయంలో ఏపీ సీఐడీ ఏడీజీ ఎన్‌.సంజయ్‌ కొత్త వాదన చేశారు. మార్గదర్శిపై ఎవరైనా ఫిర్యాదు చేశారా..? ఎంత మోసం జరిగిందనే అంశాలపై విలేకర్లు ప్రశ్నించగా... సూటిగా సమాధానం చెప్పలేకపోయారు. ఎవరో ఫిర్యాదు చేసే వరకూ వేచిచూడాలా, కంపెనీ ఎప్పుడు కూలిపోతుందని చూస్తూ కూర్చోవాలా అంటూ ఎదురు ప్రశ్నలు వేశారు.

AP CID ADG ALLEGATIONS ON MARGADARSI
AP CID ADG ALLEGATIONS ON MARGADARSI
author img

By

Published : Apr 13, 2023, 6:48 AM IST

Updated : Apr 13, 2023, 8:31 AM IST

మార్గదర్శిపైౖ భారీ కుట్ర.. కుంభకోణం జరిగిపోతోందంటూ అడ్డగోలు ఆరోపణలు

AP CID ADG ALLEGATIONS ON MARGADARSI: మార్గదర్శి చిట్‌ఫండ్‌లో అక్రమాలు జరిగిపోతున్నాయనే దుష్ప్రచారాన్ని ఆంధ్రప్రదేశ్‌ సీఐడీ పోలీసులు మరింత ఉద్ధృతం చేశారు. దేశవ్యాప్తంగా మార్గదర్శిపై బురద చల్లాలనే ఉద్దేశంతో ఏపీ సీఐడీ ఏడీజీ ఎన్‌.సంజయ్‌ బుధవారం ఏకంగా దిల్లీ ఏపీ భవన్‌లో జాతీయ మీడియాతో విలేకర్ల సమావేశం పెట్టారు. తెలుగు మీడియా ప్రతినిధులు వస్తే.. జరుగుతున్న దుష్ప్రచారాన్ని ప్రశ్నిస్తారన్న భయంతో వారిని లోపలికి రానివ్వకుండా శతవిధాలా ప్రయత్నించారు. సంస్థను ఆర్థికంగా దెబ్బతీయాలన్న భారీ కుట్రలో భాగంగానే ఏవో అక్రమాలు, అవకతవకలు జరిగిపోతున్నట్లు అభూతకల్పనలతో సీఐడీ చీఫ్‌ దిల్లీలో విలేకర్ల సమావేశం పెట్టారని మార్గదర్శి సంస్థ స్పష్టం చేసింది. సంస్థ యాజమాన్యాన్ని, సిబ్బందిని బెదిరించి.. చందాదారుల్లో భయాందోళనలు రేకెత్తించేందుకు సీఐడీ ప్రయత్నిస్తోందంటూ ఓ ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఇప్పటి వరకు మార్గదర్శిపై ఎన్ని ఫిర్యాదులు అందాయి? ఎంత మోసం జరిగింది? దాని పరిమాణం ఎంత అని విలేకర్ల సమావేశంలో జాతీయ మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక సంజయ్‌ నీళ్లు నమిలారు. ‘జనమంతా ఏడ్చుకుంటూ ప్రభుత్వం వద్దకు వచ్చేవరకు మేం వేచి చూడాలా?’ అని విలేకర్లనే ఎదురు ప్రశ్నించారు. ఏదో కుంభకోణం జరిగిపోతుందన్నట్లు లేనిపోని అభాండాలు వేశారు. మార్గదర్శి నిబంధనలను ఉల్లంఘిస్తోందని ఎంతమంది ఫిర్యాదు చేశారు? వారు ఎంత నష్టపోయారు అని విలేకర్లు పదేపదే ప్రశ్నించినా సమాధానం చెప్పలేక దిక్కులు చూశారు. మరోవైపు కేసుల విచారణ పేరుతో సుమారు 40 మందితో కూడిన ఏపీ సీఐడీ బృందం హైదరాబాద్‌లోని మార్గదర్శి ప్రధాన కార్యాలయంలో బుధవారం సోదాలకు దిగింది. రాత్రి పొద్దుపోయే వరకూ ఈ తనిఖీలు కొనసాగుతూనే ఉన్నాయి.

ఎవరో ఫిర్యాదు చేసే వరకూ వేచిచూడాలా.. ఏపీ సీఐడీ చీఫ్‌ ఎన్‌.సంజయ్‌: మార్గదర్శిపై కేసు నమోదు విషయంలో ఏపీ సీఐడీ ఏడీజీ ఎన్‌.సంజయ్‌ కొత్త వాదన చేశారు. ఈ అంశంపై జాతీయ మీడియాకు చెప్పడానికి బుధవారం ఇక్కడి ఏపీ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో.. ఇప్పటి వరకు ఎన్ని ఫిర్యాదులు అందాయి? ఎంత మోసం జరిగింది? దాని పరిమాణం ఎంత? అన్న ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పలేకపోయారు.

‘తమ డబ్బు రాలేదని ఒక్క వినియోగదారుడైనా ఫిర్యాదు చేశారా? మీరు ఏదైనా ఫిర్యాదుల ఆధారంగా దీనిపై చర్యలు తీసుకున్నారా? అని ప్రతి ఒక్కరూ అడుగుతున్నారు. ప్రజాసంక్షేమ సంరక్షణకు బాధ్యత వహించే ప్రభుత్వం ఇలాంటి జబ్బులకు పరిష్కారం కనుగొనకుండా ప్రేక్షకపాత్ర పోషించలేదు. మొత్తం జనం అంతా ఏడ్చుకుంటూ ప్రభుత్వం ముందు కూర్చొనే వరకూ మేం వేచిచూడాలా? అలాంటి పరిస్థితి వస్తే ఉపశమనం పేరుతో బాధితులకు ప్రభుత్వం రూ.వేల కోట్లు ఇవ్వాల్సి వస్తుంది. అందుకు అగ్రిగోల్డే ఉదాహరణ. అలాంటి పరిస్థితి వస్తే చిన్న మదుపర్లకు ఉపశమనం కల్పించమని ఉద్యమాలు మొదలవుతాయి’ అని కొత్త వాదన వినిపించారు.

‘మేం అలాంటి వాటన్నింటి కోసం ఎదురుచూస్తూ కూర్చోవాలా? ఎవరు పెద్ద, ఎవరు చిన్న, ఈ కంపెనీ ఎప్పుడు కూలిపోతుందని చూస్తూ ఉండాలా?’ అని విలేకర్లకు ఎదురుప్రశ్నలు వేశారు. స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్స్‌ ఐజీ తమను ఆశ్రయించడం వల్లే కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని మాత్రమే పదేపదే చెప్పారు. ఇప్పటి వరకు ఎంత మోసం జరిగిందన్నది తెలియదని, దాన్ని తెలుసుకోవడానికే ముందుకెళ్తున్నామని పేర్కొన్నారు. విలేకర్ల సమావేశంలో ఆయన ఏమన్నారంటే..

* ఏపీలో జరుగుతున్న ఆర్థిక నేరం, మోసం గురించి చెప్పడానికి ఇక్కడ విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశాం. ఇది కేవలం ఏపీతోనే కాకుండా ఇరుగుపొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకతోనూ ముడిపడి ఉంది. అందుకు జాతీయ స్థాయిలో హిందీ, ఆంగ్ల మీడియా ముందు హైలైట్‌ చేయడం మంచిదని మేం భావించాం.

* 1970లలో కొన్ని చిట్‌ఫండ్లలో అవకతవకలు, కుంభకోణాలు వెలుగుచూసిన తర్వాత 1982లో చిట్‌ఫండ్‌ యాక్ట్‌ వచ్చింది. ఈ చట్టం రాక ముందు (1962) నుంచే మార్గదర్శి సంస్థ ఉందన్నది నిజమైనా, 1982లో వచ్చిన చట్టంలోని నిబంధనలను వాళ్లు అనుసరించాల్సిందే. చట్టాన్ని విస్మరించలేరు. 2008లో ఏపీలో ఇందుకు సంబంధించిన చట్టాలు అమల్లోకి వచ్చాయి. అయితే మార్గదర్శి చిట్‌ఫండ్‌ కంపెనీ తనకు అనుకూలంగా ఉన్న కంపెనీ యాక్ట్‌ ప్రకారం మాత్రమే బ్యాలెన్స్‌ షీట్లు దాఖలు చేస్తోంది.

* మార్గదర్శి ఎప్పుడూ చిట్‌ఫండ్‌ యాక్ట్‌ ప్రకారం బ్యాలెన్స్‌ షీట్లు దాఖలు చేయలేదు. కానీ క్షేత్రస్థాయిలో చిట్‌ఫండ్‌ వ్యాపారం చేస్తున్నారు. బ్రాంచ్‌లు, వాటికి మేనేజర్లు ఉన్నారు. బ్రాంచిల్లో 30-40 మందిని కలిపి ఒక గ్రూప్‌ తయారు చేసి, దాని ద్వారా డబ్బు వసూలు చేస్తారు. ఆ సొమ్మును బ్రాంచి స్థాయిలోనే ఉంచాలి. దానికి బ్రాంచ్‌ మేనేజర్‌ సంరక్షకుడిగా ఉండాలి. అంతే తప్ప మొత్తం వసూలు చేసి, ప్రధాన కార్యాలయానికి పంపకూడదు. కానీ ఇక్కడ అదే జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో గత రెండేళ్లలో ఇలాంటి చిట్‌ కంపెనీలపై స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ డిపార్ట్‌మెంట్‌ దృష్టి సారించినప్పుడు వారికి స్పష్టమైన ఉల్లంఘనలు కనిపించాయి.

* ఆడిట్‌ అంతా జరిగిన తర్వాత మార్గదర్శి చెప్పేదేమంటే మా దగ్గర తగినంత మొత్తంలో నిల్వలున్నాయని, ఖాతాదారులకు చెల్లించడానికి తమ వద్ద తగినంత డబ్బు ఉందని. కానీ చిట్‌ఫండ్‌ విషయంలో శ్రీరాం చిట్స్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసులో సుప్రీంకోర్టు కొన్ని వ్యాఖ్యలు చేసింది. చిట్‌ఫండ్‌ యాక్ట్‌ అంటేనే సామాజిక, ఆర్థిక చట్టం అని.. చిట్‌ చందాదారుల ప్రయోజనాలను రక్షించడానికే దాన్ని పాస్‌ చేసినట్లు పేర్కొంది. మోసాలు జరగకుండా చర్యలు తీసుకోవడం ప్రభుత్వం బాధ్యత అని తెలిపింది.

* ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మౌనప్రేక్షకురాలిగా ఉండదలచుకోలేదు. ఈ విషయంలో ఏపీ సీఐడీని స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్స్‌ ఐజీ మార్చిలో సంప్రదించి ఈ నేపథ్యాన్ని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లోని 37 మార్గదర్శి బ్రాంచ్‌ల నుంచి ఏటా రూ.500 కోట్ల మేర నగదు రూపంలో ప్రజల నుంచి వసూలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు, కర్ణాటక, తమిళనాడుల్లో కలిపి 108 బ్రాంచ్‌లున్నాయి. ఏపీలో లక్ష మంది చందాదారులున్నారు. 2,351 చిట్‌గ్రూప్‌లు నడుస్తున్నాయి. 2021-22 ఆర్థిక సంవత్సరంలో కేవలం ఏపీ, తెలంగాణల్లోనే రూ.9,677 కోట్ల టర్నోవర్‌ జరిగింది.

* ఇక్కడ జరిగిన ఉల్లంఘనలు ఆదాయపన్ను, సీబీడీటీ, సీరియస్‌ ఫ్రాడ్‌ ఇన్వెస్టిగేషన్‌ ఆఫీస్‌, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ కార్పొరేట్‌ అఫైర్స్‌, ఈడీ పరిధిలోకి వస్తాయి. వాటిని అప్రమత్తం చేయడం మా బాధ్యత. అందువల్ల గత నెలలో వారికి లేఖలు రాశాం. ఇప్పుడు వాటిని కలిసి మా దర్యాప్తులో ఏం జరుగుతోందన్న అంశాలను వివరించాం.

విలేకర్ల ప్రశ్నలు.. ఏపీ సీఐడీ చీఫ్‌ సమాధానాలు

  • మార్గదర్శి కార్యాలయాల్లో ఇంకా సోదాలు నిర్వహిస్తున్నారా?

చిట్‌ఫండ్‌ బ్రాంచ్‌ స్థాయిలో ఉంటుంది.. కాబట్టి అక్కడ బ్రాంచ్‌ స్థాయి రికార్డు ఉంటే అంతవరకైనా చూడగలం. కానీ వారు ఏ రికార్డూ నిర్వహించకపోతే ఏం చూడలేం. వాళ్లు ముందస్తు బెయిల్‌ తీసుకున్నప్పటికీ మేం 37 బ్రాంచ్‌ల రికార్డులను పరిశీలించడానికి బృందాలను ఏర్పాటు చేశాం. ఇక్కడ అరెస్ట్‌ ఒక్కటే లక్ష్యం కాదు.. జరుగుతున్న ఆర్థిక నేరాన్ని అడ్డుకోవడం లక్ష్యం.

  • ఎంత మొత్తం మోసం జరిగిందని భావిస్తున్నారు. కనీసం తాత్కాలిక అంచనాలైనా చెప్పండి?

ఏటా రూ.506 కోట్లు వసూలు చేస్తున్నారు.

  • మీరు కేవలం మార్గదర్శిపైనే దృష్టి పెట్టారా? ఇతర కంపెనీలనూ పరిశీలిస్తున్నారా

మేం ఫోకస్‌ చేయలేదు. కేవలం దర్యాప్తు చేస్తున్నాం. గత 14 నెలల్లో అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ చిట్స్‌, స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ ఐజీ కలిసి 17 చిట్‌ఫండ్స్‌లో అవకతవకలను గుర్తించారు. అందులో పెద్దది మార్గదర్శి. మిగిలిన సంస్థల్లోని ఉల్లంఘనలపైనా దర్యాప్తు చేస్తున్నాం.

  • 60 ఏళ్లలో మీరు ఎన్ని కేసులు నమోదు చేశారు. మిగిలిన 17 కంపెనీల పేర్లు ఎందుకు బయటపెట్టడం లేదు?

వాటిపై దర్యాప్తు చేస్తున్నాం. (వాటి పేర్లేంటి అని అడిగితే మాత్రం ఆయన సమాధానం చెప్పలేదు)

  • కేవలం మార్గదర్శిపైనే ఫోకస్‌ ఎందుకు పెట్టారు? మిగతావాటిపై ఎందుకు లేదు? ఆ 17 పేర్లేంటి?

చెబుతాం.

  • టాప్‌ మేనేజ్‌మెంట్‌ను మీరు ప్రశ్నించారా? మీ దర్యాప్తునకు వారు సహకరిస్తున్నారా?

వారు వార్షిక రికార్డులు, బ్యాలెన్స్‌షీట్లు, లాభనష్టాల నివేదికలు ఇవ్వకపోవడం వల్లే చాలా జాప్యం జరిగింది. ఇక్కడ స్కాం జరగడానికి, బ్రేక్‌డౌన్‌ జరగడానికి, సంక్షోభం తలెత్తడానికి అవకాశం ఉందని చెప్పడానికి కారణం వాళ్లు సహకరించకపోవడమే. వాళ్లు మేమేమీ తప్పు చేయలేదంటున్నారు. మా ఉద్యోగం మేం చేస్తున్నాం.

  • మార్గదర్శి యాజమాన్యం తమకు వచ్చిన పారితోషికం, ఆదాయాన్ని మాత్రమే పెట్టుబడి పెట్టామని చెబుతోంది కదా?

ఎవరు ఏమైనా చెప్పొచ్చు. వాళ్లు చిట్‌ఫండ్‌ యాక్ట్‌ కింద కాకుండా కంపెనీల చట్టం కింద రిటర్న్స్‌ దాఖలు చేశారు.

  • డిపాజిటర్ల నుంచి ఎలాంటి ఫిర్యాదులూ లేకపోయినా మీరే సుమోటోగా కేసు నమోదు చేసి చర్యలు తీసుకున్నారా?

డిపాజిటర్లు విరిగిన చేతులతో పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేస్తారనుకుంటున్నారా? ప్రభుత్వ అధికారి ష్యూరిటీ ఇవ్వలేదని చిట్‌ డబ్బు చెల్లించడానికి అభ్యంతరం చెబుతున్నారు.

  • ఇది ప్రజాధనం కాబట్టి ష్యూరిటీ అడుగుతారు కదా?

ఇక్కడ ప్రజాధనాన్ని ప్రైవేటు సంస్థ నిర్వహిస్తోందన్న పేరుతో ప్రభుత్వం తమను ఏమీ అడగకూడదని అనడానికి లేదు.

  • ఇది ప్రధానంగా చిట్‌ఫండ్‌ రెగ్యులేషన్‌ ఉల్లంఘనలకు సంబంధించిన కేసా?

బేసికల్‌గా అదే.

  • ఇక్కడ ఎంత మోసం జరిగిందనుకుంటున్నారు?

ఇక్కడ మేం ప్రొసీజర్స్‌ గురించి మాట్లాడుతున్నాం.

  • కేంద్ర సంస్థలు ఏవైనా చర్యలు తీసుకున్నాయా?

మేం వారికి లేఖలు రాశాం.

ఇవీ చదవండి:

Last Updated : Apr 13, 2023, 8:31 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.