ETV Bharat / bharat

Anupriya Patel: 'అభివృద్ధికే పట్టం- మళ్లీ మాదే అధికారం'

Anupriya Patel: యూపీలో మరోసారి ఓటర్లు భాజపా కూటమినే గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు అప్నాదళ్​ అధ్యక్షురాలు, కేంద్ర మంత్రి అనుప్రియా పటేల్​. ప్రజలు, రైతుల ఆశీర్వాదం తమకే ఉంటుందని పేర్కొన్నారు. రైతుల కోసం యోగి ఆదిత్యనాథ్​ ప్రభుత్వం ఎన్నో పథకాలు తీసుకొచ్చిందని కితాబిచ్చారు. ఈటీవీ భారత్​ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె పలు విషయాలు వెల్లడించారు.

Anupriya Patel
Anupriya Patel
author img

By

Published : Jan 30, 2022, 2:35 PM IST

Anupriya Patel Exclusive: ఉత్తర్​ప్రదేశ్​ ఎన్నికల్లో మరోసారి భాజపా నేతృత్వంలోని ఎన్​డీఏ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు అప్నాదళ్​ అధ్యక్షురాలు, కేంద్ర మంత్రి అనుప్రియా పటేల్​. అప్నాదళ్​కు ప్రజల ఆశీర్వాదం ఉందని ఆమె అన్నారు. రాష్ట్రంలో ఐదేళ్లుగా అభివృద్ధిని ప్రజలు చూస్తున్నారని, మళ్లీ తమనే గెలిపిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.

అనుప్రియా పటేల్​తో ఈటీవీ భారత్​ ఇంటర్వ్యూ

భాజపా, అప్నాదళ్​, నిషాద్​ పార్టీ నేతలు కలిసి త్వరలోనే ప్రచారం నిర్వహించనున్నట్లు అనుప్రియా స్పష్టం చేశారు. సీట్ల పంపకం పూర్తి కాలేదని, కొద్దిరోజుల్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు.

ఉత్తర్​ప్రదేశ్​లో భాజపా నేతృత్వంలోని ప్రభుత్వం.. రైతుల కోసం ఎన్నో పథకాలను తీసుకొచ్చిందని తెలిపారు. ప్రధానమంత్రి కిసాన్​ సమ్మాన్​ నిధితో కోట్ల మంది రైతులకు ప్రయోజనాలు దక్కుతున్నాయన్న ఆమె.. వారు తమ వెంటే ఉన్నట్లు వివరించారు.

Anupriya Patel
అనుప్రియా పటేల్​

తన తండ్రి, అప్నాదళ్​ స్థాపకుడు సోనే లాల్​ పటేల్​ సిద్ధాంతాలను పాటిస్తూ.. పార్టీని నడిపిస్తున్నానని ఆమె అన్నారు.

2012లో రోహణియా నుంచి అసెంబ్లీకి ఎన్నికైన అనుప్రియ.. 2014లో మీర్జాపుర్​ నుంచి ఎంపీగా గెలుపొందారు. అనంతరం ఆమెను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుంది మోదీ ప్రభుత్వం. ప్రస్తుతం కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రిగా పనిచేస్తున్నారు.

Anupriya Patel
అనుప్రియా పటేల్​

UP Assembly Elections: ఉత్తర్​ప్రదేశ్​లో మొత్తం ఏడు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 10న తొలి దశ పోలింగ్​ నిర్వహించనున్నారు. మార్చి 10న ఫలితాలు వెలువడనున్నాయి.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇవీ చూడండి: UP polls 2022: యూపీ సమరంలో మానసిక యుద్ధం

కాంగ్రెస్‌లో వలస వేదన- ప్రియాంకా గాంధీకి కఠిన పరీక్ష

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.