Anticipatory bail for Chandrababu : వైఎస్సార్సీపీ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసుల్లో చంద్రబాబుకు హైకోర్టులో భారీ ఊరట లభించింది. మద్యం, అమరావతి ఇన్నర్ రింగ్‌రోడ్డు, ఉచిత ఇసుక కేసుల్లో చంద్రబాబుకు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఇటీవలే మూడు కేసుల్లో విచారణ పూర్తి చేసిన న్యాయస్థానం తీర్పు రిజర్వ్ చేసింది. ఈ మధ్యాహ్నం ఒకేసారి 3 కేసుల్లో న్యాయమూర్తి జస్టిస్ టి.మల్లికార్జునరావు తీర్పు వెలువరించారు. కొన్ని షరతులు విధించింది. ప్రధానంగా పిటిషనర్లు దర్యాప్తునకు సహకరించాలని స్పష్టం చేసింది. దర్యాప్తును ప్రభావితం చేసేలా వ్యాఖ్యలు చేయకూడదని ఆదేశించింది. కేసుకు సంబంధించి విషయాలను ఎక్కడా మాట్లాడకూడదన్న షరతులపై హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. మరోవైపు మద్యం కేసులో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, విశ్రాంత ఐఏఎస్ శ్రీనరేష్‌కు ముందస్తు బెయిల్ లభించింది.
చంద్రబాబుకు హైకోర్టులో భారీ ఊరట
Published : Jan 10, 2024, 2:31 PM IST
|Updated : Jan 10, 2024, 3:31 PM IST
14:28 January 10
మద్యం, ఇన్నర్ రింగ్‌రోడ్, ఉచిత ఇసుక కేసుల్లో ముందస్తు బెయిల్