దిల్లీ సరిహద్దులో కొనసాగుతున్న రైతుల ఆందోళనలో మరో ముగ్గురు కర్షకులు కన్నుమూశారు. నిరసనల్లో పాల్గొంటున్న ఇద్దరు రైతులు ఒకేరోజు మరణించారు. అంతకమందు రోజు రాత్రి మరో అన్నదాత ఆత్మహత్య చేసుకున్నాడు.
శ్రీ ముక్త్సర్ సాహెబ్.. గుండెపోటుతో టిక్రీ సరిహద్దులో హఠాన్మరణం పొందగా.. బర్నాలా వాసి జగదీష్ సింగ్(61) ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఆదివారం రాత్రి నిర్మల్ సింగ్ ఉరి వేసుకుని బలవన్మరణం పొందాడు. ఏక్తా డకోదా యూనియన్(పంజాబ్)లో నిర్మల్ కీలక పాత్ర పోషించాడు.
నిర్మల్ సింగ్కు రైతు రుణం కింద రూ. రూ.5లక్షల అప్పుండగా.. ప్రభుత్వం దాన్ని రుణమాఫీ చేయాలని రైతు సంఘాలు కోరాయి. అంతేకాకుండా.. అతడికి పరిహారంతో పాటు, కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించాలని డిమాండ్ చేశాయి.
ఇదీ చదవండి: కేంద్రంతో రైతుల 'కుస్తీ' మే సవాల్