ETV Bharat / bharat

రైతుల ఉద్యమానికి మద్దతుగా హజారే ఆందోళన - రైతులకు మద్దతుగా రామ్​లీలా మైదానానికి అన్నా హజారే

నూతన సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ దిల్లీ సరిహద్దుల్లో నిరసనలు చేపడుతున్న రైతులకు మద్దతుగా ఆందోళన చేపట్టనున్నట్టు సామాజిక ఉద్యమకారుడు అన్నాహజారే ప్రకటించారు. త్వరలోనే దిల్లీలోని రామ్​లీలా మైదానంలో రైతు దీక్షల్లో పాల్గొంటానని తెలిపారు. 'ఈటీవీ-భారత్​'కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వూలో కీలక వ్యాఖ్యలు చేశారు.

anna-hajare-in support of farmers
'దిల్లీ నిరసనలకు మద్దతుగా అన్నాహజారే దీక్ష'
author img

By

Published : Dec 24, 2020, 2:08 PM IST

దిల్లీ సరిహద్దుల్లో నిరసన చేస్తోన్న రైతులకు మద్దతు తెలిపిన అన్నాహజారే.. రామ్​లీలా మైదానంలో ఆందోళన చేపట్టనున్నట్లు ప్రకటించారు. రైతు సమస్యల పరిష్కారానికి గత నాలుగేళ్లుగా తాను నిరసనలు చేపడుతోన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రధాని మోదీ, వ్యవసాయ మంత్రి సమస్యల పరిష్కారానికి హామీ ఇస్తున్నారు తప్ప నెరవేర్చట్లేదని విమర్శించారు.

'దిల్లీ నిరసనలకు మద్దతుగా అన్నాహజారే దీక్ష'

జాతీయ వ్యవసాయ కమిషన్​కు రాజ్యాంగబద్ధత కల్పిస్తేనే అన్నదాతల సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నా హజారే అన్నారు. రాష్ట్రాలు నిర్ణయించే కనీస మద్దతు ధరలో కేంద్రం 20 నుంచి 50 శాతం కోత విధిస్తోందని, ఈ పరిస్థితి మారాలన్నారు. ఇక దిగుబడులు తగ్గిన సమయంలో రైతులకు ఆత్మహత్యే శరణ్యం అవుతోందని, స్వామినాథన్​ సిఫార్సులను పక్కాగా అమలు చేయాలని డిమాండ్​ చేశారు.

ఇక ఆలూ, టమాట, పాలు వంటి ఉత్పత్తుల ధరలు పతనమైనప్పుడు వాటిని రోడ్లపై పారవేయకుండా కనీస మద్దతు ధర ఇవ్వాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. రైతులకు మద్దతుగా త్వరలోనే ఆందోళనకు దిగుతానని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: కాంగ్రెస్​ ర్యాలీలో ఉద్రిక్తత- ప్రియాంక అరెస్ట్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.