ETV Bharat / bharat

ఇదే నా చివరి దీక్ష: అన్నా హజారే - నరేంద్ర సింగ్​ తోమర్​కు హజారే లేఖ

రైతు సమస్యలను జనవరి నెలాఖరులోగా కేంద్రం పరిష్కరించకపోతే నిరాహార దీక్ష చేపడతానని హెచ్చరించారు సామాజిక కార్యకర్త అన్నా హజారే. అదే తన చివరి దీక్ష అవుతుందని స్పష్టం చేశారు.

Anna Hazare threatens to launch his "last protest" for farmers
కేంద్రానికి అన్నాహజారే అల్టిమేటం
author img

By

Published : Dec 28, 2020, 12:34 PM IST

రైతు సమస్యలను పరిష్కరించకపోతే తాను మళ్లీ నిరాహార దీక్ష చేపడతానని కేంద్రాన్ని హెచ్చరించారు ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే. ఇందుకు ప్రభుత్వానికి వచ్చే జనవరి చివరి వరకు గడువు ఇస్తున్నట్లు తెలిపారు. వ్యవసాయ రంగానికి సంబంధించి తన డిమాండ్​లను నెరవేర్చడంలో మోదీ సర్కార్​ మూడేళ్లుగా విఫలమౌతోందని మహారాష్ట్ర అహ్మద్​నగర్ జిల్లాలోని తన స్వగ్రామం రాలేగావ్ సిద్ధిలో విమర్శించారు.

"కేంద్రంపై నాకు నమ్మకం లేదు. ప్రతిసారీ నిరాశను మిగుల్చుతోంది. ఉత్త వాగ్ధానాలతో విసిగిపోయాను. కేంద్ర ప్రభుత్వానికి వచ్చే ఏడాది జనవరి చివరి వరకు గడువు ఇస్తున్నాను. నా డిమాండ్ల పై స్పందించకపోతే నిరాహార దీక్ష చేపడతాను. అదే నా ఆఖరి దీక్ష అవుతోంది."

-అన్నా హజారే. సామాజిక వేత్త

వ్యవసాయ రంగంలో ఎంఎస్​ స్వామినాథన్​ కమిషన్ సిఫారసులు​ అమలు చేసి.. వ్యవసాయ ధరల కమిషన్​కు(సీఏసీపీ) స్వతంత్రత కల్పించాలని ఈ నెల కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్​ తోమర్​కు హజారే లేఖ రాశారు.

ఇదీ చూడండి: రైతుల ఉద్యమానికి మద్దతుగా హజారే ఆందోళన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.