ETV Bharat / bharat

నిరాహార దీక్షపై వెనక్కితగ్గిన అన్నా హజారే - farmers protest live updates

రైతు సమస్యలపై నిరవధిక నిరాహర దీక్షకు దిగుతానని ప్రకటించిన కొన్ని గంటల వ్యవధిలోనే సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. శనివారం చేపట్టనున్న నిరవధిక నిరాహార దీక్షను రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటించారు.

anna-hazare-postpones-protest-against-farm-laws
నిరాహార దీక్షపై వెనక్కితగ్గిన అన్నా హజారే
author img

By

Published : Jan 30, 2021, 5:06 AM IST

నేటి నుంచి నిరాహార దీక్ష చేయనున్నట్లు ప్రకటించిన సామాజిక కార్యకర్త అన్నా హజారే తన నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు. దీక్ష రద్దు చేసుకుంటున్నట్లు శుక్రవారం ప్రకటించారు.

అంతకుముందు భాజపా సీనియర్‌ నేత, మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడణవీస్‌, కేంద్ర వ్యవసాయశాఖ సహాయ మంత్రి కైలాష్‌ చౌదరి.. హజారేతో సమావేశమయ్యారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో వారి సమక్షంలోనే హజారే ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. తన డిమాండ్లలో కొన్నింటిని కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందన్నారు. అలాగే, రైతుల జీవితాలను మెరుగుపరిచేందుకు ఓ కమిటీని కూడా ఏర్పాటు చేస్తామని ప్రకటించిందన్నారు.

anna-hazare-postpones-protest-against-farm-laws
అన్నా హజారేను కలిసిన భాజపా సీనియర్​ నేతలు

''నా డిమాండ్లలో కొన్నింటిని పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. రైతుల ప్రయోజనాల కోసం.. ఒక కమిటీని నియమించనున్నట్లు ప్రకటించింది. శనివారం నుంచి ప్రారంభించాలనుకున్న నిరాహార దీక్షను రద్దు చేసుకుంటున్నా.''

- అన్నా హజారే, సామాజిక కార్యకర్త

83 ఏళ్ల అన్నా హజారే రైతు సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీకి గతంలో లేఖ రాశారు. జనవరి ఆఖరు నాటికి ఈ డిమాండ్లపై సానుకూలంగా స్పందించకపోతే నిరవధిక నిరాహార దీక్షకు దిగుతానని హెచ్చరించారు.

అయితే.. ఎప్పటినుంచో రైతులకు మద్దతుగా నిలుస్తున్న హజారే తన స్వగ్రామం రాలేగావ్​ సిద్ధిలో నిరాహార దీక్ష చేసేందుకు సిద్ధమై, వెనక్కితగ్గడం చర్చనీయాంశంగా మారింది.

ఇదీ చూడండి: 'సాగు చట్టాలు భేష్​- 'దిల్లీ హింస' బాధాకరం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.