అవినీతి ఆరోపణల విషయంలో సీబీఐ తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని కోరుతూ బాంబే హైకోర్టును ఆశ్రయించారు మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్. ఈ మేరకు పిటిషన్ దాఖలు చేశారు. తనపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా రక్షణ కల్పిస్తూ ముందస్తు ఉత్తర్వులు జారీ చేయాలని న్యాయస్థానాన్ని కోరారు. ఈ వారంలోనే పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉంది.
నెలకు రూ.100 కోట్లు వసూలు చేసేలా పోలీసులకు దేశ్‌ముఖ్ ఆదేశాలు జారీ చేశారని ముంబయి మాజీ కమిషనర్ పరమ్‌బీర్ సింగ్ చేసిన ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు చేస్తోంది. బాంబే హైకోర్టు ఆదేశాల మేరకు ప్రాథమిక దర్యాప్తు ప్రారంభించింది. విచారణలో భాగంగా.. దేశ్‌ముఖ్‌పై అధికారికంగా దర్యాప్తు చేసేందుకు తగిన ఆధారాలు లభించిన నేపథ్యంలో ఇటీవలే ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.
ఇదీ చదవండి: 'ఒక సిటీ స్కాన్.. 400 ఎక్స్‌రేలతో సమానం'