Anil Deshmukh ED Chargesheet: మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అనుబంధ ఛార్జిషీట్ దాఖలు చేసింది. దాదాపు 7వేల పేజీలు ఉన్న ఈ అభియోగ పత్రంలో దేశ్‌ముఖ్ భార్య, కుమారులను కూడా నిందితులుగా పేర్కొంది. ఈ ఛార్జిషీట్‌ను ప్రత్యేక కోర్టుకు సమర్పించింది ఈడీ.
55 రోజులుగా జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న అనిల్‌కు ప్రస్తుతం గడువు పూర్తయినందువల్ల ప్రత్యేక కోర్టులో హాజరుపరిచింది ఈడీ. జ్యుడిషియల్ కస్టడీని ప్రత్యేక కోర్టు జనవరి 10వరకు పొడిగించింది.
Anil Deshmukh News: అనిల్ దేశ్‌ముఖ్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) నవంబరు 2వ తేదీ అర్ధరాత్రి అరెస్టు చేసింది. మనీలాండరింగ్ కేసులో 12 గంటలపాటు ప్రశ్నించిన అధికారులు.. అనంతరం ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో అనిల్ దేశ్ముఖ్తో పాటు కుందన్ శిందే, సంజీవ్ పలాండేను సైతం ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు.
బార్లు, రెస్టారెంట్ల నుంచి ప్రతి నెల రూ.100కోట్లు వసూలు చేయాలని పోలీసు అధికారులపై దేశ్‌ముఖ్ ఒత్తిడి తెచ్చినట్లు ముంబయి మాజీ సీపీ పరంబీర్ సింగ్ ఆరోపించారు. ఈ ఆరోపణలపై విచారణ జరిపిన కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) ఆయనపై కేసు నమోదు చేసింది. సీబీఐ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ ఆయనపై చర్యలు చేపట్టింది.
ఇవీ చూడండి: అప్పటివరకు ఈడీ కస్టడీలోనే మాజీ హోంమంత్రి
Deshmukh corruption probe: పరమ్‌బీర్ సింగ్‌పై మరో వారెంట్ రద్దు