ETV Bharat / bharat

వేధిస్తున్నారంటే.. వేటు వేశారు! కాంగ్రెస్​ నుంచి అంకిత సస్పెండ్​.. బీజేపీ చురకలు

అసోం కాంగ్రెస్​లో ముసలం మొదలైంది. ఇండియన్ యూత్​ కాంగ్రెస్​ చీఫ్​ బీవీ శ్రీనివాస్‌పై వేధింపుల ఆరోపణలు చేసిన ఆ రాష్ట్ర యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు అంకిత దత్తాపై ఆ పార్టీ​ వేటు వేసింది. ఆరేళ్ల పాటు బహిష్కరించింది. మరోవైపు, కాంగ్రెస్​ పార్టీ తీసుకున్న నిర్ణయంపై ఆ పార్టీకి చురకలంటించింది.

Angkita Dutta Congress assam
Angkita Dutta Congress assam
author img

By

Published : Apr 22, 2023, 5:42 PM IST

కాంగ్రెస్​ నేత, అసోం యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు అంకిత దత్తాపై ఆ పార్టీ వేటు వేయడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. పార్టీలో కొందరు తనను వేధిస్తున్నారంటూ అంకిత ఆరోపణలు చేసిన రోజుల వ్యవధిలోనే.. ఆమెను పార్టీ నుంచి బహిష్కరించడం వివాదాస్పదమైంది. ఈ విషయంపై బీజేపీ కూడా స్పందించింది. కాంగ్రెస్​ పార్టీకి చురకలంటించింది. ఇంతకీ ఏం జరిగిందంటే..

ఇండియన్‌ యూత్‌ కాంగ్రెస్‌ చీఫ్‌ బీవీ శ్రీనివాస్‌పై అంకితా దత్తా పలు ఆరోపణలు చేశారు. తనను శ్రీనివాస్​ మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నారని.. వివక్ష చూపిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఈ విషయాన్ని కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా దృష్టికి తీసుకెళ్లినా.. వారు కూడ ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెప్పారు. ఈ విషయమై అంకిత.. బుధవారం దిస్పుర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే అసోం పోలీసు సీఐడీ విభాగం.. శ్రీనివాస్‌కు సమన్లు జారీ చేసింది. దీంతో పాటు ఈ ఆరోపణలపై దర్యాప్తు చేపట్టాలని జాతీయ మహిళా కమిషన్‌ కూడా రాష్ట్ర పోలీసులను కోరింది.

Angkita Dutta Congress assam
అంకిత దత్తాను బహిష్కరిస్తూ కాంగ్రెస్​ విడుదల చేసిన ప్రెస్​ నోట్

ఈ వివాదం సాగుతుండగానే.. అంకిత దత్తాపై కాంగ్రెస్​ పార్టీ వేటు వేసింది. అంకిత పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతోందని ఆరోపిస్తూ.. ఆమె ప్రాథమిక సభ్యత్వాన్ని ఆరేళ్లు రద్దు చేసింది. ఈ విషయమై కాంగ్రెస్​ పార్టీ క్రమశిక్షణా చర్యల కమిటీ శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. అంకిత దత్తా చేసిన ఆరోపణలు నిరాధారమని.. రాజకీయ ప్రేరేపితమైనవిగా గుర్తించినట్లు అసోం పీసీసీ కమిటీ వర్గాలు వెల్లడించాయి. పార్టీలో ఉన్న నేతల పరువుకు భంగం కలిగించే చర్యలకు పాల్పడినందుకే ఆమెను బహిష్కరించినట్లు తెలిపాయి.

కాంగ్రెస్​పై బీజేపీ విమర్శనాస్త్రాలు..
అంకిత దత్తాను కాంగ్రెన్​ నుంచి బహిష్కరించడాన్ని బీజేపీ తప్పుబట్టింది. ఆమెకు సంబంధించి జరుగుతున్న పరిణామాలపై స్పందించింది. కాంగ్రెస్‌పై విమర్శనాస్త్రాలు సంధించింది. మహిళా సాధికారత కోసం కాంగ్రెస్‌ అవలంబిస్తున్న విధానమిదేనని ఎద్దేవా చేసింది. సీనియర్‌ నాయకులు తనను వేధిస్తున్నారని చెప్పిన మహిళ సమస్యను పరిష్కరించాల్సింది పోయి.. ఆమెపైనే వేటు వేశారని చురకలంటించింది. అంకిత విషయంలో కాంగ్రెస్‌ పార్టీ తీసుకున్న నిర్ణయం సరైనది కాదు అని హితవు పలికింది. ''నేను మహిళను.. నేను పోరాడగలను అని కాంగ్రెస్‌ చెప్పే నినాదం.. వట్టి మాటే'' అని బీజేపీ కొట్టిపారేసింది.

ఇది ఆడబిడ్డ గౌరవానికి సంబంధించిన విషయం : అసోం ముఖ్యమంత్రి
అంకిత దత్తాను కాంగ్రెస్​ నుంచి బహిష్కరించడంపై అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ స్పందించారు. ''ఈ సమస్య మా దృష్టికి వచ్చినప్పుడు.. కాంగ్రెస్​ అంతర్గత విషయమని.. అది వారే పరిష్కరించుకోవాలని చెప్పాము. కానీ అది ఒక ఆడబిడ్డ గౌరవానికి సంబంధించిన విషయం అయినప్పుడు.. ఎంతటి వారైనా చర్య తీసుకోవాలి. అంకితను కాంగ్రెస్ బహిష్కరించింది. కాంగ్రెస్​ ఆ సమస్యను పరిష్కరించలేదు. కాబట్టి.. పార్టీ చేయకుంటే చట్టమే తేల్చాలి'' అని హిమంత చెప్పుకొచ్చారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.