ముంబయిలో ప్రముఖ తాజ్ హోటల్లో రూ.6కే గది! ఇంత విశాలవంతమైన, అత్యద్భుతంగా ఉండే హోటల్లో రూ. 6కే గది దొరకడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా? అయితే ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర చేసి ట్వీట్ చూడాల్సిందే.
సామాజిక మాధ్యమాల్లో చురుకుగా ఉండే ఆనంద్ మహీంద్ర.. ట్విట్టర్లో తాజ్ హోటల్‌కు సంబంధించి ఓ ట్వీట్ చేశారు. ఇప్పడంటే రూ. వేలు, రూ. లక్షల్లో గది రెంట్ ఉంటుందేమో కానీ.. 1903లో మాత్రం రూ. 6కే హొటల్లో విశాలవంతమైన గది దొరికేదని ఈ ట్వీట్ చూస్తే అర్థమవుతుంది.
-
So here’s a way to beat inflation. Get into a time machine and go back…way back. ₹6 per night for the Taj, Mumbai? Now those were the days… pic.twitter.com/7WYHqKodGx
— anand mahindra (@anandmahindra) August 6, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">So here’s a way to beat inflation. Get into a time machine and go back…way back. ₹6 per night for the Taj, Mumbai? Now those were the days… pic.twitter.com/7WYHqKodGx
— anand mahindra (@anandmahindra) August 6, 2021So here’s a way to beat inflation. Get into a time machine and go back…way back. ₹6 per night for the Taj, Mumbai? Now those were the days… pic.twitter.com/7WYHqKodGx
— anand mahindra (@anandmahindra) August 6, 2021
'ద్రవ్యోల్బణం ఎదుర్కోవాలంటే.. టైమ్ మెషిన్ వేసుకొని తిరిగి ఆ రోజుల్లోకి వెళ్లాల్సిందే. ముంబయి తాజ్‌లో ఒక రాత్రికి గది రూ.6 మాత్రమే!' అని క్యాప్షన్ జోడించారు ఆనంద్ మహీంద్ర.
తాజ్ హోటల్‌ను తాజ్ గ్రూప్ వ్యవస్థాపకుడు, దిగ్గజ వ్యాపారవేత్త జంషెద్ టాటా నిర్మించారు. ఇది 1903 డిసెంబర్ 1న తెరుచుకుంది. తాజ్ మహల్‌కు ప్రతీకగా ఈ హోటల్‌కు ఆ పేరుపెట్టారు.
ఇదీ చూడండి:- నీరజ్ చోప్డాకు ఆనంద్ మహీంద్రా ప్రత్యేక బహుమతి!