ETV Bharat / bharat

25 పైసలుంటే మీరు లక్షాధికారి అయినట్లే..!

లక్షలు సంపాదించాలంటే.. విపరీతంగా కష్టపడాల్సిన పనిలేదు. ఎవరినో బురిడీ కొట్టి సంపాదించాల్సిన పని ముమ్మాటికీ లేదు. 25 పైసలుంటే చాలు.. ఇది వినగానే ఆశ్చర్యం కలిగింది కదూ!. మరి ఇంత తక్కువ డబ్బుతో లక్షలు ఎలా సంపాదించవచ్చో తెలుసుకోండి.

author img

By

Published : Jun 26, 2021, 6:17 PM IST

Updated : Jun 26, 2021, 6:54 PM IST

old coins
పాత నాణేలు, పాత పైసలు

పాత నాణేలను దాచి పెట్టుకునే అలవాటు చాలా మందికి ఉంటుంది. మరికొందరికి ఆ నాణేలను పోగు చేసే అలవాటు ఉంటుంది. ఇలా కాయిన్లను పోగు చేసే క్రమంలో లక్షలు ఇచ్చి మరీ పాత నాణేలను కొంటున్నారు కొందరు. దీనికోసం ఓ ప్రత్యేక వెబ్​సైట్​ను కూడా నడిపిస్తున్నారు. ఇండియామార్ట్​ డాట్ కామ్(indiamart.com), అర్న్​మనీ(earn money) మొదలైన వెబ్​సైట్లలో ఈ నాణేలకు విపరీతంగా డిమాండ్​ పెరిగింది. అయితే.. ఈ నాణేలకు మంచి ధర నిర్ణయించుకుని కొనుగోలుదారుడిని ఒప్పించాల్సిన బాధ్యత మాత్రం నాణేలు అమ్మేవారిదే.

వెబ్​సైట్​లో అమ్మేదెలా..?

  1. ఇండియామార్ట్​ అధికారిక వెబ్​సైట్​లోకి వెళ్లాలి. ఇందులో అమ్మేవారు, కొనేవారికి మధ్య వ్యాపారం జరిపే వెలుసుబాటు ఉంటుంది.
  2. వెబ్​సైట్​లో రిజిస్టర్ కావాలి.
  3. మీ దగ్గర ఉన్న పాత నాణెం​ ఫొటో తీసి.. వెబ్​సైట్​లో అమ్మకానికి పెట్టాలి.
  4. ఆ నాణేలను కొనేందుకు ఆసక్తి చూపిన కొనుగోలుదారులతో మాట్లాడాలి.
  5. కొనుగోలుదారు.. మీరు ఆశించిన ధరకు అంగీకరిస్తే పాత నాణెం అమ్మేయాలి.

క్వికర్(Quikr), కాయిన్​బజార్(coinbazzar) మొదలైన వెబ్​సైట్లలోను పాతనాణేలను అమ్ముకోవొచ్చు. ప్రస్తుతం ప్రత్యేక ఫీచర్లున్న పాత 25 నాణేలకు మార్కెట్లో మంచి ధర పలుకుతోంది.

రెండు రూపాయలుంటే.. రూ. 5 లక్షలు!

రెండు రూపాయల నాణెం ఉంటే రూ. 5 లక్షల వరకు నగదు ఇవ్వనున్నట్లు క్వికర్ తమ వెబ్​సైట్​లో యాడ్ ఇచ్చింది.

  • 1994లో ముద్రించిన రెండు రూపాయల నాణెం(మరోవైపు జాతీయ పతాకం చిహ్నం) ఉంటే.. ఆ కాయిన్​కు రూ. 5 లక్షలు
  • స్వతంత్య్రానికి ముందు ముద్రించిన రూపాయి నాణెం(ఒక భాగంలో క్వీన్ విక్టోరియా బొమ్మ) ఉంటే.. ఆ కాయిన్​కు రూ. 2 లక్షలు
  • 1918లో ముద్రించిన రూపాయి నాణెం(మరోవైపు బ్రిటీష్ కింగ్ జార్జ్​ వీ బొమ్మ) ఉంటే.. ఆ కాయిన్​కు రూ. 9 లక్షల వరకు ధర ఉంటుందని క్వికర్​ యాడ్ ఇచ్చింది.

అయితే.. విక్రయదారు, కొనుగోలుదారు​లే నాణెం​ ధరలను అంతిమంగా నిర్ణయించుకుంటారు.

జాగ్రత్త సుమీ..!

పాత కాయిన్లు కొంటామంటూ ఆన్​లైన్​ మోసాలూ ఎక్కువగానే జరుగుతున్నాయి. 1947లో ముద్రించిన ఓ రూపాయి నాణేన్ని అమ్మే క్రమంలో బెంగుళూరుకు చెందిన ఓ మహిళ సైబర్​ వలలో చిక్కుకున్నారు.

తొలుత.. పాత కాయిన్​కు రూ. కోటి ఇస్తామని మహిళకు చెప్పారు సైబర్​ నేరగాళ్లు. ట్రాన్స్​ఫర్​ ఛార్జీల కోసం రూ. లక్ష పంపాలని మహిళను కోరారు. అది నిజమే అనుకుని లక్ష రూపాయలు పంపి మోసపోయానంటూ పోలీసులను ఆశ్రయించారు బెంగళూరు మహిళ.

ఇదీ చదవండి:బృహన్‌ ముంబయిలో చిల్లర జీతాలు

Last Updated : Jun 26, 2021, 6:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.