మామూలుగా మొసళ్లు సరస్సులోనో, నదులలోనో ఉంటాయి. గుజరాత్ వడోదరలోని కలాన్పుర్లో నిర్మాణ పనులు జరుగుతున్న ప్రదేశంలో 11 అడుగుల మొసలి బయటపడింది. దీంతో ఆశ్ఛర్యపోవడం అక్కడి వారి వంతైంది.
వెంటనే ఆ మొసలిని ఓ బోనులో పెట్టి అటవీ శాఖ అధికారులకు అప్పగించారు వన్యప్రాణుల సంరక్షణ ట్రస్ట్ వారు.
"నిర్మాణ పనులు చేస్తున్నప్పుడు మొసలి మాకు కనిపించింది. దాన్ని రక్షించి, అటవీ అధికారులకు అప్పగించాము."
-వన్యప్రాణుల సంరక్షణ ట్రస్ట్ అధ్యక్షుడు
ఇదీ చూడండి: స్నిఫర్ డాగ్‌కు పోలీసుల ఘన వీడ్కోలు