ETV Bharat / bharat

'భవిష్యత్​లో తమిళ వ్యక్తే దేశ ప్రధాని!.. అధికారంలోకి వచ్చాక చీకటి రాష్ట్రంలో వెలుగులు'

author img

By

Published : Jun 11, 2023, 7:15 PM IST

Amith Shah Chennai Visit : భవిష్యత్​లో తమిళ వ్యక్తిని భారతదేశ ప్రధానిగా చేయాలంటూ కేంద్ర హోంమంత్రి అమిత్​ షా వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి పేద కుటుంబంలో నుంచి రావాలని ఆయన అన్నారు.

Amith Shah Chennai Visit
అమిత్ షా చెన్నై పర్యటన

Amith Shah Chennai Visit : రాబోయే రోజుల్లో దేశానికి ఒక తమిళ వ్యక్తిని ప్రధాన మంత్రిని చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్​ షా పిలుపునిచ్చారు. ప్రస్తుతం తమిళనాడులో పర్యటిస్తున్న షా.. ఆదివారం దక్షిణ చెన్నై పార్లమెంట్​ బీజేపీ నాయకులతో సమావేశం అయ్యారు. 'మేము (బీజేపీ) గతంలో రెండు సార్లు తమిళ వ్యక్తిని ప్రధాని చేసే అవకాశం కోల్పోయాము. దీనికి డీఎంకే పార్టీ ప్రధాన కారణం. భవిష్యత్​లో తప్పకుండా తమిళ వ్యక్తి పీఎం రేసులో ఉంచేందుకు నిబద్ధతతో పనిచేస్తాం. ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి పేద కుటుంబంలో నుంచి రావాలి' అని అమిత్ షా అన్నారు.

రాబోయే 2024 ఎన్నికల్లో బీజేపీ 25 లోక్​సభ స్థానాలు గెలిచేలా కృషి చేయాలని.. దాని కోసం బూత్ కమిటీలను బలపర్చాలని కార్యకర్తలను షా కోరారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తమిళనాడులో బీజేపీ ఎంపీల సంఖ్య రెండంకెలకు చేరాలని ఆయన అన్నారు. తమిళనాడులో బీజేపీ కనీసం 25 స్థానాలను కైవసం చేసుకునేలా లక్ష్యాన్ని పెట్టుకున్నట్లు షా తెలిపారు. ఈ క్రమంలోనే దక్షిణ చెన్నైలో 60 శాతం పని పూర్తయినట్లు.. మిగిలిన 40 శాతాన్ని సెప్టెంబరులోపు పూర్తి చేయనున్నట్లు స్పష్టం చేశారు. గడిచిన 9 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లి.. 2024 ఎన్నికల్లో దక్షిణ చెన్నై పార్లమెంటును గెలిచేలా కష్టపడాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.

  • Shri @AmitShah today addressed a Public Meeting in Vellore, Tamil Nadu and talked extensively about the work done by the Modi govt during the last nine years.

    Here are some glimpses from the Public Meeting! pic.twitter.com/neM8x3Nse1

    — BJP (@BJP4India) June 11, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

పర్యటనలో భాగంగా శనివారం రాత్రి అమిత్​ షా చెన్నై విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఎయిర్​పోర్టుకు వచ్చారు. ఈ క్రమంలో విమానాశ్రయ సమీపంలో కరెంట్ పోయి చీకటి అలుముకుంది. దీనిపై ఆదివారం సమావేశంలో స్పందిచిన షా.. 'చీకట్లో నడవడం నాకు కొత్త కాదు. నేను విమానాశ్రయం నుంచి నడిచి వస్తుంటే తమిళనాడు చీకట్లో ఉన్నట్లు కనిపించింది. ఇక్కడ బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసి తమిళనాడును వెలుగులోకి తీసుకువద్దాం' అని అన్నారు.

  • பொருளாதார சீர்திருத்தங்கள் முதல் சமூக முன்முயற்சிகள் வரை, கடந்த 9 ஆண்டுகளில், குடிமக்களுக்கான அவரது கடமைகளை நிறைவேற்றுவதற்காக தீர்மானத்துடன் பிரதமர் @narendramodi அவர்களின் தலைமையில் வலிமையான சக்தியை இந்தியா உணர்ந்தது.

    மோடி அரசின் 9 ஆண்டு நிறைவை முன்னிட்டு வேலூர் கூட்டத்தில். pic.twitter.com/D0jMaLoOhZ

    — Amit Shah (@AmitShah) June 11, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

చెన్నై పర్యటన అనంతరం అమిత్ షా వేలూర్ సభకు హాజరయ్యారు. దీనిపై స్పందించిన రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్.. రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు బీజేపీ ఇప్పటి నుంచే సిద్ధం అవుతుందని తెలిపారు. కాగా సీఎం విమర్శలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే.అన్నామలై కొట్టిపారేశారు. అమిత్​ షా వేలూర్, చెన్నై పర్యటనలు ఎన్నికల కోసం కాదని.. తమ నాయకులు ఎవరు వచ్చినా ఆయా నియోజకవర్గాల్లో తిరిగి ప్రజలతో మమేకమవుతారని, నిజంగా నాయకులు అలాగే ఉండాలని అన్నామలై కౌంటర్​ ఇచ్చారు. రానున్న మూడు, నాలుగు నెలల్లో రాష్ట్రంలో ప్రధాని మోదీ పర్యటన ఉండనుందని అన్నామలై తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.