ETV Bharat / bharat

'ఆర్టికల్‌ 370 శాశ్వతమంటే రాజ్యాంగాన్ని అవమానించినట్లే- సరైన సమయంలో హోదా పునరుద్ధరిస్తాం' - కాంగ్రెస్​పై అమిత్ షా విమర్శలు

Amit Shah On Abrogation Of Article 370 : జమ్ముకశ్మీర్ సరైన సమయంలో రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తామని రాజ్యసభ వేదికగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారు. ఆర్టికల్‌ 370 ముసుగులో మూడు కుటుంబాలు మాత్రమే అధికారాన్ని అనుభవించాయని విమర్శించారు. గత 75 ఏళ్లుగా స్థానిక ఎస్టీ ప్రజలు అన్ని హక్కుల్నీ కోల్పోయారని అమిత్ షా పేర్కొన్నారు.

Amit Shah On Abrogation Of Article 370
Amit Shah On Abrogation Of Article 370
author img

By PTI

Published : Dec 11, 2023, 9:59 PM IST

Amit Shah On Abrogation Of Article 370 : జమ్ముకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించిన రాజ్యాంగంలోని 'ఆర్టికల్‌ 370'ని రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం సరైందేనంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా స్వాగతించారు. ఇప్పటికీ ఆర్టికల్‌ 370 శాశ్వతమైనదని ఎవరైనా అంటే వారు భారత రాజ్యాంగాన్ని, పార్లమెంట్‌ను అవమానించినట్లేనన్నారు. ఆర్టికల్‌ 370 రద్దుపై సుప్రీం కోర్టు ఇచ్చిన తాజా తీర్పు తర్వాత జమ్ముకశ్మీర్‌ రాజ్యాంగానికి ఇకపై ఎలాంటి విలువ ఉండబోదని చెప్పారు. సరైన సమయంలో జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తామన్న హామీకి కట్టుబడి ఉన్నట్లు అమిత్‌ షా తెలిపారు. జమ్ముకశ్మీర్‌ రిజర్వేషన్‌ సవరణ బిల్లు, జమ్ముకశ్మీర్‌ పునర్విభజన సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా కేంద్రహోం మంత్రి అమిత్ షా సుదీర్ఘ ప్రసంగం చేశారు. చర్చ అనంతరం రాజ్యసభ మూజవాణి ఓటుతో ఆమోదముద్ర వేసింది.

"జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 వేర్పాటువాదానికి దారితీసింది. అది తీవ్రవాదాన్ని ప్రోత్సహించింది. ఆర్టికల్‌ 370 రద్దుపై తాజాగా సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రతిపక్షాలకు చెంపపెట్టు లాంటిది. కశ్మీరీలకు న్యాయం చేసేందుకు మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉంది. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ భారత్‌లో భాగం. దానిని ఎవరూ ఆక్రమించలేరు. కాదని ఎవరైనా ప్రయత్నిస్తే గట్టిగా బుద్ధి చెబుతాం. భారతదేశ అంగుళం భూభాగాన్ని కూడా కోల్పోయే ప్రసక్తే లేదు. అందుకు బీజేపీ ఎప్పటికీ సిద్ధంగా ఉండదు. ఆర్టికల్‌ 370 ముసుగులో మూడు కుటుంబాలు అధికారాన్ని అనుభవించాయి. గత 75 ఏళ్లుగా స్థానిక ఎస్టీ ప్రజలు అన్ని హక్కుల్నీ కోల్పోయారు"

- అమిత్ షా, కేంద్ర హోం మంత్రి

మరోసారి రాజ్యసభ వేదికగా భారత మాజీ ప్రధాని నెహ్రూపై అమిత్‌ షా విమర్శలు చేశారు. కేవలం ఒకే వ్యక్తి వల్ల భారత్‌లో జమ్ముకశ్మీర్‌ భాగం కావడం ఆలస్యమైందంటూ ఆయన్ను ఉద్దేశించి అన్నారు. కశ్మీర్‌లో కాల్పుల విరమణ లేకపోయి ఉంటే అసలు పీఓకే ఉండేది కాదని చెప్పారు. ఆర్టికల్‌ 370 రద్దుకు ప్రధాని మోదీతోపాటు కేంద్ర మంత్రివర్గం, బీజేపీ పూర్తి బాధ్యత వహిస్తున్నట్లు తెలిపారు. వేర్పాటువాదాన్ని ప్రోత్సహించిన నాయకులను కశ్మీర్‌ ప్రజలు తిరస్కరించారని చెప్పారు. ఉగ్రవాదులకు నిధులు సమకూరుస్తున్న వారిని గుర్తించి, ఆ వ్యవస్థను పూర్తిగా నిర్మూలించేందుకు ప్రయత్నించామని తెలిపారు.

  • #WATCH | As Union Home Minister speaks on the J&K Reservation (Amendment) Bill, 2023 and J&K Reorganisation (Amendment) Bill, 2023 in the Rajya Sabha, he reads out a quote of former PM Jawaharlal Nehru

    He says, "One thing is known by everyone, had there not been an untimely… pic.twitter.com/l736jQ5oIq

    — ANI (@ANI) December 11, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత భారీ స్థాయిలో దాడులు ఎప్పుడైనా జరిగాయా? పెద్ద సంఖ్యలో ఎవరైనా మరణించారా? అని అమిత్‌ షా ప్రశ్నించారు. ఉరీ, పుల్వామా సెక్టార్లలో మారణహోమం సృష్టించిన వారిని, వాళ్ల ఇంటికి వెళ్లి మరీ హతమార్చామంటూ పాక్‌ భూతలంలో సర్జికల్‌ స్ట్రైక్స్‌ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇప్పుడు భారతదేశంలో ఒకే రాజ్యాంగం, ఒకే జెండా, ఒకే ప్రధాని ఉన్నారని ఈ సందర్భంగా అమిత్‌ షా వ్యాఖ్యానించారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్ముకశ్మీర్​లో రెండు కోట్ల మంది పర్యటకుల సందర్శించారని అమిత్ షా తెలిపారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత 100 సినిమా షూటింగ్​లు, 3 థియేటర్లు తెరుచుకున్నాయని వెల్లడించారు.

మధ్యప్రదేశ్​ కొత్త ముఖ్యమంత్రిగా మోహన్ యాదవ్​- ఎవరీయన?

ఆరో రోజూ ఐటీ సోదాలు, అసలు లెక్క రూ.350 కోట్లకుపైనే- 'రాహుల్​, సోనియా మౌనం వీడాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.