ETV Bharat / bharat

'ఏమీ చేయలేకపోతున్నాం.. రాష్ట్రపతి పాలన విధించండి'

రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులను దృష్టిలో ఉంచుకొని దేశ రాజధానిలో రాష్ట్రపతి పాలన విధించాలని ఆప్​ ఎమ్మెల్యే షోయబ్​ ఇక్బాల్​ డిమాండ్​ చేశారు. ఈ కష్టకాలంలో తాను, ప్రభుత్వం కరోనా సోకిన వారికి ఏ విధమైన సాయం చేయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు యూపీలో అధికార పక్షంపై సొంత పార్టీ ఎమ్మెల్యేనే విమర్శలు చేయడం గమనార్హం.

AAP, aap flag
'రాష్ట్రపతి పాలన పెట్టాలి.. లేకపోతే శవాల కుప్పలే'
author img

By

Published : Apr 30, 2021, 8:38 PM IST

దేశ రాజధాని దిల్లీలో నెలకొన్న కరోనా ఉద్ధృతి పరిస్థితులపై అధికార పార్టీ ఆప్‌ ఎమ్మెల్యే షోయబ్‌ ఇక్బాల్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. మహమ్మారి కట్టడిలో ప్రభుత్వం విఫలమైందని.. వెంటనే రాష్ట్రపతి పాలన విధించేందుకు ఆదేశాలు జారీ చేయాలని దిల్లీ హైకోర్టును కోరారు. అయితే అధికార పార్టీ ఎమ్మెల్యేనే ప్రభుత్వంపై విమర్శలు చేయడంపై ఆప్​ నేతలు ఎవరూ స్పందించలేదు.

"ఎమ్మెల్యేగా ఎన్నికైనందుకు చాలా సిగ్గుపడుతున్నా. నా వల్ల ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేకుండా పోయింది. కనీసం ప్రభుత్వం కూడా వారికి మద్దతుగా నిలువలేకపోతుంది. ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా నా మాట ఎవరూ వినడం లేదు. నేనూ ఎవరినీ సంప్రదించలేకపోతున్నా. దిల్లీలో పరిస్థితులు ఏం బాగోలేవు. దిల్లీ హైకోర్టు కలగచేసుకొని తక్షణమే మూడు నెలల పాటు రాష్ట్రపతి పాలన విధించాలి. లేకపోతే నగరంలో శవాల కుప్పలు చూడాల్సివస్తుంది. "

-షోయబ్​ ఇక్బాల్​, ఆప్​ ఎమ్మెల్యే

యోగి ప్రభుత్వం విఫలం: భాజపా ఎమ్మెల్యే

కరోనా మహమ్మారిని నియంత్రించడంలో యోగి ఆదిత్యనాథ్​ ప్రభుత్వం విఫలమైందని భాజపా ఎమ్మెల్యే సురేంద్ర సింగ్​ దుయ్యబట్టారు. బ్యూరోక్రసీ సహాయంతో మహమ్మారిని కట్టడి చేయడానికి తీసుకున్న చర్యలు బెడిసికొట్టాయని అన్నారు. కష్టకాలంలో ప్రజాప్రతినిధులతో సమాలోచనలు చేయాల్సింది పోయి అధికారులను నమ్ముకుంటే ఇలానే అవుతుందని విమర్శించారు. భాజపా మంత్రులు, ఎమ్మెల్యేలకు వైరస్​ సోకినా.. సరైన చికిత్స అందే పరిస్థితి లేదన్నారు. ఇది ప్రభుత్వ లోపంగా పరిగణించాలని పేర్కొన్నారు.

ఇవీ చూడండి:

'ఆ రాష్ట్రాల్లో ఐదు రెట్ల వేగంతో కొవిడ్​ 2.0 వ్యాప్తి'

భార్య నగలు అమ్మి.. ఆటోను అంబులెన్సుగా మార్చి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.