బంగాల్ ఎన్నికల్లో హింసాత్మక ఘటనల వేళ తక్షణమే మరో 71 కేంద్ర సాయుధ బలగాలను రాష్ట్రంలో మోహరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది ఎన్నికల సంఘం. మిగిలిన 4 దశల పోలింగ్ నిర్వహణకు వారిని వినియోగించనున్నారని అధికారులు తెలిపారు.
ఇటీవల బంగాల్ ఎన్నికల్లో తరచుగా హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. కూచ్‌బెహార్‌లో సీఐపీఎఫ్ జవాన్లు శనివారం చేసిన కాల్పుల్లో నలుగురు మృతిచెందారు. ఆత్మరక్షణ కోసమే కాల్పులు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఇవీ చూడండి: