ETV Bharat / bharat

బికినీ రంగుపై రాజకీయ రగడ! - మహిళల లోదుస్తులు

కన్నడ జెండా రంగుల్లో మహిళల లోదుస్తులు ప్రముఖ ఈ కామర్స్​ సంస్థలో కనిపించటంపై కర్ణాటకలో వివాదం చెలరేగింది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేస్తున్నారు అక్కడి ప్రజలు.

Inner wears in flag colors
కన్నడ జెండా రంగుల్లో మహిళల లోదుస్తులు
author img

By

Published : Jun 6, 2021, 5:40 PM IST

మహిళల లోదుస్తులు కర్ణాటక జెండా రంగుల్లో ఉండటం వివాదానికి దారి తీసింది. దుస్తులు ఈ-కామర్స్​ సంస్థ అమెజాన్​లో కనిపించినట్లు ఆ రాష్ట్ర ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీకేడీఎంహెచ్​హెచ్​హెచ్​ బ్రాండ్​తో ఉన్న లోదుస్తులపై జెండా రంగులు ముద్రించినట్లు తెలుస్తోంది.

ఈ విషయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కర్ణాటక అటవీ శాఖ మంత్రి అరవింద్​ లింబావలి. కన్నడను అవమానించే ధోరణి మానుకోవాలని ట్విట్టర్​ వేదికగా సూచించారు. ఈ అంశం ఆత్మగౌరవానికి సంబంధించినదని, అలాంటి వాటిని సంహించబోమన్నారు. అమెజాన్​పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరారు.

Karnataka Forest minister
కర్ణాటక మంత్రి ట్వీట్​

కన్నడ జెండా రంగుల్లో లోదుస్తులు(బికినీ) కనిపించటం తనను ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు కర్ణాటక రక్షణ వేదిక అధ్యక్షుడు ప్రవీణ్​ శెట్టి. దీనికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి, హోంమంత్రులకు విజ్ఞప్తి చేశారు. కర్ణాటక ప్రజలకు అమెజాన్​ క్షమాపణలు చెప్పాలని డిమాండ్​ చేశారు.

డిలీట్ చేసినా...

నెటిజన్ల ఆగ్రహంతో అమెజాన్ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. జెండా రంగులతో ఉన్న బికినీ ఫొటోను తొలగించింది. అయితే ఆ ఉత్పత్తి డిస్క్రిప్షన్​లో ''ఫ్లాగ్​ ఆఫ్​ కర్ణాటక" అనే వాక్యం తీసేయడం మర్చిపోయింది.

ఇదీ చూడండి: ఇదొక సూపర్​ స్పెషల్ బీర్- ధర రూ.60!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.