ETV Bharat / bharat

Amartya Sen Death Fake News : 'అమర్త్యసేన్ క్షేమంగానే ఉన్నారు'.. క్లారిటీ ఇచ్చిన కుమార్తె - అమర్త్యసేన్ లేటెస్ట్ న్యూస్

Amartya Sen Death Fake News : నోబెల్‌ బహుమతి గ్రహీత, ప్రముఖ అర్థిక వేత్త అమర్త్యసేన్‌ మరణ వార్తలను ఆయన కుమార్తె నందనా దేబ్‌ సేన్‌ ఖండించారు. ఆయన క్షేమంగానే ఉన్నట్లు ఆమె తెలిపారు.

amartya sen death fake news
amartya sen death fake news
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 10, 2023, 5:58 PM IST

Updated : Oct 10, 2023, 6:43 PM IST

Amartya Sen Death Fake News : నోబెల్‌ బహుమతి గ్రహీత, ప్రముఖ అర్థిక వేత్త అమర్త్యసేన్‌ మరణ వార్తలను ఆయన కుమార్తె నందనా దేబ్‌ సేన్‌ ఖండించారు. ఆయన క్షేమంగానే ఉన్నట్లు ఆమె తెలిపారు. అమర్త్యసేన్‌ మరణించారంటూ ఆంగ్ల మీడియాలో, సోషల్‌ మీడియాలో వార్తలొచ్చాయి. దీనిపై తాజాగా ఆమె స్పష్టత ఇచ్చారు. సోమవారం రాత్రివరకు అమర్త్యసేన్ తన వద్దే ఉన్నారని నందన తెలిపారు.

  • Friends, thanks for your concern but it’s fake news: Baba is totally fine. We just spent a wonderful week together w/ family in Cambridge—his hug as strong as always last night when we said bye! He is teaching 2 courses a week at Harvard, working on his gender book—busy as ever! pic.twitter.com/Fd84KVj1AT

    — Nandana Sen (@nandanadevsen) October 10, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

'ఇదంతా ఫేక్ న్యూస్​. బాబా(అమర్త్యసేన్​) క్షేమంగా ఉన్నారు. తప్పుడు వార్తలన్నింటినీ వ్యాప్తి చేయడం మానేయమని అభ్యర్థిస్తున్నా. నేను మా కేంబ్రిడ్జ్ హోమ్‌లో నాన్నతో ఒక వారం గడిపాను. ఆయన హార్వర్డ్‌ యూనివర్సిటీలో రెండు కోర్సులు బోధిస్తున్నారు' అని నందన ట్విట్టర్ వేదికగా తెలిపారు. అమర్త్యసేన్‌ మృతి చెందినట్టు వచ్చిన వదంతులతో పలువురు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఆయన పూర్తిగా క్షేమంగానే ఉన్నట్టు అమర్త్యసేన్‌ కుమార్తె స్పష్టత ఇవ్వడం వల్ల అంతా ఊపిరి పీల్చుకున్నారు.

అంతకుముందు అమర్త్యసేన్ మరణించారని ఈ ఏడాది ఆర్థికశాస్త్ర విభాగంలో నోబెల్ పొందిన చౌడీయా కాల్డియా గోల్డిన్ పేరుతో ఉన్న ఎక్స్​(ట్విట్టర్) అకౌంట్​లో ఓ పోస్ట్​ ప్రత్యక్షమైంది. 'ఒక భయంకరమైన వార్త. నా ప్రియమైన ప్రొఫెసర్ అమర్త్యసేన్ కొద్ది సేపటి క్రితం మరణించారు. మాటలు లేవు.' అని ట్వీట్​లో ఉంది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా అమర్త్యసేన్ మరణవార్తలు మీడియాలో చక్కర్లు కొట్టాయి.

'అమర్త్యసేన్​కు అండగా నిలిచిన దీదీ'
Mamata Supports Amartya Sen : కొన్నాళ్ల క్రితం ఆక్రమిత భూమిని ఖాళీ చేయాలంటూ అమర్త్యసేన్‌కు విశ్వభారతి విశ్వవిద్యాలయం షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో విశ్వభారతి విశ్వవిద్యాలయంపై బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రంగా మండిపడ్డారు. 'అమర్త్యసేన్‌ ఇంటిని తాకితే ఏమి చేస్తానో నాకే తెలియదు' అని గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఒకవేళ ఆయన ఇంటిని ధ్వంసం చేస్తే అక్కడికి వెళ్లి కూర్చుంటానని హెచ్చరించారు. అమర్త్యసేన్‌కు అండగా నిలవాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఆమె సూచించారు. యూనివర్సిటీ చర్యకు వ్యతిరేకంగా ఉద్యమించాలని సూచించారు. విశ్వభారతి యూనివర్శిటీ చర్యను ఏ మాత్రం తాను సహించేది లేదని స్పష్టం చేశారు.

'అమర్త్యసేన్​పై ఆరోపణలు'
అమర్త్యసేన్‌ నివాసం ఉంటున్న 1.38 ఎకరాల విస్తీర్ణంలో చట్టపరంగా ఆయన భూమి కేవలం 1.25 ఎకరాలు మాత్రమేనని.. మిగతా భూమిని ఆయన ఆక్రమించుకున్నారని విశ్వభారతి విశ్వవిద్యాలయం ఆరోపిస్తోంది.

Retired Commander Inder Singh Died : పాకిస్థాన్​ 'గాజీ'ని ముంచిన కమాండర్​ కన్నుమూత.. 1971 యుద్ధం గెలుపులో కీలక పాత్ర

Caste Census Congress : కుల గణన దేశానికి 'ఎక్స్​-రే' లాంటిది: రాహుల్​ గాంధీ

Last Updated : Oct 10, 2023, 6:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.