ETV Bharat / bharat

R5 zone Issue: ఆర్-5 జోన్ వ్యవహారంపై సుప్రీంకోర్టులో రైతుల పిటిషన్ - R5 zone issue today news

Amaravati farmers approach Supreme Court: ఆర్-5 జోన్ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై అమరావతి రైతులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆర్-5 జోన్‌లో వేరే ప్రాంతాల వారికి ఇళ్ల స్థలాల కేటాయింపుపై పిటిషన్‌ వేశారు. ఆ పిటిషన్‌లో పలు కీలక విషయాలను పేర్కొన్నారు.

R5 zone Issue
R5 zone Issue
author img

By

Published : May 6, 2023, 3:07 PM IST

Amaravati farmers approach Supreme Court: ఆర్-5 జోన్ వ్యవహారానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. రాజధాని అమరావతిలో ఇళ్ల స్థలాలు ఇచ్చే ప్రక్రియను నిలువరిస్తూ.. దానిపై రైతులు దాఖలు చేసిన అనుబంధ పిటిషన్లను కొట్టివేసిన విషయం తెలిసిందే. గుంటూరు జిల్లా, ఎన్టీఆర్‌ జిల్లాల కలెక్టర్లకు భూ బదలాయింపు చేస్తూ ఇచ్చిన జీవో 45, దాని ప్రకారం చేసే ఇళ్ల స్థలాల కేటాయింపు ఈ వ్యాజ్యాల్లో తాము ఇచ్చే తుది తీర్పునకు లోబడి ఉంటాయని స్పష్టం చేస్తూ.. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్ర, జస్టిస్‌ రవినాథ్‌ తిల్హరీతో కూడిన ధర్మాసనం శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

ఆర్-5 జోన్‌‌పై సుప్రీంను ఆశ్రయించిన రైతులు.. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులపై స్టే కోరుతూ.. అమరావతి రైతులు ఈరోజు దేశ అత్యున్నత న్యాయస్థానం (సుప్రీంకోర్టు)ను ఆశ్రయించారు. ఆర్-5 జోన్‌లో వేరే ప్రాంతాల వారికి రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల స్థలాలను కేటాయించడంపై సుప్రీంకోర్టులో స్పెషల్​ లీవ్​​ పిటిషన్‌ వేశారు. ఆ పిటిషన్‌లో.. రాష్ట్ర ప్రభుత్వం ఆర్-5 జోన్ విషయంలో విడుదల చేసిన జీవోలను వెంటనే రద్దు చేసేలా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వాలంటూ విజ్ఞప్తి చేశారు.

సుప్రీంకోర్టులో రైతులు ఎస్‌ఎల్‌పీ దాఖలు.. అంతేకాదు, ప్రభుత్వం.. అమరావతి మాస్టర్ ప్లాన్‌కు విరుద్ధంగా జీవోలు తీసుకొచ్చిందన్న రైతులు.. అన్నదాతలు వేసిన మధ్యంతర అప్లికేషన్లను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నిరాకరించిందని పిటిషన్‌లో పేర్కొన్నారు. కోర్టు తుది ఉత్తర్వులకు రాష్ట్ర ప్రభుత్వం లోబడి వ్యవహరించాలని ఆదేశిస్తూ.. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు రాష్ట్ర న్యాయస్థానం విముఖత చూపుతూ ఆదేశాలు జారీ చేసిందని తెలియజేస్తూ సుప్రీంకోర్టులో ఎస్‌ఎల్‌పీ దాఖలు చేశారు. రైతులు దాఖలు చేసిన పిటిషన్‌పై అమరావతి రైతుల తరఫు న్యాయవాదులు ఈ నెల 8వ తేదీన (సోమవారం) ప్రత్యేకంగా ప్రస్తావించనున్నారు. సోమవారం ఉదయం కోర్టు ప్రారంభం కాగానే పిటిషనర్ల తరఫు న్యాయవాదులు సుప్రీంకోర్టులో వాదనలు వినిపించనున్నారు.

అసలు ఏం జరిగిదంటే.. రాజధాని అమరావతిలో రాష్ట్రంలోని ఏ ప్రాంతానికి చెందిన పేదలకైనా ఇళ్ల స్థలాలను కేటాయిస్తూ..ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్చి 31న జీవో జారీ చేసింది. ఆ జీవోలో మంగళగిరి మండలంలోని కృష్ణాయపాలెం, నిడమర్రు, కురగల్లు, తుళ్లూరు మండలంలోని మందడం, ఐనవోలులో 900.97 ఎకరాలను ఆర్‌ 5 జోన్‌గా మార్చినట్లు పేర్కొంది. అంతేకాకుండా ఎస్‌–3 జోన్‌లోని 233.61 ఎకరాలను ఆర్‌–5కి జోడించింది. అనంతరం నిరుపేదల కోసం కేటాయించిన మొత్తం 1,134.58 ఎకరాల్లో గుంటూరు జిల్లా పరిధిలోని లబ్ధిదారులకు 550.65 ఎకరాలు, ఎన్టీఆర్‌ జిల్లా పరిధిలోని లబ్ధిదారులకు 583.93 ఎకరాలను కేటాయించినట్లు జీవోలో వివరించింది. ఆ జీవోను సవాలు చేస్తూ రాజధాని ప్రాంత రైతులు యు.శివయ్య, కె.రాజేష్‌, బెజవాడ రమేశ్‌బాబు, ఆలూరి రాజేష్‌, కుర్రా బహ్మ, కట్టా రాజేంద్రవరప్రసాద్‌, ఐ.సదాశివరావు హైకోర్టులో వ్యాజ్యాలు దాఖలు చేశారు. ఇళ్ల స్థలాల కేటాయింపు ప్రక్రియను నిలువరిస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వాలని కోరారు.

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.