ETV Bharat / bharat

అసోంలో అధికార పీఠం దక్కేదెవరికి? - assam elections main fight

ఈశాన్య రాష్ట్రం అసోంలో.. అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. ఇందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది ఎన్నికల సంఘం. అసోంలో తామే మళ్లీ అధికారంలోకి వస్తామని భాజపా ధీమాగా ఉంది. కాంగ్రెస్​ కూడా గెలుపుపై నమ్మకంతో కనిపిస్తోంది.

asssam counting
అసోంలో అధికార పీఠం దక్కేదెవరికి?
author img

By

Published : May 1, 2021, 7:26 PM IST

అసోం అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. ఆదివారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్​ ప్రారంభం కానుండగా.. ఇందుకోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 126 స్థానాలున్న అసోం శాసనసభకు మూడు విడతల్లో.. మార్చి 27, ఏప్రిల్‌ 1, 6 తేదీల్లో పోలింగ్‌ జరిగింది. ఇక్కడ ఏ పార్టీ అధికారం చేపట్టాలన్నా 64 స్థానాలు సాధించాల్సి ఉంటుంది.

అసోం సమరం..

  • మొత్తం సీట్లు: 126
  • మ్యాజిక్​ ఫిగర్​: 64
  • పోలింగ్​: 3 విడతలు
  • ప్రధాన పోటీ: ​భాజపా-ఏజీపీ, కాంగ్రెస్‌ మహాకూటమి, అసోం జాతీయ పరిషత్‌

ఈసీ చర్యలు..

కరోనా నిబంధనల నడుమ కౌంటింగ్​ నిర్వహించేందుకు ఎన్నికల సంఘం అన్ని చర్యలు చేపట్టింది. ఫేస్​ షీల్డ్స్​, మాస్కుల పంపిణీ, శానిటైజేషన్​ ప్రక్రియను ముమ్మరం చేసింది. కౌంటింగ్​ కేంద్రాలకు వెళ్లే అభ్యర్థులు, వారి ఏజెంట్లు.. కచ్చితంగా కరోనా నెగెటివ్​ రిపోర్టును చూపించాలి. లేదా టీకా రెండు డోసులు తీసుకున్నట్టు ధ్రువపత్రాలను సమర్పించాలి.

అదే సమయంలో.. కౌంటింగ్​ కేంద్రాల బయట ప్రజలు గుమిగూడకుండా చర్యలు చేపట్టింది ఈసీ. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేసింది.

మళ్లీ అధికార పక్షమే!

అసోంలో ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు.. అధికార పక్షానికి అనుకూలంగానే అంచనాలు వెల్లడించాయి. గతం కంటే ఈసారి మెజార్టీ తగ్గినా అస్సామీలు మళ్లీ కమలదళానికే పట్టం కట్టనున్నట్లు పేర్కొన్నాయి.

2016 అసోం అసెంబ్లీ ఎన్నికల్లో .. ఎన్​డీఏ 86, యూపీఏ పార్టీలు 26, ఏఐయూడీఎఫ్​ కూటమి 13 స్థానాల్లో గెలిచాయి.

asssam counting
ఈటీవీ భారత్​ సర్వే

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.