ETV Bharat / bharat

మోదీతో భేటీపై కశ్మీర్​ నేతల తర్జనభర్జన - జమ్ముకశ్మీర్​ రాష్ట్ర హోదాపై మోదీ భేటీ తాాజా సమాచారం

జమ్ముకశ్మీర్​లో రాజకీయ ప్రక్రియ పునరుద్ధరణ అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో జరగనున్న భేటీకి హాజరయ్యే విషయమై అన్ని పార్టీలు చర్చలు ప్రారంభించాయి. తమ పార్టీవర్గాలతో విస్తృత స్థాయిలో మంతనాలు జరుపుతున్నాయి. ఆ భేటీకి హాజరవ్వాలా? వద్దా? అని తర్జన భర్జన పడుతున్నాయి.

modi meeting
మోదీ సమావేశం
author img

By

Published : Jun 20, 2021, 7:16 PM IST

Updated : Jun 21, 2021, 1:12 PM IST

జమ్ముకశ్మీర్​ స్వయం ప్రతిపత్తి రద్దు తర్వాత ఆ ప్రాంతంలో ఏర్పడిన రాజకీయ సంక్షోభాన్ని తొలగించేందుకు కేంద్రం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో గురువారం (జూన్​ 24) నిర్వహించనున్న అఖిలపక్ష భేటీకి హాజరు కావాల్సిందిగా.. 14 మంది జమ్ముకశ్మీర్​ నేతలకు లేఖ రాశారు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్​ భల్లా. ఈ సమావేశంలో పాల్గొనే విషయమై ఆయా పార్టీలు భేటీ అయ్యాయి. అన్ని పార్టీలు భవిష్యత్​ కార్యక్రమంపై విస్తృత స్థాయిలో చర్చలు జరుపుతున్నాయి. మరి ఈ కేంద్రపాలిత ప్రాంతానికి చెందిన రాజకీయ పార్టీల నేతలు ఈ సమావేశంలో పాల్గొంటారా?

ఆ భేటీ తర్వాతే తుది నిర్ణయం

అఖిలపక్ష సమావేశానికి కేంద్రం ఆహ్వానంపై ఆదివారం చర్చలు జరిపేందుకు పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ నేతృత్వంలో ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశమైంది. ముఫ్తీ నివాసంలో రెండు గంటల పాటు నిర్విరామంగా సాగిన ఈ భేటీలో తుది నిర్ణయం తీసుకునే అవకాశాన్ని ఆమెకే ఇచ్చినిట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మంగళవారం జరగనున్న గుప్కార్​ కూటమి సమావేశం తర్వాత తుది నిర్ణయం వెలువడనుందని పేర్కొన్నాయి.

"ఈ విషయమై గుప్కార్ కూటమి.. మంగళవారం భేటీ కానుంది. దీర్ఘకాలిక చర్చలు జరిపి కూటమిలోని పార్టీల సలహాలు, సూచనల ఆధారంగా సమావేశానికి హాజరవ్వాలా? వద్దా? అన్న తుది నిర్ణయం తీసుకుంటారు" అని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

చర్చల్లో ఎన్​సీ

అఖిలపక్ష భేటీకి ప్రధాని పిలుపుపై నేషనల్​ కాన్ఫరెన్స్​(ఎన్​సీ) అధ్యక్షుడు ఫరూఖ్​ అబ్దుల్లా.. పార్టీ శ్రేణులతో చర్చలు జరిపారు. ఈ సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శి అలీ మహ్మద్​ సాగర్​, నాజీర్​ అస్లాం వాణి సహా పలువురు సీనియర్​ నేతలు పాల్గొన్నారు. దీనిపై విస్తృత స్థాయిలో చర్చలు జరుపుతామని.. సోమవారం మరింత స్పష్టత వస్తుందని పార్టీ ప్రతినిధి ఒకరు తెలిపారు. అయితే గుప్కార్​ సమావేశంలో సామూహిక నిర్ణయం తీసుకునే అవకాశముందన్నారు.

'ఆ డిమాండ్​ నెరవేర్చండి'

మోదీ నేతృత్వంలో గురువారం అఖిలపక్ష భేటీ జరగనున్న నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేసింది కాంగ్రెస్​. రాజ్యాంగ, ప్రజాస్వామ్యం ప్రయోజనాల దృష్ట్యా జమ్ముకశ్మీర్​కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలన్న డిమాండ్‌ను కేంద్రం అంగీకరించాలని పేర్కొంది. అయితే ఆ సమావేశానికి హాజరయ్యే విషయమై స్పష్టతను ఇవ్వలేదు. జమ్ముకశ్మీర్​కు రాష్ట్ర హోదా ఇవ్వాలని 2019 ఆగస్టు 6నే కాంగ్రెస్​ డిమాండ్ చేసిందని పార్టీ ప్రతినిధి రణ్​దీప్​ సుర్జేవాలా గుర్తుచేశారు.

కశ్మీర్​ను బుజ్జగించే విధానాలతో..

మోదీ నేతృత్వంలోని భేటీ కోసం రాష్ట్రంలోని పార్టీలన్నీ చర్చలు జరుపుతున్న నేపథ్యంలో జమ్ముకశ్మీర్​ నేషనల్​ పాందర్​ పార్టీ(జేకేఎన్​పీపీ) నిరసనలను చేపట్టింది. 'కశ్మీర్​ను బుజ్జగించే విధానాన్ని' మోదీ ప్రభుత్వం అనుసరిస్తోందని ఆరోపించింది. అలాగే మోదీ సమావేశానికి హాజరయ్యే విషయమై పార్టీ వర్గాలతో సోమవారం భేటీ నిర్వహించి తుది నిర్ణయం తీసుకుంటామని ఆ పార్టీ వ్యవస్థాపకుడు భీమ్​ సింగ్​ తెలిపారు.

కశ్మీర్​ రాజకీయాలపై డోభాల్​ దృష్టి

ప్రస్తుత జమ్ముకశ్మీర్​ రాజకీయ పరిస్థితులను జాతీయ భద్రతా సలహాదారు అజిత్​ డోభాల్​ పర్యవేక్షిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను తెలుసుకునేందుకు జూనియర్​ అధికారులతో వివిధ స్థాయుల్లో సమావేశాలు నిర్వహించారు. ఆర్టికల్​ 370 రద్దు సమయంలో కశ్మీర్​లో భద్రతా పరిస్థితుల పర్యవేక్షణలో కీలక పాత్ర పోషించిన డోభాల్​.. జూన్​ 24న అఖిలపక్ష సమావేశం జరగనున్న నేపథ్యంలో మరోసారి కశ్మీర్​ రాజకీయాలు, భద్రతపై దృష్టిసారించారు.

ఎల్​జీలతో రాజ్​నాథ్​ భేటీ

ఈ క్రమంలో జమ్ముకశ్మీర్​ లెఫ్టినెంట్​ గవర్నర్ మనోజ్​ సిన్హా, లద్దాఖ్​ గవర్నర్​ ఆర్​కే మాథూర్​లతో రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో కశ్మీర్​లోని సమస్యలు, ఆర్టికల్​ 370 రద్దుతోపాటు పలు కీలక అంశాలపై చర్చించినట్లు సమాచారం. ప్రధాని నేతృత్వంలోని అఖిలపక్ష భేటీకి ముందు ఈ సమావేశం జరిగడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇవీ చూడండి:

Last Updated : Jun 21, 2021, 1:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.